Welcome To APWJF

Andhra Pradesh Working Journalists Federation (APWJF)

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్..

1980 దశకం వరకు బ్రాడ్‌కాస్ట్‌ మీడియాలో ప్రభుత్వ మీడియా మాత్రమే కొనసాగింది...

జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఏర్పడిన: ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు గౌరవాధ్యక్షులుగా, వి యశోనాథ్‌, పి. శ్రీధర్‌, సయ్యద్‌ సజ్జాదుల్‌ హసనన్‌, ఎం.వి వినయ్‌ ఈశ్వర్‌, ఎస్‌ సౌజన్య, బివిఎల్ కె మనోహర్‌, వై. జోగిరెడ్డిలతో ఏర్పడిన సంఘం.

APWJF
APWJF

33

APBJA

33

Distrct Units

25

News

విశాఖపట్నం జిల్లా

26న జర్నలిస్టుల వినాయక చవితి వేడుకలు

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ 600 మందికి మట్టి వినాయక విగ్రహం, వ్రతకల్పం, పూల, పండ్ల మొక్కలు పంపిణీ......

26న జర్నలిస్టుల వినాయక చవితి వేడుకలు

600 మందికి మట్టి వినాయక విగ్రహం, వ్రతకల్పం, పూల, పండ్ల మొక్కలు పంపిణీ

అక్రిడేషన్ లపై వినతి పత్రాలు

జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి గంట్ల

అక్కయ్యపాలెం, ఆగస్టు 21

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపి బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ , ఏపి స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ల ఆధ్వర్యంలో ఈనెల 26న మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, ఫెడరేషన్ విశాఖ అధ్యక్షులు పి.నారాయణలు తెలిపారు. ఈ మేరకు గురువారం అక్కయ్యపాలెంలో ఒక ప్రయివేట్ హోటల్ లో ఆయా సంఘాల సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ప్రతీ ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా వినాయక చవితి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. నిరంతరం సమాజాభివృద్ధి కోసం పాటు పడుతున్న జర్నలిస్టుల సంక్షేమంతో పాటు ఆయా పండుగలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఇందులో భాగంగానే 26న ఆశీలమెట్ట వేమన మందిరంలో ఉదయం 10 గంటల నుంచి 600 మంది జర్నలిస్టులకు మట్టి వినాయక విగ్రహం, వినాయక వ్రతకల్పం, పూల, పండ్ల మొక్కలను అందజేయనున్నట్లు చెప్పారు. కావున జర్నలిస్టులు ఆయా కార్యక్రమంలో పాల్గొని మట్టి వినాయక విగ్రహాలను స్వీకరించాలని వీరు కోరారు. ఈ సమావేశంలో పలు అంశాలపై తాము చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. అలాగే అక్రిడేషన్లు కూడా అర్హులైన వారందరికి అందజేసే విధంగా మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు దశల వారీగా వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ కార్యదర్శి జి.శ్రీనివాసరావు, బ్రాడ్ కాస్ట్ అధ్యక్ష, కార్యదర్శులు ఇరోతి ఈశ్వరరావు, కె.మధన్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్ మోహన్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు బి..శివ ప్రసాద్ నాయుడు, సత్య నారాయణ

ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ సభ్యులు మళ్ళ దేవ త్రినాధ్, డిపి నాయుడు, కె బాబురావు, అప్పలనాయుడు

స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు డీ చక్రపాణి, పీ వెంకట రెడ్డి,కోశాధికారి కే వీ శర్మ,సంయుక్త కార్యదర్శులు బీ ప్రసాద్, రాజశేఖర్,కార్యవర్గసభ్యుడు అరుణ్ భాస్కర్, రెడ్డి సాయి తో
పాటు పలువురు జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.

గుంటూరు

జర్నలిస్టులకు రైల్వే పాస్‌లు పునరుద్ధరించాలి: కేంద్ర మంత్రిని కోరిన APWJF....

జర్నలిస్టులకు రైల్వే పాస్‌లు పునరుద్ధరించాలి: కేంద్ర మంత్రిని కోరిన జర్నలిస్టు సంఘాలు

కోవిడ్ సమయంలో నిలిపివేసిన రైల్వే రాయితీ పాస్‌లను జర్నలిస్టులకు తిరిగి మంజూరు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్( APWJF ) మరియు బ్రాడ్‌కాస్టింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ ( APBJA ) సంయుక్తంగా కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి గుంటూరు జిల్లా క్యాంప్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారూ. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, " రైల్వే పాస్‌ల విషయాన్ని తప్పకుండా పార్లమెంటులో ప్రస్తావిస్తాను . నిలిపివేసిన రాయితీ పాస్‌లు మళ్లీ అమలులోకి రావడానికి నా వంతు కృషి చేస్తాను," అని హామీ ఇచ్చారు. వినతిపత్రంలో, గ్రామీణ మరియు ప్రాంతీయ స్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు రైలు ప్రయాణం ఎంతగానో అవసరమని, రాయితీ పాస్‌ల పునరుద్ధరణ జర్నలిస్టుల కోసం ఎంతగానో ఉపయోగపడుతుందనీ పేర్కొన్నారు. ప్రజలకు విశ్వసనీయ సమాచారాన్ని చేరవేయడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సౌకర్యార్థం పాస్‌ల మళ్లీ ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ బ్రాడ్‌కాస్టింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు బోస్క సువర్ణబాబు, జనరల్ సెక్రటరీ కేశంసెట్టి శ్రీనివాస్, మోపర్తి సువర్ణరాజు, యదనపుడి ఆరుద్ర, గాజుల బ్రహ్మం,బిరుదుల రాజేంద్ర, రవి తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ జిల్లా

రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 4 జర్నలిస్టుల డిమాండ్స్ డే విజయవంతంగా నిర్వహించారు.....

రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కార్యక్రమం జరిగింది. ...

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నీ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 4 జర్నలిస్టుల డిమాండ్స్ డే విజయవంతంగా నిర్వహించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కార్యక్రమం జరిగింది. కొన్ని జిల్లాల్లో పర్యటనలో ఉన్న మంత్రులకు, శాసనసభ్యులకు వినతి పత్రాలు అందజేశారు. అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం సమర్పించారు. వర్కింగ్ జర్నలిస్టులు సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను ఆ వినతి పత్రంలో ప్రస్తావించారు.
జర్నలిస్టుల ఇంటి స్థలాల కేటాయింపు, పెన్షన్ చెల్లింపు, అక్రిడిటేషన్ల జారీకి వీలుగా కొత్త జీవో తీసుకురావడం, మీడియాలోని ప్రస్తుత పరిస్థితిని అధ్యయనం చేసేందుకు వీలుగా మీడియా కమిషన్ ఏర్పాటు, జర్నలిస్టుల అవార్డులను ప్రధానం, రాష్ట్ర కేంద్రంలో వృద్ధ జర్నలిస్టుల కోసం ఓల్డ్ ఏజ్ హోం నిర్మాణం తదితర అంశాలపై ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆ వినతి పత్రంలో కోరింది. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జిల్లా శాఖలకు ఫెడరేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్ వెంకట్రావు ఆంజనేయులు అభినందనలు తెలియజేశారు.

ఎస్ వెంకట్రావు అధ్యక్షులు
జి ఆంజనేయులు ప్రధాన కార్యదర్శి

అల్లూరి సీతారామరాజు జిల్లా

అల్లూరి సీతారామరాజు జిల్లా

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయడంలో పాత్రికేయులు ముందు వరుసలో ఉంటున్నారని రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం పాడేరు విచ్చేసిన మంత్రి మనోహర్ ను కలసి రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారం నిమిత్తం APWJF, APBJA జిల్లా నాయకులు, జర్నలిస్ట్ లు వినతి పత్రం అందజేశారు. పాత్రికేయుల సమస్యల పరిస్కారానికై ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు.

విజయనగరం జిల్లా

ఉమ్మడి విజయనగరం జిల్లాలో 16 చోట్ల వినతి పత్రాలు

ఉమ్మడి విజయనగరం జిల్లాలో 16 చోట్ల వినతి పత్రాలు
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన జర్నలిస్టు డిమాండ్స్ డే కార్యక్రమం విజయనగరం జిల్లా కేంద్రం తో పాటు 10 మండలాల్లోనూ, వినతి పత్రాలు అందజేసినట్టు ఇప్పటివరకు సమాచారం అందింది. విజయనగరం జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తొలత కలెక్టరేట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద తమ డిమాండ్ అని పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. మీడియాతో మాట్లాడిన అనంతరం కలెక్టర్ ఆడిటోరియంలోని నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్థానిక కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టిలో పెడతామని కలెక్టర్ హామీ ఇచ్చారు. జర్నలిస్టులు ఒకంత ఉత్సాహంతోనే ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు.

ప్రకాశం జిల్లా

ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాలకృష గారికి వినతి పత్రం .....

ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాలకృష గారికి వినతి పత్రం సమర్పించి, సమస్యలపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు sv బ్రహ్మం, వి భక్తవత్సలం,, ఎల్ రాజు తిరుపతిరెడ్డి,, M C A అధ్యక్షుడు వి. నాగేశ్వరరావు, ప్రజాశక్తి ఎడిషన్ ఇంచార్జ్ తారక రామారావు,, ఎస్ సురేష్ కుమార్, ఈనాడు శ్రీను, తదితరులు

బాపట్ల జిల్లా

వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలంటూ

వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీడబ్ల్యూజేఎఫ్ తరుపున బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి కి వినతి పత్రం అందజేసిన బాపట్ల జిల్లా జర్నలిస్టులు

కర్నూలు జిల్లా

డిమాండ్స్ డే సందర్భంగా కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషాకు వినతి పత్రం ...

