వర్కింగ్ జర్నలిస్టుల చట్టాలను కేంద్రం పునరుద్ధరించాల్సిందే
.
70 ఏళ్ల తర్వాత రద్దు చేయడం దారుణం.
వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో నలబ్యాడ్జీలతో శాంతి యుత నిరసన.
కలెక్టరేట్... జూన్ 9
దేశవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించిన రెండు చట్టాలను కేంద్రం రద్దు చేయడం తగదని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, విశాఖ జిల్లా అధ్యక్షులు. పి నారాయణలు అన్నారు. ఆయా రెండు చట్టాలు రద్దును నిరసిస్తూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వర్కింగ్ జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలతో శాంతియుత నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా గంట్ల శ్రీను బాబు, పి..నారాయణలు మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించిన చట్టం 1955లో కేంద్రం అమల్లోకి తేవడం జరిగిందన్నారు. అలాగే వేతనాలు చెల్లింపునకు సంబంధించిన చట్టం 1958 నుంచి అమలు చేయడం జరిగిందన్నారు. మరి 70 ఏళ్ల తర్వాత ఈ రెండు చట్టాలు రద్దు చేయడం వల్ల జర్నలిస్టులకు తీవ్రంగా నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. కాబట్టి కేంద్రం రద్దు చేసిన ఈ రెండు చట్టాలను జర్నలిస్ట్ ల పరిస్థితులు దృష్టి లో ఉంచుకొని తక్షణమే పునరుద్ధరించాలని వీరు డిమాండ్ చేశారు. ఇప్పటికే వర్కింగ్ జర్నలిస్టుల పరిస్థితి దయనీయంగా మారిందని వీరు అభిప్రాయపడ్డారు. జర్నలిస్టులకు పూర్తిస్థాయిలో సంక్షేమం కొరవడిందని,అలాగే ఉద్యోగ భద్రతతో పాటు వేతనాలు చెల్లింపులు,దాడుల నియంత్రణకు సంబంధించి సరైన చట్టాలు లేవని అందువల్లే మీడియా కమిషన్ ఏర్పాటు ను తాము ఎప్పటినుంచో స్వాగతిస్తున్నామన్నారు. వీటితోపాటు అటాక్స్ కమిటీలు,ఇతర ప్రభుత్వ కమిటీల్లో కూడా జర్నలిస్టుల సంఘాలకు విధిగా ప్రాతినిధ్యం కల్పించాల్సిందేనన్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ కార్యదర్శి జి. శ్రీనివాస్ రావు,బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల జిల్లా అధ్యక్షులు ఇరోతి ఈశ్వర్ రావు కార్యదర్శి కె. మదన్. చిన్న మధ్య తరహో పత్రికల సంఘం అధ్యక్షుడు జగన్మోహన్, జర్నలిస్టు నేతలు వి. శ్రీనివాస్ రావు, కృష్ణ మూర్తి నాయుడు, శ్రీనివాస్ నాయుడు, కామన్న, కేవీ శర్మ, చక్రి,,.నాయుడు ,సత్య నారాయణ. నగేష్ బాబు.. శ్రీ లత, మాధవి గౌతమ్,వినయ్, శివ,పాల్గొన్నారు..
వ్యాక్సిన్ తోనే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నియంత్రణ విశాఖపట్నం జూన్ 9. తొమ్మిది నుండి 14ఏళ్ల వయస్సు గల ఆడపిల్లలకు సెర్వావాక్
వ్యాక్సిన్ వేయడం ద్వారానే గర్భాశయ ముఖ్య ద్వార క్యాన్సర్ ను నియంత్రించగలమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ రిటైర్డ్ అధికారి డాక్టర్ సరోజిని అన్నారు.చైతన్య స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ సంయుక్తంగా పాత పోస్టా ఫసు సమీపంలోని మత్స్యకార భవనంలో సోమవారం ఉదయం జర్నలిస్టుల ఆడపిల్లలకు నిర్వహించిన సెర్వావాక్ వ్యాక్సిన్ రెండో డోసు వేసే కార్యక్రమంను ఆమె ప్రారంభించారు. వ్యాక్సిన్ ద్వారానే ది హ్యూమన్ పాపిలోమా వైరస్ ను అరికట్టగలమని ఈ వ్యాక్సిన్ వేసుకునే ఆడపిల్లలకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని తల్లిదండ్రులు ఈ విషయంలో భయపడాల్సిన పనిలేదని చెప్పారు. 45 ఏళ్ల వయసు వరకు మహిళలు ఈ వ్యాక్సిన్ వేసుకోవచ్చని క్యాన్సర్ నియంత్రణకు ఇంతకన్నా మరో మార్గం లేదన్నారు. సభకు అధ్యక్షతన వహించిన చైతన్య స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ షిరీన్ రహమాన్ మాట్లాడుతూ జర్నలిస్టుల ఆడపిల్లల ఆరోగ్య పరిరక్షణకు ఈ వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని చేపట్టామని రెండు డోసులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. సామాజిక రుగ్మతలపై చైతన్య స్రవంతి ప్రజలను చైతన్య పరుస్తూనే ఉందన్నారు. ఇప్పటికే చైతన్య స్రవంతి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని మున్ముందు మరిన్ని సమాజ హిత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సీనియర్ జర్నలిస్ట్ జి. వల్లేశ్వర్ మాట్లాడుతూ చైతన్య స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ సామాజిక సేవే ధ్యేయంగా ఏర్పాటు అయిందని నాటి నుండి నేటి వరకు లక్ష్యాలను సాధించి అన్ని వర్గాలను ఆకట్టుకుందని అన్నారు.. సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ రహమాన్ ప్రస్తుత అధ్యక్షులు షిరిన్ రహమాన్ లు ప్రజారోగ్యంను దృష్టిలో పెట్టుకొని ఇటువంటి వ్యాక్సినేషన్ కార్యక్రమాలు నిర్వహించడం ముదావాహమన్నారు. మరో సీనియర్ జర్నలిస్టు బులుసు ప్రభాకరశర్మ మాట్లాడుతూ ప్రజల కోసం రెహమాన్,షిరీన్ రహమాన్ దంపతులు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయని కొనియాడారు.