డిమాండ్స్ డే సందర్భంగా కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషాకు వినతి పత్రం ఇస్తున్న ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మద్దిలేటి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోరంట్లప్ప, నగర గౌరవ అధ్యక్షుడు శివకుమార్, నగర అధ్యక్ష కార్యదర్శులు శివశంకర్ ఎర్రమల, సభ్యులు రఫీ, భీముడు, శ్రీను , రమేష్, మణి బాబు

తిరుపతి జిల్లా

జర్నలిస్ట్ సమస్యలపై జిల్లా కలెక్టరేట్ లో వినతి పత్రం నాయకులు

నెల్లూరు

జర్నలిస్ట్ సమస్యలపై జిల్లా కలెక్టరేట్ కు వినతి పత్రం .....

నెల్లూరులో జర్నలిస్ట్ సమస్యలపై జిల్లా కలెక్టరేట్ కు వినతి పత్రం అందిస్తున్న నాయకులు

ఏలూరు జిల్లా

జర్నలిస్టు డిమాండ్స్ డే సందర్భంగా ....

ఏలూరులో....
జర్నలిస్టు డిమాండ్స్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏలూరు జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు sd జబీర్, వైవీహరీష్ ఆధ్వర్యంలో జర్నలిస్టు సోదరులు ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్ ఏలూరు వారికి సమస్యలతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మీ సమస్యలను తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఏలూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి వెట్రి సెల్వి తెలిపారు. ఈ కార్యక్రమంలో , జిల్లా ఉపాధ్యక్షులు కే సోమశేఖర్, సీనియర్ నాయకులు ఎస్ కే బాబ్జి, మిల్టన్ ప్రతాప్, జర్నలిస్టులు జయరాం,సజ్జి , సిహెచ్ ప్రతాప్,నాగేశ్వరరావు ఎస్.కె అఖిల్, శరత్ బాబు,కళ్యాణ్,సత్యనారాయణ,శ్రీనివాస్,సతీష్, సిహెచ్ శ్రీనివాస్,సన్నీ, మౌనిక, నవీన్, కే ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం జిల్లా

జర్నలిస్టుల సమస్యలన్నీ పరిష్కరించండి

జర్నలిస్టుల సమస్యలన్నీ పరిష్కరించండి
‘మీకోసం’లో జిల్లా కలెక్టర్‌కు ఏపీడబ్ల్యూజేఎఫ్‌ నేతల వినతి
శ్రీకాకుళం : రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు సదాశివుని కృష్ణ, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు టి.భీమారావు జిల్లా కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ను కోరారు. ఏపీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో వివిధ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని వారు సమర్పించారు. రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్‌ సౌకర్యం కల్పించాలని, నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే జర్నలిస్టు వృత్తిలో ఉన్నందున అందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలని, హెల్త్‌కార్డులు, ఆరోగ్య బీమా అందించాలని, మీడియ కమిషన్‌ ఏర్పాటు చేయాలని కోరారు. జర్నలిస్టులకు పెన్షన్‌ సౌకర్యం కల్పించాలని, జర్నలిస్టులకు సంబంధించిన అన్ని కమిటీలను పునరుద్ధరించాలని ఈ కమిటీలలో ఏపీడబ్ల్యూజేఎఫ్‌, ఏపీబీజేఏలకు స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మీడియా అకాడమీని, గవర్నింగ్‌ బాడీని ఏర్పాటు చేయాలన్నారు. జర్నలిస్టులకు ఉద్యోగభద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్మికబీమా జర్నలిస్టులకు వర్తింపజేయాలని కోరారు. రైళ్లలో రాయితీ కొనసాగించాలని, ఏసీ బస్సుల్లో రాయితీ కల్పించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. సమాచారశాఖకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించి బలోపేతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి.నర్సింగరావు, ఉపాధ్యక్షుడు డి.నందికేశ్వరరావు, నరసన్నపేట నియోజకవర్గకమిటీ అధ్యక్షుడు కంగు మన్మథరావు, ఏపీబీజేఏ ఉపాధ్యక్షుడు ఎం.ప్రసాదరావు, జిల్లా ప్రతినిధులు శేఖర్‌, శివశంకర్‌, ఆర్‌.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

అనంతపురం జిల్లా

జర్నలిస్టులకు పెన్షన్, ఉద్యోగ భద్రత కల్పించండి.. APWJF డిమాండ్

అనంతపురం జిల్లా

జర్నలిస్టులకు పెన్షన్, ఉద్యోగ భద్రత కల్పించండి.. APWJF డిమాండ్

జర్నలిస్టుల డిమాండ్స్ డే సందర్భంగా APWJF కలెక్టర్ కు వినతి పత్రం

జర్నలిస్టుల సమస్యలను కలెక్టర్ కు వివరించిన APWJF నాయకులు

ఏపీలో వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కారించాలంటూ.. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేస్తోంది. జర్నలిస్టు డిమాండ్స్ డేను పురస్కరించుకుని.. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు రెండు జిల్లాల కలెక్టర్లను కలిసి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల్ని, వివరించారు.

అనంతపురంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు షఫీ, ప్రధాన కార్యదర్శి రేపటి రామాంజినేయులు ఆధ్వర్యంలో ఇన్ ఛార్జి కలెక్టర్ శివనారాయణ శర్మను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రేపటి రామాంజినేయులు మాట్లాడుతూ జర్నలిస్టుల ఆరోగ్యబీమా కొనసాగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై హర్షం వ్యక్తం చేశారు. అలాగే తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కారించాలన్నారు. జర్నలిస్టుల ఇంటిస్థలాల కేటాయింపుతో పాటు జర్నలిస్టుల ఉద్యోగ భద్రత,, ఇతర సదుపాయాలపై మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. బీహార్ తరహాలో మనరాష్ట్రంలోని జర్నలిస్టులకు 15వేల పెన్షన్ పథకాన్ని అమలు చేయడంతో పాటు సమాచార శాఖను బలోపేతం చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది పూర్తైనా ఇప్పటి వరకు అక్రిడిటేషన్లు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. 6వ తేదిన జరగబోయే క్యాబినెట్ సమావేశంలో ఈ అంశాలన్నింటినీ చర్చించి.. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు..

ఈ కార్యక్రమంలో APWJF నాయకులు జయప్రకాష్, డాక్టర్ సూర్య, వేణుగోపాల్, విజయ్ కుమార్, సుధాకర్, బన్సీలాల్, కేశవ, దాదాపీర్ , రాజారెడ్డి, పవన్, శింగనమల ప్రసాద్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

రాజమండ్రి

రాజమండ్రి APWJF టీమ్ కలెక్టర్ కార్యాలయం వద్ద...

పల్నాడు జిల్లా

కలెక్టర్ కు వినత పత్రం అందజేస్తున్న ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు

పల్నాడు జిల్లా కలెక్టర్ కు వినత పత్రం అందజేస్తున్న ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు

విశాఖపట్నం జిల్లా

కలెక్టరేట్ ఎదుట కదంతొక్కిన జర్నలిస్టులు

*ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ల ఫెడరేషన్ డిమాండ్స్ డేకు అనూహ్య స్పందన

కలెక్టరేట్ ఎదుట కదంతొక్కిన జర్నలిస్టులు

*ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ల ఫెడరేషన్ డిమాండ్స్ డేకు అనూహ్య స్పందన
*
14 డిమాండ్స్ తో కలెక్టర్ కు వినతిపత్రం సమర్పణ

..విశాఖపట్నం ఆగస్టు 4

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు విశాఖపట్నం జిల్లా ఫెడరేషన్ యూనిట్, ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్,ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్లు సోమవారం కలెక్టరేట్ ఎదుట డిమాండ్ల సాధనకై నినాదాలు చేస్తూ కదం తొక్కారు. 14 డిమాండ్లపై జర్నలిస్టులు నినాదాలు చేశారు,, శాంతి యుత నిరసన ప్రదర్శన అనంతరం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ఈనెల ఆరవ తేదీన జరుగనున్న మంత్రివర్గ సమావేశంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తీర్మానాలు చేసి ప్రభుత్వం ఆమోదించాలని కోరారు.ప్రధానంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు,అక్రిడేషన్లు,బీమా సదుపాయం,పింఛన్లు జారీ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ సమస్యలు గుర్తించి జర్నలిస్టు ల న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని అలా కాని పక్షంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని అన్నారు..ఇప్పటికే రాష్ట్ర మంత్రులకు జర్నలిస్టుల సమస్యలను విశాఖపట్నంలో వివరించామని శ్రీనుబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ విశాఖపట్నం జిల్లా యూనిట్ అధ్యక్షులు పోతుమహంతి నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఏసీ. బస్సుల్లో ప్రయాణించే సదుపాయం కల్పించాలని,ప్రమాద బీమా పథకం అమలు చేయాలని, సమాచార శాఖ అన్ని విధాలా జర్నలిస్టులకు సహకరించాలని కోరారు. జిల్లా కలెక్టర్ కు సమర్పించిన వినతి పత్రంలో ప్రధానంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, పింఛన్ సదుపాయం కల్పించాలని, రైల్వే పాసులు జారీ చేయాలని,జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని, అక్క్రిడేషన్ కమిటీల్లో జర్నలిస్టుల సంఘాలకు ప్రాతి నిధ్యం కల్పించాలని,జర్నలిస్టుల కోసం వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే ఎఫ్ జిల్లా కార్యదర్శి జి. శ్రీనివాస్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఏ. సాంబశివరావు,ఆర్గనైజింగ్
సెక్రెటరీ పిఎస్ ప్రసాద్, ఉపాధ్యక్షులు బండారు శివప్రసాద్ ఎన్ రామకృష్ణ వై.రామకృష్ణ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షులు ఈరోతి ఈశ్వరరావు, కార్యదర్శి మదన్, త్రినాథ్, నాయుడు, ఫెడరేషన్ సంయుక్త కార్యదర్శి నగేష్ బాబు,ఆనంద్,స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీ ఎస్ జగన్మోహన్,కోశాధికారి కేవీ శర్మ,సంయుక్త కార్యదర్శి బీ ప్రసాద్,కార్యనిర్వాహక సభ్యులు అరుణ్ భాస్కర్ (హరి),వీ గణేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి జిల్లా

అనకాపల్లి జిల్లా' నర్సీపట్నం

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో జర్నలిస్టుల సమస్యలపై వినతి పత్రం అందిస్తున్న ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు

గుంటూరు జిల్లా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు సమస్యలపై, జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం .....

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు సమస్యలపై, జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం అందజేస్తున్న సందర్భంగా, సోమవారం ఉదయం గుంటూరు జిల్లా కలెక్టరేట్ లోని శంకరన్ హాల్ లో, పిజిఆర్ఎస్ నిర్వహిస్తున్న జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, కు గుంటూరుజిల్లా APWJF,APBJA, అసోసియేషన్ల ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం జాయింట్ కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో భాగంగా APWJF గుంటూరు జిల్లా జనరల్ సెక్రెటరీ పట్నాల సాయికుమార్,వరదల మహేష్ APBJA గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ బోస్క సువర్ణ బాబు,జనరల్ సెక్రటరీ కేశంశెట్టి శ్రీనివాస,రవి గుంటూరు నగర అధ్యక్షులు ప్రమోద్ జనరల్ సెక్రెటరీ షణ్ముఖ,శ్యామ్యూల్ వంశీ,శ్రీనివాస్,వెంకట సాయి,తదితరులు పాల్గొన్నారు.

నంద్యాల జిల్లా

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ నంద్యాల జిల్లా కన్వీనర్ జి. మద్దయ్య యాదవ్ ,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మౌలాలి, నంద్యాల డివిజన్ అధ్యక్షులు మాదాల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. సోమవారం జర్నలిస్టుల డిమాండ్స్ డే ను పురస్కరించుకొని ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ కు నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను వెంటనే మంజూరు చేయాలని, అక్రిడేషన్లు తక్షణమే ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పించాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అక్రిడిటేషన్ల జారీకి వీలుగా కొత్త జీవో తీసుకురావాలని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు ఇక్బాల్ హుస్సేన్, సుబ్బరాయుడు ,నరసింహారెడ్డి, బేతంచర్ల సుబ్బరాయుడు, రాకేష్, కిషోర్, జర్నలిస్ట్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

శ్రీ సత్యసాయి జిల్లా

శ్రీ సత్యసాయి జిల్లా

పెనుకొండ మండలం తహసిల్దార్ కు వినతిపత్రం సమర్పిస్తున్న APWJF నాయకులు.

పశ్చిమగోదావరి జిల్లా

భీమవరంలోజర్నలిస్టుల డిమాండ్స్ వినతి పత్రాన్ని అందజేస్తున్న

జర్నలిస్టు సమస్యలు పరిష్కరించాలి
వి వి ఆర్ ఎం 1 భీమవరంలో జెసికి వినతిపత్రం అందజేస్తున్న ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు
ప్రజాశక్తి - వీరవాసరం

ప్రజలకు ప్రభుత్వాలకు వారిదిగా ఉంటున్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏపిడబ్ల్యూజేఎఫ్ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు గుండా రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జర్నలిస్టుల డిమాండ్స్ డే ను పురస్కరించుకుని భీమవరం జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గుండా రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్న జర్నలిస్టుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయన్నారు. జర్నలిస్టుల అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామన్న ప్రభుత్వ హామీలు నీటిపై రాతలుగా మిగిలిపోయాయి అన్నారు. తక్షణమే అర్హురైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో జర్నలిస్టుల యూనియన్లను అక్రిడేషన్ కమిటీలోకి తీసుకొని ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ కార్డులు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీడియా అకాడమీని బలోపేతం చేయాలన్నారు జర్నలిస్టులందరికీ ప్రమాద బీమా కల్పించాలన్నారు జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంతపురం నాని, ఉండ్రు నరేష్, మోహన్ రావు మోహనరావు, గొట్టేటి శ్రీనివాసరావు, నెల్సన్ ,సీమకుర్తి బాలాజీ, మల్లుల జై కృష్ణ, దొంగ సత్తిబాబు ,అంజిబాబు,తదితరులు పాల్గొన్నారు

ఈస్ట్ గోదావరి జిల్లా

కాకినాడలో కదంతొక్కిన జర్నలిస్టులు

కాకినాడలో కదంతొక్కిన జర్నలిస్టులు

ఫెడరేషన్ ఆధ్వర్యంలో డిమాండ్స్ డే

కలెక్టరేట్ ఎదుట రాస్తారోకో, నిరసన

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని నినాదాలు

కలెక్టర్ కు వినతిపత్రం అందజేత

కాకినాడ, ఆగష్టు 4 : జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాకినాడలో జర్నలిస్టులు కదం తొక్కారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు సోమవారం డిమాండ్స్ డే నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి జర్నలిస్టులు కలెక్టరేట్ కు చేరుకొని అక్కడ నిరసన వ్యక్తం చేసి రాస్తారోకో చేపట్టారు. అనంతరం కలెక్టర్ షన్మోహన్ కు డిమాడ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు వాతాడ నవీన్ రాజ్, కార్యదర్శి ముమ్మిడి లక్ష్మణ్ మాట్లాడుతూ జర్నలిస్టుల పట్ల ప్రభుత్వాల వైఖరి మారాలని కోరారు. జర్నలిస్టులకు ఇళ్ళ స్ధలాలు ఇస్తామని జీఓ లు విడుదల చేస్తూ దానిని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నాయని విమర్శించారు. చివరికి అక్రిడేషన్లు ప్రతీ ఏడాది ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారన్నారు. అనేక రాష్ట్రాలలో సీనియర్ జర్నలిస్టులకు ఫెన్షన్ సదుపాయం ఇస్తున్నందున ఇక్కడ కూడా వెంటనే అమలు చేయాలని, ఇప్సటికైనా జిల్లాలోని జర్నలిస్టులు అందరికి ఇళ్ళ స్ధలాలు ఇవ్వాలని, వెంటనే అక్రిడేషన్ల జీఓ జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా నాయకులు ఎండి అధికార్, జి. శోభన్ బాబు,డి శ్రీధర్, పుర్రే త్రినాధ్, నానాజీ, బాబీ, సత్తిబాబు, వాసంశెట్టి శ్రీనివాస్, జగ్గంపేట నియోజకవర్గ అధ్యక్షులు వీరభద్రరావు, కార్యదర్శి పండు, పిఠాపురం నియోజకవర్గ అధ్యక్షులు సత్య, పెద్దాపురం నియోజకవర్గ అధ్యక్షులు రెడ్డి, తుని నియోజకవర్గ నాయకులు బి. ప్రవీణ్, పడాల ప్రసాద్, లోవరాజు, తాళ్ళరేవు నాయకులు మల్లేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య జిల్లా

రాయచోటిలో జిల్లా కలెక్టర్ వినతిపత్రం అందిస్తున్న ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు

అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో జిల్లా కలెక్టర్ వినతిపత్రం అందిస్తున్న ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు

గుంటూరు జిల్లా

జర్నలిస్టు పిల్లలకు 50% ఫీజు రాయితీ కల్పించిన జిల్లా విద్యాశాఖ ఆధికారి కి చిరు సత్కారం...

గుంటూరు జిల్లా జర్నలిస్టు పిల్లలకు 50% ఫీజు రాయితీ కల్పించిన జిల్లా విద్యాశాఖ ఆధికారి కి చిరు సత్కారం

గుంటూరు జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల పిల్లల ఫీజు రాయితీ కి సంబంధించి జిల్లా కలెక్టర్ గారిచే ప్రొసీడింగ్స్ అందించిన శుభసందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (APWJF), ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌ కాస్టింగ్ జర్నలిస్టు అసోసియేషన్ (APBJA) గుంటూరు జిల్లా యూనియన్‌ తరపున గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సువర్ణ బాబు మాట్లాడుతూ గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సామాజిక శ్రేయస్సు కాంక్షిస్తూ ప్రజల కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టు పిల్లల ఉజ్వల భవిష్యత్తు కా వారికి తోడ్పాటు అందించే విధంగా స్కూలు ఫీజు లో 50% రాయితీ కల్పిస్తూ మానవతా దృష్టితో ఈ రాయితీ అందించడం అభినందనీయమని అన్నారు. దీనికి సహకరించిన జిల్లా కలెక్టర్ మరియు ఇతర జిల్లా అధికారులకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో APWJF గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పట్నాల సాయికుమార్ మహేష్ వరదల, APBJA గుంటూరు జిల్లా అధ్యక్షుడు బోస్క సువర్ణ బాబు, ప్రధాన కార్యదర్శి కేశంశెట్టి శ్రీనివాస, బ్రహ్మం రవి, రాజేష్, నవీన్, షణ్ముఖ తదితరులు పాల్గొన్నారు.

విజయనగరం జిల్లా [బాడంగి ]

తహసీల్దార్ కు వినతి పత్రం అందజేస్తున్న ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు

విజయనగరం జిల్లా బాడంగి మండలంలో స్థానిక తహసీల్దార్ కు వినతి పత్రం అందజేస్తున్న ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు

మన్యం జిల్లా, పార్వతీపురం

ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సీతానగరం తాసిల్దార్ కు వినతి .....

పార్వతిపురం మన్యం జిల్లా సీతానగరం తాసిల్దార్ కు వినతి పత్రం అందజేస్తున్న దృశ్యం

ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన జర్నలిస్టు డిమాండ్స్ డే కార్యక్రమం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంతో పాటు 6 మండలాల్లోనూ వినతి పత్రాలు అందజేసినట్టు ఇప్పటివరకు సమాచారం అందింది. జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తొలత కలెక్టరేట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద తమ డిమాండ్ అని పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. మీడియాతో మాట్లాడిన అనంతరం కలెక్టర్ ఆడిటోరియంలోని నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోనూ జర్నలిస్టులు ఒకంత ఉత్సాహంతోనే ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు.