ఈ సందర్భంగా వల్లేశ్వర్, బులుసు ప్రభాకర్ శర్మ,సరోజినిలను వుడా మాజీ చైర్మన్ రహమాన్, షిరీన్ రహమాన్ దంపతులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు అత్తిలి శంకర్రావు ఏపీడబ్ల్యూజేఎఫ్ విశాఖపట్నం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి నారాయణ్, జి శ్రీనివాస్ మరియు చైతన్య స్రవంతి ప్రతినిధులు విజయ,రుకియా భాను,లక్ష్మీ శారద, ఉమ, దేవి గొలగాని రవీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు
*జూన్ 9న రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టుల ఆందోళన*
*రెండు చట్టాలను కేంద్రం రద్దు చేయడంపై నిరసన*
*ఏపీలో జర్నలిస్టుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి*
*విశాఖలో రాష్ట్రకార్యవర్గం సమావేశం లో కీలక నిర్ణయాలు*
ఆంధ్ర యూనివర్సిటీ.. జులై 29
దేశ వ్యాప్తముగా జర్నలిస్టులకు సంబంధించిన రెండు కీలక చట్టాలను కేంద్రం రద్దు చేయడం పట్ల నిరసిస్తూ జూన్ 9న రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టుల ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్..వెంకటరావు ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు ప్రకటించారు..గురువారం ఇక్కడ ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్లాటినం జూబ్లీ హాల్ లో ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వీరు మాట్లాడుతూ కేంద్రం తాజాగా 44 కార్మిక చట్టాలను రద్దు చేసిందని అందులో రెండు జర్నలిస్టులకు సంబంధించినవి ఉన్నాయన్నారు.. వర్కింగ్ జర్నలిస్టుల చట్టం 1955,
.. వేతనాల చెల్లింపులు చట్టం 1958 రద్దు చేసిన వాటిలో ఉన్నాయన్నారు.. వీటిని తక్షణమే పునరుద్ధరించాలని జూన్ 9 న నిర్వహించే జాతీయ కార్మిక సంఘాలు ఆందోళనలో జర్నలిస్టులు కూడా పాల్గొనాలని వీరు పిలుపునిచ్చారు.
రాష్ట్రము లో.....
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేనిపక్షంలో దశలవారీగా ఆందోళన తప్పదని రాష్ట్ర అధ్యక్షులు ఎస్. వెంకటరావు, జి. ఆంజనేయులు పేర్కొన్నారు.. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న నేటికి అక్రిడేషన్ లు కొత్తవి మంజూరు చేయలేదన్నారు అలాగే ప్రభుత్వాలు మారినప్పటికీ జర్నలిస్టులు ఇళ్ల స్థలాలకు సైతం నోచుకోలేదన్నారు.. 11రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పెన్షన్ పథకం అమలు చేయాలని,
మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని,. ప్రమాద బీమా పునరుద్ధరించాలని ఇలా అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నట్లు వీరు చెప్పారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చేసిన తీర్మానాలను త్వరలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లకు నివేదిస్తామన్నారు. జర్నలిస్టులపై దాడులు నిరోధానికి ప్రత్యేక చట్టం చేయాలని అలాగే జర్నలిస్టులకు పత్రిక స్వేచ్ఛ కల్పించాలని తీర్మానములు చేసారు.. ఈ సమావేశంలో వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, బ్రాడ్ కాస్ట్ కు సంబందించిన నూతన వెబ్ సైట్ ను ఆవిష్కరించారు సమావేశం లో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ విశాఖ వేదికగా త్వరలో రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి తమ కార్యవర్గం తమ వంతు కృషి చేస్తుందన్నారు ఈ సమావేశంలో
ఎన్ ఎ జే సెక్రటరీ జనరల్ ఎం కొండయ్య..జెండర్ ఈక్విటీ కౌన్సిల్ చైర్మన్ కే మంజరి జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీను బాబు విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణ కార్యదర్శి జి శ్రీనివాసరావు బ్రాడ్ కాస్ట్ అధ్యక్షులు ఇరోతి ఈశ్వర్ రావు, కార్యదర్శి కె. మదన్, చిన్న మధ్య తరహో పత్రికల సంఘం అధ్యక్షులు జగన్ మోహన్, కె. శ్రీనివాస్ రావు,వివిధ జిల్లాలకు చెందిన ఫెడరేషన్ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు...