మన్యం జిల్లా, పార్వతీపురం

ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో కొమరాడలో డిమాండ్స్ డే కార్యక్రమం....

కొమరాడలో తాహసిల్దార్ సత్యనారాయణ కు విలేకరులు వినతిపత్రం అందజేత

మన్యం జిల్లా

పార్వతీపురం మండలం జిల్లా భామిని

ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో డిమాండ్స్ డే కార్యక్రమం....

పార్వతీపురం మండలం జిల్లా భామిని డిప్యూటీ తహసీల్దార్ శంకర్ రాయుడికి అందజేయడం జరిగింది

పార్వతీపురం జిల్లా కురుపాం మండల

తాసిల్దార్ కు ఏపీడబ్ల్యుజె ఎఫ్ వినతి

పార్వతీపురం జిల్లా కురుపాం మండల తాసిల్దార్ కు ఏపీడబ్ల్యుజె ఎఫ్ వినతి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా

ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్ వద్ద నిరసన .....

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని సోమవారం ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను వెంటనే మంజూరు చేయాలని, అక్రిడేషన్లు తక్షణమే ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు

చిత్తూరు జిల్లా

* డిమాండ్లను పరిష్కరించాలని కలెక్టర్ కు ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు వినతి

యూనియన్లకు అతీతంగా ప్రైవేట్ పాఠశాలల్లో జర్నలిస్టు పిల్లలకు రాయితీ

- జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం

* డిమాండ్లను పరిష్కరించాలని కలెక్టర్ కు ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు వినతి

చిత్తూరు, ఆగస్టు 4 : యూనియన్లుకు అతీతంగా అక్రిడిటేషన్ కలిగిన ప్రతి జర్నలిస్టు పిల్లలందరికీ ప్రైవేటు విద్యాసంస్థలలో ఫీజు రాయితీ వర్తిస్తుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేశారు. జర్నలిస్ట్ డిమాండ్ డే ను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ( ఏపీడబ్ల్యూజేఎఫ్ ) చిత్తూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక గాంధీ విగ్రహం ఎదుట జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు బీ ప్రకాష్ కలెక్టర్ తో మాట్లాడుతూ .... చిత్తూరు నగరంలోని ఒక జర్నలిస్ట్ యూనియన్ సభ్యుల పిల్లలకు మాత్రమే ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు రాయితీ వర్తిస్తుందని ప్రచారం జరుగుతోందన్నారు. అన్ని యూనియన్ల సభ్యుల పిల్లలకు రాయితీ వర్తించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అదే విధంగా అర్హులైన ప్రతి ఒక జర్నలిస్టుకూ అక్రిడిటేషన్ అందేలా చూడాలని, 3 సెంట్ల మేర ఇళ్ల స్థలాలను కేటాయించాలని, జర్నలిస్టులపై దాడులను నివారించాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, వృద్ధ జర్నలిస్టుల కోసం ఆశ్రమాలను ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన కలెక్టర్ మాట్లాడుతూ యూనియన్లతో నిమిత్తం లేకుండా అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టు పిల్లలందరికీ ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు రాయితీ వర్తిస్తుందని, జర్నలిస్టులపై దాడులు చేసే వారి వివరాలను పోలీస్ ఎఫ్ఐఆర్ తో సహా తనకు అందజేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. అదేవిధంగా చిత్ర నగరంలో పనిచేస్తున్న ఇల్లు లేని జర్నలిస్టులు వివరాలను తనకు అందజేస్తే తప్పకుండా వారికి ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా ధర్నా కార్యక్రమంతో పాటు, కలెక్టర్ ను కలిసిన వారిలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కోశాధికారి పట్నం కృపానందరెడ్డి, సంయుక్త కార్యదర్శి యాదవేంద్రరెడ్డి, ప్రచార కార్యదర్శి దినేష్ ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్టింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ( ఏపీ బిజెఏ ) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జయచంద్ర, నీరజాక్షలు, ఉపాధ్యక్షులు కమలాపతిరెడ్డి, కృష్ణమూర్తిరెడ్డి, ఏపీడబ్ల్యూజేఎఫ్ చిత్తూరు నియోజకవర్గ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏ కేశవులు, బాలసుబ్రమణ్యం, ఉపాధ్యక్షులు మురళీకృష్ణ, కోశాధికారి నాగరాజు, సంయుక్త కార్యదర్శులు కుభేంద్రన్, తులసిరెడ్డి, సురేందర్రెడ్డి, సత్యంప్రసాద్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ జిల్లా

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టు డిమాండ్స్ డే ....

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టు డిమాండ్స్ డే కార్యక్రమం సోమవారం ఎన్టీఆర్ జిల్లా కేంద్రం విజయవాడలో ఘనంగా జరిగింది. ఏపీడబ్ల్యుజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్. వెంకట్రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు గార్ల నాయకత్వంలో జిల్లా నాయకులు కలిసి వెళ్ళి కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమంలో వున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా॥ జి. లక్ష్మీశను కలిసి జర్నలిస్టుల డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. వర్కింగ్ జర్నలిస్టులు సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను ఆ వినతి పత్రంలో ప్రస్తావించారు. జర్నలిస్టుల ఇంటి స్థలాల కేటాయింపు, పెన్షన్ చెల్లింపు, అక్రిడిటేషన్ల జారీకి వీలుగా కొత్త జీవో తీసుకురావడం, మీడియాలోని ప్రస్తుత పరిస్థితిని అధ్యయనం చేసేందుకు వీలుగా మీడియా కమిషన్ ఏర్పాటు, జర్నలిస్టుల అవార్డులను ప్రధానం, రాష్ట్ర కేంద్రంలో వృద్ధ జర్నలిస్టుల కోసం ఓల్డ్ ఏజ్ హెూం నిర్మాణం తదితర అంశాలను మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని కలెక్టర్ని కోరారు.
ఆ తర్వాత రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో అందుబాటులో వున్న అడిషనల్ జాయింట్ డైరెక్టర్ స్వర్ణలత గారికి, జాయింట్ డైరెక్టర్ కిరణ కుమార్ గారికి వినతిపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఫెడరేషన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కలిమిశ్రీ, కృష్ణాజిల్లా మాజీ కార్యదర్శి ఖాజావలి, రాజు, చొప్పా రాఘవేంద్రశేఖర్, వైడి. ఆనంద్, మైలవరం నియోజకవర్గ నాయకులు షేక్ సల్మాన్, వీసం సురేష్ బాబు, అవుటి బాబు, మురళి, పల్లెటి కాంతారావు, చింతకాయల రాంబాబు, మంతెన శ్రీనివాసులు పాల్గొన్నారు.

కడప జిల్లా

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టు డిమాండ్స్ డే

జర్నలిస్టుల సమస్యల, ప్రభుత్వం కల్పించాల్సిన సౌకర్యాలపై ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కడప జిల్లా శాఖ డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడుకు వినతి పత్రం అందించిన ఫెడరేషన్ నాయకులు.

గుంటూరు

ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌ కాస్టింగ్ జర్నలిస్టు అసోసియేషన్ – గుంటూరు నగర నూతన కార్యవర్గం ఎన్నిక.

ఏపీడబ్ల్యూజేఎఫ్ బ్రాడ్ కాస్టింగ్ గుంటూరు నగర కమిటీ ప్రమాణ స్వీకారం.

ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌ కాస్టింగ్ జర్నలిస్టు అసోసియేషన్ – గుంటూరు నగర నూతన కార్యవర్గం ఎన్నిక.

ఘనంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ బ్రాడ్ కాస్టింగ్ గుంటూరు నగర కమిటీ ప్రమాణ స్వీకారం.

గుంటూరు: జూలై 25
గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌ కాస్టింగ్ జర్నలిస్టు అసోసియేషన్ గుంటూరు నగర నూతన కమిటీ ప్రమాణ స్వీకారం మహోత్సవం శుక్రవారం స్థానిక ఏపీ ఎన్జీవో హోం నందు ఘనంగా జరిగింది. ఈ ప్రమాణ స్వీకారం మహోత్సవానికి గుంటూరు బ్రాడ్ కాస్టింగ్ అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు బోస్క సువర్ణ బాబు ,ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా సెక్రెటరీ పట్నాల సాయికుమార్, గుంటూరు జిల్లా సలహాదారు రాజా,తెనాలి ఏపీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షులు శ్యాంసుందర్, ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రాడ్ కాస్టింగ్ గుంటూరు నగర కమిటీ ఏర్పాటు చేయడం అభినందనీయమని రానున్న రోజుల్లో ఫెడరేషన్ అభివృద్ధికి తోడ్పాటున అందిస్తూ జర్నలిస్టుల యొక్క సమస్యలను పరిష్కారం చేయటంతో పాటు వారి అభివృద్ధి అభ్యున్నతికి తోడ్పాటు అందించే విధంగా ఐక్యతతో అందరు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు.నూతన కమిటీ సభ్యులుగా నగర అధ్యక్షులుగా బలగాం ప్రమోద్ కిరణ్ , ప్రధాన కార్యదర్శిగా మెట్ట షణ్ముఖ కోశాధికారిగా అంగిరేకుల గోపి,గౌరవ అధ్యక్షులుగా కంచర్ల నాగరాజు,కార్యనిర్వాహక కార్యదర్శిగా మేకల లక్ష్మణ్,ఉపాధ్యక్షులుగా బుడ్డుల జోసఫ్ ప్రసాద్, కార్యదర్శిగా కోట సిద్దు, ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన కమిటీకి పలువురు అభినందనలు తెలియజేస్తూ ఆత్మీయ సత్కారం అందించారు. ఈ సందర్భంగా నూతన నగర కమిటీ అధ్యక్షులు బలగం ప్రమోద్ కిరణ్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఫెడరేషన్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తూ మరింత బలోపేతం చేసేందుకు కలిసికట్టుగా పని చేస్తామని తెలియజేశారు.తనకు ఈ పదవి అందించినా జిల్లా మరియు రాష్ట్ర కమిటీ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ సీనియర్ నాయకులు జహీర్,మహేష్,మణి సాగర్, ఆరుద్ర,శ్యాముల్,శివ, పొనుగుభాటి నాగరాజు,సువర్ణ రాజు,బ్రహ్మం,రవి,మురళి తదితరులు పాల్గొన్నారు

విశాఖపట్నం జిల్లా

ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన

ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన. విశాఖపట్నం, జూలై 9. కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా మంగళవారం చేపట్టిన సమ్మె నేపథ్యంలో కార్మిక సంఘాలు రైల్వే డీఆర్ఎం కార్యాలయం నుండి జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ బొమ్మ వరకూ నిర్వహించిన ప్రదర్శనలో ఏపీడబ్ల్యూజేఎఫ్ విశాఖపట్నం జిల్లా యూనిట్ పాల్గొని సంఘీభావం తెలిపింది.కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసిన సందర్భంగా జరిగిన ర్యాలీలో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, ఏపీడబ్ల్యూజేఎఫ్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పి. నారాయణ్ కార్యదర్శి జి. శ్రీనివాస్, స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్, ఇతర నేతలు రాజశేఖర్, త్రినాథ్, మధు, కాంతారావు తదితరులు పాల్గొన్నారు. రద్దు చేసిన ఈ చట్టాలను పునరుద్దించాలని, జర్నలిస్టుల హక్కులు కాపాడాలని నినాదాలు చేసారు.ఈ సందర్బంగా గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ రద్దు చేసిన జర్నలిస్టుల చట్టాలను పునరుద్దరించాలని, జర్నలిస్టుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు.

గుంటూరు

ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబిజేఏ సంఘీభావ ర్యాలీ (APWJF- APBJA)

ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబిజేఏ సంఘీభావ ర్యాలీ (APWJF- APBJA)

దేశవ్యాప్తంగా బుధవారం కార్మిక సంఘాల సమ్మె సందర్భంగా, రాష్ట్ర కమిటీ మేరకు గుంటూరులో ఏపీడబ్ల్యూజేఎఫ్ (APWJF), ఏపీబిజేఏ (APBJA) నాయకత్వంలో ర్యాలీ నిర్వహించారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి బీఆర్ స్టేడియం వరకు నిర్వహించిన నిరసన ర్యాలీలో జిల్లా యూనిట్లు పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 44 కార్మిక చట్టాలను వెంటనే పునరుద్ధరించాలని, జర్నలిస్టుల హక్కులను పరిరక్షించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా APWJF ప్రధాన కార్యదర్శి సాయికుమార్. APBJA గుంటూరు జిల్లా అధ్యక్షుడు బి. సువర్ణబాబు, ప్రధాన కార్యదర్శి కె. శ్రీనివాస్,మహేష్,శామ్యూల్, సాయి,శివ,మురళీ,అవినాష్, రవి,శ్రీను తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గంభీరంగా స్పందించాలని, రద్దు చేసిన చట్టాలను వెంటనే పునరుద్ధరించాలి" అని స్పష్టంగా హెచ్చరించారు.

ఎన్టీఆర్ జిల్లా

జర్నలిస్టుల సమస్యలపై రాష్ట్ర మంత్రులను కలిసిన ఏపీడబ్ల్యుఎఫ్ రాష్ట్ర కార్యవర్గం....

రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఆరోగ్య భీమా సమగ్ర భీమా పథకాల కొనసాగింపునకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర సమాచార గ్రహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రతినిధి వర్గానికి తెలియజేశారు. వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ కమిటీ నియామకం కూడా త్వరలో పూర్తి చేయనున్నట్టు ఆయన చెప్పారు. ఈ మేరకు సమాచార శాఖ డైరెక్టర్ కు ఆదేశాలు ఇచ్చినట్లు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రతినిధి వర్గం జూలై 9వ తేదీన సచివాలయంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు ఇంటి నిర్మాణానికి సంబంధించి సబ్ కమిటీ లోని మంత్రులను విడిగా కలిసి వారి ముందు ఫెడరేషన్ ప్రతిపాదనలను పెట్టింది. ఆ సందర్భంగా రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధిని, రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ను, పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పొంగూరి నారాయణ ను కలిసి వినతి పత్రం అందజేసింది. రాష్ట్రంలోని జర్నలిస్టుల అందరికీ ఇంటి స్థలం ఇచ్చేందుకు ఇంటి నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టేందుకు ఫెడరేషన్ తన ప్రతిపాదనలు సూచిస్తూ ఈ వినతి పత్రంలో వివరించింది. ఫెడరేషన్ ప్రతినిధి వర్గములో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్ వెంకట్రావు, జి ఆంజనేయులు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ఎం డి నాథన్ ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ కన్వీనర్ వి శ్రీనివాసరావు లు ఉన్నారు.
జి ఆంజనేయులు
ప్రధాన కార్యదర్శి

చిత్తూరు జిల్లా

ఆంధ్రజ్యోతి సీనియర్ స్టాఫ్ ఫోటోగ్రాఫర్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి- ఏపీడబ్ల్యూ

ఆంధ్రజ్యోతి సీనియర్ స్టాఫ్ ఫోటోగ్రాఫర్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి- ఏపీడబ్ల్యూజేఎఫ్

వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం పర్యటనలో భాగంగా చిత్రీకరణ నిమిత్తం వచ్చిన ఆంధ్రజ్యోతి చిత్తూరు సీనియర్ ఫోటో జర్నలిస్ట్ శివకుమార్ పై దాడి చేసినవారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఎపిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు కవరకుంట్ల జయరాజ్ జిల్లా అధ్యక్షుడు డి ప్రకాష్ డిమాండ్ చేశారు. ఫోటోగ్రాఫర్ పై దాడిని నిరసిస్తూ ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగారుపాలెం మామిడికాయల యార్డ్ వద్ద ఫోటోలు తీస్తున్న ఫోటోగ్రాఫర్ ను కొట్టడం, కెమెరాకు సంబంధించి మెమరీ కార్డుని లాక్కోవడం దారుణం అన్నారు. దాడి చేసిన వారిపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.దర్యాప్తు చేసి దాడులకు కారణమైన వారిని అరెస్ట్ చేయాలని కోరారు. జర్నలిస్టులో రక్షణ కోసం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఓ ప్రత్యేకమైన చట్టాన్ని రూపొందించాలని కోరారు. మీడియా కమిషన్ ఏర్పాటు చేయడం వల్ల ఇలాంటి దాడులను నివారించవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపిడబ్ల్యూజేఎఫ్ చిత్తూరు జిల్లా కోశాధికారి కృపానందరెడ్డి చిత్తూరు నియోజకవర్గ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏ కేశవులు బాలసుబ్రమణ్యం సంయుక్త కార్యదర్శి ఉభేంద్రన్, ప్రసాద్ కోశాధికారి నాగరాజు సీనియర్ జర్నలిస్ట్ యూనియన్ నేతలు మంజునాథ్, మురళి దాము, సిఐటియు జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు తదితరులు పాల్గొన్నారు

కాకినాడ జిల్లా

జర్నలిస్టుల హక్కులను కాపాడాలి

రద్దు చేసిన చట్టాలను పునరుద్దరించాలి కార్మిక సంఘాల సమ్మెలో ఏపీడబ్ల్యూజేఎఫ్.

జర్నలిస్టుల హక్కులను కాపాడాలి

రద్దు చేసిన చట్టాలను పునరుద్దరించాలి
కార్మిక సంఘాల సమ్మెలో ఏపీడబ్ల్యూజేఎఫ్

కాకినాడ, జూలై 9:

కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా బుధవారం చేపట్టిన సమ్మెలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) కాకినాడ జిల్లా కమిటీ నాయకులు పాల్గొని కార్మిక సంఘాలకు మద్దతు తెలిపారు. కాకినాడ మెయిన్ రోడ్డు హెడ్ పోస్టాఫీసు నుంచి బాలాజీ చెరువు సెంటర్,జీజీహెచ్, జిల్లా పరిషత్ సెంటర్ల మీదుగా కలక్టరేట్ వరకు నిర్వహించిన ప్రదర్శనలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా యూనిట్ పాల్గొని సంఘీభావం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసిన సందర్భంగా జరిగిన ర్యాలీలో ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు వాతాడ నవీన్ రాజ్, ముమ్మిడి లక్ష్మణ్, జిల్లా కమిటీ సభ్యులు కె. సత్యనారాయణ, వల్లూరి నానాజీ, పుర్రే త్రినాథ్, రాజు, మంజన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలతో కలిసి రద్దు చేసిన ఈ చట్టాలను పునరుద్దించాలని, జర్నలిస్టుల హక్కులు కాపాడాలని నినాదాలు చేసారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో నవీన్ రాజ్ మాట్లాడారు.

ఈ సందర్బంగా మీడియాను ఉద్దేశించి నవీన్ రాజ్, లక్ష్మణ్ మాట్లాడుతూ రద్దు చేసిన జర్నలిస్టుల చట్టాలను పునరుద్దరించాలని, జర్నలిస్టుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 44 కార్మిక చట్టాలలో మీడియాకు సంబంధించిన వర్కింగ్ జర్నలిస్ట్ ఆక్ట్ పేమెంట్ ఆఫ్ వేజెస్ ఆక్ట్ కూడా ఉన్నాయన్నారు.కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలకె 4 లేబర్ కొడ్లను మోడీ ప్రభుత్వం తీసుకుని రావడం దుర్మార్గమన్నారు. ఇవి అమలులోకి వస్తే కార్మికవర్గం 200 ఏళ్ల వెనుకటి పరిస్థితులకు నెట్టబడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మికుల హక్కుల పరిరక్షణ ఉద్యమంతో పాటు జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరంతరం పోరాడుతున్నదని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. కార్మికులు చేసే ప్రతి ఆందోళనకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. ప్రభుత్వం వెంటనే లేబర్ కోడ్లను పునరుద్ధరించకపోతే ఆందోళనలు మరింత ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఫెడరేషన్ సభ్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.