అక్కయ్యపాలెం కూడలి... మే 27:
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో గురువారం ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం (ఎన్ఎజే) కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, విశాఖ జిల్లా అధ్యక్షుడు పి. నారాయణలు తెలిపారు. మంగళవారం అక్కయ్యపాలెం కూడలిలోని ఓ ప్రయివేటు హోటల్లో విశాఖ జిల్లా సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు, పి. నారాయణ్ లు మాట్లాడుతూ గురువారం ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్లాటినం జూబ్లీ హాల్ 2..లో ఉదయం 11 గంటలకు రాష్ట్ర కార్యవర్గం సమావేశం ప్రారంభం కానుందన్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు చెందిన 70 మంది ప్రతినిధులు హాజరుకానున్నట్లు చెప్పారు. సమావేశంలో తాము ఐదు తీర్మానాలను ప్రవేశ పెట్టి, వాటికి రాష్ట్ర కార్యవర్గం ఆమోదం తీసుకుంటామన్నారు. ఇందులో ప్రధానంగా వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు మంజూరు చేయడంతోపాటు జర్నలిస్టుల సంఘాలకు కమిటీల్లో ప్రాతినిధ్యం కల్పించాలని, ప్రమాద బీమా వెంటనే పునర్దురించాలని, 11 రాష్ట్రాల్లో విజయవంతంగా అమలు చేస్తున్న పెన్షన్ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ లో కూడా త్వరగా అమలు చేయాలని, పార్లమెంటులో చర్చించిన విధంగా ఏపీలో మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, చిన్న, మధ్య తరహా పత్రికలకు ఎంప్యానెల్ తో సంబంధం లేకుండా ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చి ప్రోత్సహించాలని తీర్మానాలు చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ కు నివేదిస్తామన్నారు. అంతేకాకుండా రాష్ట్ర మహాసభలకు ఆయా నేతలను ఆహ్వానించడం జరుగుతుందన్నారు. గురువారం నాటి సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులతోపాటు పలు జిల్లాలకు చెందిన ముఖ్య కార్యవర్గ సభ్యులు హాజరుకానున్నట్లు చెప్పారు.ఈ సమావేశంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ విశాఖపట్నం జిల్లా కార్యదర్శి జి. శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.ఎస్. ప్రసాద్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ రంగధామం ఉపాధ్యక్షులు ఆనంద్,ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్
విశాఖ జిల్లా అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కింతాడ మదన్, అసోసియేషన్ ప్రతినిధులు మళ్ల త్రినాధ్, డిపి నాయుడు, జి ఆర్ ఎస్ రమేష్, స్మాల్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ రావు, కార్యదర్శి శ్రీనివాసరావు, కె.వి శర్మ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
వ్యవసాయం, జీవవైవిద్యం సంబంధించి లోతైన విశ్లేషణలతో ఈటీవీ లో కథనాలు ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న సందర్భంగా ఈటీవీ సీనియర్ చీఫ్ రిపోర్టర్ లక్ష్మీ ప్రసాద్ ను సన్మానిస్తున్న APWJF అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపటి రామాంజనేయులు , వివిధ పత్రికలు, టీవీ చానెల్స్ జర్నలిస్టులు .
1980 దశకం వరకు బ్రాడ్‌కాస్ట్ మీడియాలో ప్రభుత్వ మీడియా మాత్రమే కొనసాగింది...
జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఏర్పడిన: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు గౌరవాధ్యక్షులుగా, వి యశోనాథ్, పి. శ్రీధర్ ఈశ్వర్, ఎస్ సౌజన్య, బివిఎల్ కె మనోహర్, వై. జోగిరెడ్డిలతో ఏర్పడిన సంఘం.
© APWJF All Rights Reserved.Design & Developed By