కర్నూలు జిల్లా

రద్దు చేసిన జర్నలిస్టుల హక్కుల చట్టాలను పునరుద్ధరించాలి

- సార్వత్రిక సమ్మెకు మద్దతు తెలిపిన ఏపీడబ్ల్యూజేఎఫ్

రద్దు చేసిన జర్నలిస్టుల హక్కుల చట్టాలను పునరుద్ధరించాలి
- సార్వత్రిక సమ్మెకు మద్దతు తెలిపిన ఏపీడబ్ల్యూజేఎఫ్
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరిని ఖండించిన రాష్ట్ర నాయకులు మద్దిలేటి, గోరంట్లప్ప

కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన జర్నలిస్టు చట్టాలను వెంటనే పునరుద్దరించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మద్దిలేటి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోరంట్లప్ప, ఫొటోగ్రాఫర్ అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు డి.హుస్సేన్ డిమాండ్ చేశారు. బుధవారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నగర అధ్యక్షుడు ఎం.శివశంకర్ అధ్యక్షతన దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెకు ఏపీడబ్ల్యూజేఎఫ్ మద్దతు తెలిపింది. జిల్లా పరిషత్ నుంచి కలెక్టరేట్ వరకు కార్మిక, ఉద్యోగ, పెన్షనర్లు నిర్వహించిన ర్యాలీలో పాల్గొని నిరసన వ్యక్తం చేసింది. ఈసందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రద్దుచేసిన 44 కార్మిక చట్టాల్లో జర్నలిస్టులకు సంబంధించి వర్కింగ్ జర్నలిస్టుల చట్టం 1955, వేతనాల చెల్లింపు చట్టం 1958 ఉన్నాయన్నారు. వీటిని తక్షణమే పునురుద్ధరించాలని కోరారు. కార్మికుల గొంతు నొక్కడంలో భాగంగా జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. జర్నలిస్టులకు సరైన వేతనాలు ఇచ్చేలా చట్టం చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులకు రక్షణ కల్పించడంలో వైఫల్యం చెందాయన్నారు. అందువల్ల జర్నలిస్టులకు రక్షణ చట్టం తేవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కోకన్వీనర్ రమేష్, జిల్లా నాయకులు సునీల్ కుమార్, నగర గౌరవ అధ్యక్షుడు శివకుమార్, కార్యదర్శి ఎర్రమల, సహాయ కార్యదర్శి బాబు, నాయకులు ప్రతాప్, మహ్మద్ రఫీ, పురుషోత్తం, బ్రహ్మయ్య, అనిల్ నర్సిరెడ్డి, మద్దిలేటి యాదవ్ పాల్గొన్నారు.

అనకాపల్లి జిల్లా

సార్వత్రిక సమ్మె కు ఏపీడబ్ల్యూజేఎఫ్ సంఘీభావం

సార్వత్రిక సమ్మె కు ఏపీడబ్ల్యూజేఎఫ్ సంఘీభావం

అనకాపల్లి: కేంద్ర కార్మిక సంఘాలుదేశవ్యాప్తంగా జూలై 9న ఇచ్చిన సమ్మె పిలుపునకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీ డబ్ల్యూజెఎఫ్) సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తోందని ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు భీమరశెట్టి వెంకటేష్ అన్నారు. అనకాపల్లిలో సీఐటీయూ తో కలిసి జర్నలిస్టులు బుధవారం ఆర్.డి.వో. కార్యాలయం వద్ద
ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వెంకటేష్ మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టుల చట్టం, వేతన చెల్లింపు చట్టాలతో పాటు 44 చట్టాలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కార్మిక సంఘాలు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం ప్రకటిస్తున్నామని తెలిపారు. జర్నలిస్ట్ ల సమస్యలు కూడా ఇమిడి వున్నందున తాము కూడా అందులో భాగస్వాములమవుతున్నామని ప్రకటించారు. రద్దు చేసిన కార్మిక చట్టాలను పునరుద్ధరించే దిశగా ట్రేడ్ యూనియన్ లు చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి జర్నలిస్టుల మద్దతు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శశి, కార్యదర్శి పి.నాగ, ఏపీబీజెయు చాంద్ బాషా, జిల్లా సహాయ కార్యదర్శి అజయ్,  సీనియర్ జర్నలిస్టులు కాండ్రేగుల మోహన్, బి. కొండలరావు, గంగాధర్, జగన్, కుమార్, రామకృష్ణ, గోపాల్, అప్పారావు, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

చిత్తూరు జిల్లా

రద్దుచేసిన వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ ను పునరుద్ధరించాలి

* కార్మికుల సార్వత్రిక సమ్మెకు ఏపీడబ్ల్యూజేఎఫ్ సంఘీభావం...

రద్దుచేసిన వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ ను పునరుద్ధరించాలి
_______----------

* కార్మికుల సార్వత్రిక
సమ్మెకు ఏపీడబ్ల్యూజేఎఫ్ సంఘీభావం

చిత్తూరు : దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపుకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ( ఏపీడబ్ల్యూజేఎఫ్ ) సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తోందని ఎపిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకుడు కవరకుంట్ల జయరాజ్ తెలిపారు. బుధవారం ఉదయం చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద కార్మికుల నిరసన కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు పాల్గొన్నారు. పుంగనూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సలీంభాషా, జర్నలిస్టులు పాల్గొన్నారు. సదుం మండల కేంద్రంలో ఎపిడబ్ల్యుజేఎఫ్ నేతలు తాహసిల్దార్ కు వినతిపత్రం సమర్పించారు.
జర్నలిస్టుల వర్కింగ్ జర్నలిస్టుల చట్టం, వేతన చెల్లింపు చట్టాల పునరుద్ధరణతో జర్నలిస్టు వృత్తి ప్రమాణాలను నిలబెట్టాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. లేబర్ కోడ్ 2020 ని వెంటనే రద్దు చేయాలని, రద్దు చేసిన కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు కేంద్రం అందిస్తున్న రైల్వే పాసులను వెంటనే పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. వర్కింగ్ జర్నలిస్టుల చట్టం, వేతన చెల్లింపు చట్టాలతో పాటు 44 చట్టాలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కార్మిక సంఘాలు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం ప్రకటించి జర్నలిస్టులు భాగస్వాములయ్యారు.
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ చిత్తూరు జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాలతో పాటు జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు. చిత్తూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి యాదవేంద్రరెడ్డి, జిల్లా కోశాధికారి కృపానందరెడ్డి, చిత్తూరు నియోజకవర్గ కార్యదర్శి బాలసుబ్రమణ్యం, కోశాధికారి నాగరాజు, సహాయ కార్యదర్శి ఉమాశంకర్, ఉపాధ్యక్షుడు మురళికృష్ణ, సంయుక్త కార్యదర్శి విజయ్. కుబేంద్రన్, జర్నలిస్ట్ నేతలు దామోదర్, జ్ఞాన ప్రకాష్, సత్యం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

ఏలూరు జిల్లా

చిత్తూరు జి కార్మికుల సంఘాలకు మద్దతుగా నిరసన తెలిపిన ఏపీడబ్ల్యూజేఎఫ్ కామ్రేడ్స్..

కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలో కార్మికులకు మద్దతుగా ఏపీడబ్ల్యూజేఎఫ్ మద్దతు పలకటం జరిగినది కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసిన సందర్భంగా జరిగిన ర్యాలీలో జంగారెడ్డిగూడెం పట్టణం నుండి ఏపీడబ్ల్యుఎఫ్ ఆధ్వర్యంలో పాల్గొనడం జరిగినది ఈ చట్టాలను పునరుద్దించాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ తెలియజేయటానికి ఈ నిరసన వ్యక్తం చేసాము అన్ని సంఘాల తో పాటుగా మీడియా కూడా పాల్గొనడం జరిగినది కార్మిక సంఘాల అందరు మద్దతు తెలియజేయడమైనది ఈ కార్యక్రమంలో పట్టణ డివిజన్ అధ్యక్షులు పి ఎన్ వి రామారావు చింతలపూడి నియోజకవర్గ కార్యదర్శి గొల్లమందల శ్రీనివాసరావు సంఘ సభ్యులు ఉప్పల కృష్ణ కలపాల శ్రీనివాసరావు కె రవి కిరణ్ జుజ్జువరపు శ్రీనివాసరెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి కే శంకర్రావు జిల్లా కేంద్రమైన ఏలూరులో కార్మిక సంఘాల నిరసన ప్రదర్శనలు పాల్గొనడం జరిగినది

విశాఖపట్నం జిల్లా

విశాఖ జిల్లాలో జర్నలిస్టులు పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ.

కలెక్టర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఏపీ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్.

విశాఖ జిల్లాలో జర్నలిస్టులు పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ.

కలెక్టర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఏపీ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్.

త్వరలోనే జర్నలిస్టులకు ఉచిత వైద్య పరీక్షలు.

విశాఖపట్నం..
ఆంధ్రప్రదేశ్. వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్, ఏపీ బ్రాడ్ కాస్ట్,స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ సంఘం నేతలు అంతా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ను కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. జాతీయ జర్నలిస్టులు సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు ఆధ్వర్యంలో వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణ
జి శ్రీనివాసరావు. బ్రాడ్ కాస్ట్ అధ్యక్షులు. ఈశ్వరరావు మదన్.,చిన్న మధ్య తరహా పత్రిక ల సంఘం అధ్యక్షులు జగన్మోహన్,, కార్యదర్శి కె., శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ కలెక్టర్ ను కలిసిన అనంతరం జర్నలిస్ట్ స్కూల్ ఫీజు రాయతీ 50%ఇవ్వడం జరిగింది అని త్వరలో జర్నలిస్ట్ లకు ఉచితముగా వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది అని కలక్టర్ చెప్పారన్నారు.... ఈ సందర్బంగా ఫీజు రాయతీ ఉత్తర్వులు కాఫీ అందరు వినియోగించుకోవాలి అని వీరు పేర్కొన్నారు.. జర్నలిస్ట్ ల సంక్షేమం తమ లక్ష్యమని గంట్ల

కాకినాడ జిల్లా

ఇది ఒక రికార్డ్

మండలంలో ఉన్న మొత్తం విలేకరులు మన ఫెడరేషన్ సభ్యత్వం తీసుకున్నారు.

మండలంలో ఉన్న మొత్తం విలేకరులు మన ఫెడరేషన్ సభ్యత్వం తీసుకున్నారు.

ఇది ఒక రికార్డ్

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లిలో మండల APWJF సభ్యత్వ నమోదు కార్యక్రమం సురక్ష ప్యాలస్ లో శనివారం APWJF సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జన స్పందన విలేఖరిగా పనిచేస్తున్న మామిడాల చక్రధర్ రావు ఇటీవల ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నాడు ఫెడరేషన్ అందించిన రూ.5000 చెక్కును సభ్యుల ద్వారా అందించడం జరిగింది.


ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 22 మంది సభ్యత్వాలను నమోదు చేయించుకున్నారు.

ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు సత్య హాజరయ్యారు.

విశాఖపట్నం జిల్లా

జర్నలిస్టులు అన్ని సమస్యలు పరిష్కరిస్తాం...వైద్య పరీక్షలు కు ఆదేశాలు జారీ చేశాం

స్కూల్ ఫీజు రాయితీ ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలని డి ఆర్ ఒ కు ఆదేశాలు.....

జర్నలిస్టులు అన్ని సమస్యలు పరిష్కరిస్తాం...వైద్య పరీక్షలు కు ఆదేశాలు జారీ చేశాం
స్కూల్ ఫీజు రాయితీ ఉత్తర్వులు
వెంటనే ఇవ్వాలని డి ఆర్ ఒ కు ఆదేశాలు
విశాఖపట్నం, జూలై 7
విశాఖ జిల్లాలో ఉన్న జర్నలిస్టులకు సంబంధించిన అన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అన్నారు. సోమవారం జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు ఆధ్వర్యంలో ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, బ్రాడ్ కాస్ట్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ లు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ను కలిసి పెండింగ్ సమస్యలను ప్రస్తావించారు. అలాగే ఇతర జిల్లాల్లో జర్నలిస్ట్ ల కోసం అమలు చేస్తున్న ఉత్తర్వులు కలెక్టర్ కు వీరు అందజేయడం జరిగింది. జర్నలిస్టులకు వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే స్కూల్ ఫీజు రాయితీ ఉత్తర్వులు కూడా తక్షణమే అందజేయాలని డిఆర్ఓ. భవాని శంకర్ ను ఆదేశించారు. ఇంకా జర్నలిస్ట్ లు పెండింగ్ సమస్యలు ఉంటే వాటిని కూడా వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని కలెక్టర్ చెప్పారు.ఫెడరేషన్ విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణ్, కార్యదర్శి జి శ్రీనివాసరావు.ఆర్గనైజింగ్ సెక్రటరీ పి. ఎస్. ప్రసాద్, బ్రాడ్ కాస్ట్ అధ్యక్ష కార్యదర్శులు ఇరోతి ఈశ్వరరావు కే మదన్ చిన్న పత్రికల సంఘం అధ్యక్షులు జగన్మోహన్, ఫెడరేషన్ ఉపాధ్యక్షులు బి శివప్రసాద్, ఎన్ రామకృష్ణ. రాజశేఖర్. పిల్ల నగేష్ బాబు, చక్రి తదితరులు పాల్గొన్నారు.

కాకినాడ

కాకినాడలో ఏపీడబ్ల్యుజేఎఫ్ జిల్లా కమిటీ సమావేశం

-ప్రమాదాలపాలైన జర్నలిస్టులకు ఆర్థిక సాయం అందజేత

కాకినాడలో ఏపీడబ్ల్యుజేఎఫ్ జిల్లా కమిటీ సమావేశం

-జర్నలిస్టుల సమస్యలపై చర్చ

-ప్రమాదాలపాలైన జర్నలిస్టులకు ఆర్థిక సాయం అందజేత

-జర్నలిస్టుల సమస్యలపై నిరంతర పోరాటం చేస్తాం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు

కాకినాడ, జూలై 4,

కాకినాడలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కాకినాడ జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు అయింది. కాకినాడ జిల్లా అధ్యక్ష వాతాడ నవీన్ రాజ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి జర్నలిస్టులకు సంబంధించి వివిధ సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు మాట్లాడుతూ జూన్ 9, 11 తేదీలలో జర్నలిస్టుల సమస్యల సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాలుగా నిరసనలను నిర్వహించామన్నారు. జర్నలిస్టులకు సంబంధించిన రెండు చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందని, దానికి సంబంధించి 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేశామన్నారు. 11వ తేదీన జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి, అక్రిడిటేషన్ సమస్యల కొరకు, దేశంలో 14 రాష్ట్రాలలో జర్నలిస్టులకు పెన్షన్ అమలవుతూ ఉంటే మన తెలుగు రాష్ట్రాలలో పెన్షన్ అనేది పెన్షన్ అమలుకు కార్యరూపం దాల్చలేదని, పెరిగిన మీడియాకు అనుగుణంగా మీడియా కమిషన్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. దీనిపై సమాచార శాఖ మంత్రిని కలిసి సుదీర్ఘంగా చర్చించామని, దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. సచివాలయంలో జర్నలిస్టు సంఘాల అన్నింటితో ఒక సమావేశం ఏర్పాటు చేసి విధివిధానాలు రూపొందిస్తామని తెలియజేశారన్నారు. గత ప్రభుత్వంలో జర్నలిస్టుల ఇళ్లకు సంబంధించి జీవో విడుదల అయిందని ఆ జీవో కు సంబంధించి జర్నలిస్టుల ఇళ్ళ కోసం అప్లికేషన్లు కూడా తీసుకోవడం జరిగిందని, ప్రస్తుత ప్రభుత్వం దానిపై ఇంటి స్థలంతో పాటు ఇల్లును కట్టించే ప్రయత్నం పై కసరత్తు చేస్తుందని మంత్రి తెలియజేశారన్నారు. ప్రస్తుతం జర్నలిస్టులకు రాజకీయరంగులు అంటిస్తున్నారని అటువంటి ప్రయత్నాలు ప్రజాప్రతినిధులు మానుకోవాలని, అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నామని, జర్నలిస్టులు కూడా జర్నలిస్టులానే పని చేయాలన్నారు. జర్నలిస్టుల పెన్షన్ కొరకు పటిష్టంగా పోరాడుతున్నామని, వృద్ధాప్య పెన్షన్లు తీసుకుంటున్నారని మంత్రి సెలవిచ్చారని అదే కాకుండా ముందుగానే జర్నలిస్టులకు పెన్షన్ విధానం కొనసాగింపు చేయాలని కోరామన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టుల ఇల్లు కోసం రాష్ట్రవ్యాప్తంగా 600 నుండి 650 ఎకరాల స్థలం సరిపోతుందని, అలా చూసుకున్న మండలానికి అరెకరం నుండి ఎకరం వరకు సరిపోతుందన్నారు. ఒక నియోజకవర్గానికి లక్షలలో ప్రజలకు న్యాయం చేసే ప్రజాప్రతినిధులు జిల్లాలో మొత్తంగా 500 నుండి 600 మంది జర్నలిస్టులు ఉన్న ఏమి చేయలేకపోతున్నారన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ఏపీడబ్ల్యూజేఎఫ్ తో పాటు మిగతా యూనియన్లు కూడా పనిచేయాలని తెలియజేస్తున్నామన్నారు. కాకినాడ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వాతాడ నవీన్ రాజ్, ముమ్మిడి లక్ష్మణు లు మాట్లాడుతూ సభ్యత్వ నమోదు, జర్నలిస్టుల సమస్యలపై చర్చించి జిల్లాలో ప్రధానంగా ఉన్న సమస్యలపై వివరణలు ఇచ్చారు. ఇటీవల కాలంలో వివిధ ప్రమాదాలకు గురైన ఏపీడబ్ల్యూజేఎఫ్ సభ్యత్వం కలిగిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయ చెక్కులను ముఖ్యఅతిథి చేతుల మీదుగా అందజేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షులు అల్లుమల్లు ఏలియా మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై ఎప్పుడు చిత్తశుద్ధితో పోరాటం చేసే ఏపీడబ్ల్యూజేఎఫ్ మునుముందు కూడా మరిన్ని పోరాటాలు చేసి జర్నలిస్టులకు న్యాయం చేయాలన్నారు. జర్నలిస్టుల పిల్లలకు తన శక్తి మేరకు ఎంతవరకు ఫీజు విషయంలో తగ్గించగలిగితే అంతవరకు మాట్లాడి చేపిస్తానని ఆగస్త్య స్కూల్ కి సంబంధించి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రెజరర్ రామకృష్ణ, రాష్ట్ర సభ్యులు ఎండి అధికార్, ఎస్.కె మున్ని, శ్రీనివాస్, శ్రీహరి రాజు, జిల్లా కమిటీ సభ్యులు బాబి, సత్తిబాబు, జి శోభన్, డి శ్రీధర్, బాబురావు, మల్లేశ్వరరావు, రాజు, వల్లూరి నానాజీ, పుర్రె త్రినాథ్, సత్య, రెడ్డి, స్టాలిన్, లోవరాజు, ప్రవీణ్, రాము, రాంబాబు, కిరణ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం జిల్లా

సమాచార శాఖ మంత్రి దృష్టికి జర్నలిస్టుల సమస్యలు*

*సానుకూలంగా స్పందించిన మంత్రి పార్ధ సారధి

సమాచార శాఖ మంత్రి దృష్టికి జర్నలిస్టుల సమస్యలు*

*సానుకూలంగా స్పందించిన మంత్రి
పార్ధ సారధి*

త్వరలో ప్రమాద భీమా పునరుద్దరణ


*ఇళ్ల కేటాయింపుల పై ముఖ్య మంత్రి
సానుకూలత*


.... విశాఖపట్నం జూన్ 28.


రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ శనివారం రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ కొలుసు పార్థసారధి దృష్టికి తీసుకువెళ్లింది
జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు నాయకత్వంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ విశాఖపట్నం జిల్లా అధ్యక్ష, కార్య దర్శులు పి.నారాయణ్, జి.శ్రీనివాస్, ఏపీబ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఇరోతి ఈశ్వరరావు, మదన్ లు మంత్రి శ్రీ పార్థసారథి కలిసి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు ముఖ్యంగా జర్నలిస్టులకు హెల్త్ కార్డులు త్వరలో మంజూరు చేస్తామని ఇందుకు సంబంధించి 50శాతం ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.జర్నలిస్టులకు పింఛన్లు విషయమై ముఖ్యమంత్రిశ్రీ చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి తగు నిర్ణయం తీసుకొంటామని పేర్కొన్నారు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు లేదా ఇల్లు కేటాయించే విషయమై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని త్వరలో ఇందుకు సంభందించి కార్యాచరణ రూపొందిస్తామని హామీ ఇచ్చారు.ప్రమాద భీమా త్వరలో పునరుద్దరణ చేస్తామని మంత్రి చెప్పారు జర్నలిస్టులకు త్వరలో అక్రిడేషన్లు మంజూరు చేస్తామని డిజిటల్ మీడియాకు అక్క్రిడేషన్లుఇచ్చే విషయమై ప్రభుత్వం నియమ నిబంధనలు పాటించక తప్పదన్నారు అయితే అందరికీ న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నగేష్ బాబు, టి. పి. నాయుడు తదితరులు పాల్గొన్నారు

విశాఖపట్నం జిల్లా

యోగాంద్ర విజయవంతం సందర్బంగా కలెక్టర్ కు ఫెడరేషన్ ఘనంగా సత్కారం

జర్నలిస్టులకు వైద్య పరీక్షలకు ఏర్పాట్లు

జర్నలిస్టులకు వైద్య పరీక్షలకు ఏర్పాట్లు

నేడో రేపో 50% స్కూల్ ఫీజు రాయతీ

*యోగాంద్ర విజయవంతం సందర్బంగా
కలెక్టర్ కు ఫెడరేషన్ ఘనంగా సత్కారం*

సింహాద్రి నాధుడు జ్ఞాపిక అందించిన గంట్ల

విశాఖపట్నం, జూలై 1.
విశాఖపట్నం జిల్లా జర్నలిస్టులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటుగా వారి పిల్లలకు స్కూల్ ఫీజుల్లో 50%రాయితీ కూడా ఇవ్వడం జరుగుతుంది అని జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ తెలిపారు. ఇటీవల జరిగిన యోగాంధ్ర కార్యక్రమం దిగ్విజయం అయిన సందర్భంగా జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీను బాబు ఆధ్వర్యంలో పలువురు జర్నలిస్టు నాయకులు, జర్నలిస్టులు మంగళవారం కలెక్టర్ కలెక్టరు హరేంద్ర ప్రసాద్ ను శాలువ, పుష్పగుచ్చంతో ఘనంగా సత్కరించి సింహాద్రి అప్పన్న చిత్ర పటాన్ని బహుకరించారు. ఈ సందర్బంగా జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, విశాఖ జిల్లా ప్రెసిడెంట్ పోతుమహంతి నారాయణ లు కలెక్టర్ తో మాట్లాడుతూ జర్నలిస్టులకు ఉచితముగా వైద్య పరీక్షలు నిర్వహించాలని, గత ఏడాది అపోలో కార్పొరేట్ ఆసుపత్రి లో నిర్వహించడం జరిగింది అని ఈ ఏడాది కూడా మంచి కార్పొరేట్ ఆసుపత్రి లో నిర్వహించాలని కలెక్టర్ ను కోరారు..ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టామని ఇప్పటికే సంబంధిత విభాగం అధికారులు కు ఆ బాధ్యత అప్పగిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు.
జర్నలిస్ట్ ల పిల్లలకు స్కూల్ ఫీజు రాయితీ కల్పించాలని ఇప్పటికే వినతి పత్రము అందించామని కలెక్టర్ కు వివరించగా ఫీజు రాయితీ కల్పించడానికి తగిన ఆదేశాలు ఇచ్చామన్నారు,, నేడో రేపో జిల్లా విద్యా శాఖ ద్వారా ఉత్తర్వులు జారీ చేస్తామని కలెక్టర్ చెప్పారు ఈ కార్యక్రమం లో జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి,ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ విశాఖ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పీ నారాయణ్,జీ శ్రీనివాస రావు,బ్రాడ్ కాస్ట్ అసోసియేషన్ కార్యదర్శి కింతాడ మదన్,స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీఎస్ జగన్మోహన్,కార్యనిర్వాహక సభ్యుడు అరుణ్ కుమార్,సభ్యుడు రమణ మూర్తి,ఫెడరేషన్ నగేష్ బాబు పాల్గొన్నారు.
,

అనకాపల్లి జిల్లా, మాడుగుల నియోజకవర్గం

జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వానికి నివేదించాం

గ్రామీణ ప్రాంత జర్నలిస్టులకు అండగా ఉంటాం

జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వానికి నివేదించాం

గ్రామీణ ప్రాంత జర్నలిస్టులకు అండగా ఉంటాం
మాడుగుల, సమావేశంలో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల
మాడుగుల.. జూన్ 24
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టులు సమస్యలను ఇప్పటికే కూటమీ ప్రభుత్వానికి నివేదించడం జరిగిందని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీను బాబు అన్నారు.. మంగళవారం మాడుగుల లో నిర్వహించిన ఏపీ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ మాడుగుల యూనిట్ సర్వ సభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.. జర్నలిస్టులకు వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అలాగే మరో పదకొండు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇటీవలే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందజేయడం జరిగింద న్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి లకు పెండింగ్ సమస్యలు నివేదించామన్నారు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించాలని వారిని కోరామన్నారు అలాగే గ్రామీణ ప్రాంత జర్నలిస్టులకు కూడా మెరుగైన సదుపాయాలు కల్పించాలని, అలాగే రైలు, బస్సు ప్రయాణాల్లో వారికి రాయితీ సదుపాయం కల్పించాలని కోరుతున్నామన్నారు. త్వరలోనే రాష్ట్ర మహాసభలు నిర్వహించి అందులో జర్నలిస్టులకు సంబంధించిన కీలక సమస్యలపై చర్చించి వాటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు.. జర్నలిస్టులంతా ఐక్యంగా సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాళ్లపరెడ్డి వెంకట రాజారాం, మాజీ ఎంపీపీ మోదకొండమ్మ ఆలయ కమిటీ చైర్మన్ పుప్పాల అప్పలరాజు, ఉప సర్పంచ్ శ్రీనాథ్ శ్రీనివాసరావు మాజీ సర్పంచ్ దంగేటి సూర్యారావు ... ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ఈశ్వరరావు, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బి వెంకటేష్, ప్రధాన కార్యదర్శి ఏ ఖాదర్, ఏపీ బీజేఏ అనకాపల్లి జిల్లా అధ్యక్షులుఎస్.కె భాష, విశాఖ సిటీ ఫెడరేషన్ కార్యదర్శి జి శ్రీనివాసరావు, ఏపీ బీజే విశాఖ సిటీ అధ్యక్షులు ఈరోతి ఈశ్వరరావు, కార్యదర్శి కే.మదన్ తదితరులు పాల్గొన్నారు.అనంతరం
మాడుగుల నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది.

అనకాపల్లి జిల్లా

జర్నలిస్టుల సంక్షేమమే ఫెడరేషన్ లక్ష్యం

జర్నలిస్టుల సంక్షేమమే ఫెడరేషన్ లక్ష్యం

-ఏపీ డబ్ల్యూ జేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి ఈశ్వరరావు

అనకాపల్లి : జర్నలిస్టుల సంక్షేమమే ఫెడరేషన్ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు బి ఈశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం అనకాపల్లి రోటరీ క్లబ్ లో నిర్వహించిన అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలుస్తున్న జర్నలిస్టులకు ఫెడరేషన్ నిత్యం అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఫెడరేషన్ నిరంతర పోరాటాలు చేస్తుందన్నారు. ఇందులో భాగంగా అర్హులైన జర్నలిస్టులందరికీ సొంత ఇంటి కల నెరవేర్చేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. అలాగే అక్రిటేషన్ల విషయంలో చోటు చేసుకున్న పరిణామాలపై ప్రభుత్వానికి పలు సందర్భాలలో నివేదికలు అందజేసి అర్హులైన వారికి అక్రిడేషన్లు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 44 చట్టాలలో రెండు చట్టాలు జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించినవి కాగా వీటి విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా ఈనెల 9న రాష్ట్రవ్యాప్తంగా ఫెడరేషన్ లో కొనసాగుతున్న జర్నలిస్టులంతా ఐక్యంగా పోరాటాలు చేయనున్నట్లు చెప్పారు. జర్నలిస్టులు ఈ నిరసన కార్యక్రమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం అనకాపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులకు ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ బాండ్లను పంపిణీ చేశారు. జర్నలిస్టుల చిరకాల వాంఛ అయినా ఇళ్ల స్థలాలను సాధించుకునేందుకు సీనియర్ జర్నలిస్ట్ బి కొండలరావు నేతృత్వంలో హౌసింగ్ కమిటీని ఏర్పాటు చేశారు .అలాగే ఇటీవల జిల్లా కార్యవర్గానికి ఎన్నికైన ఫెడరేషన్ సభ్యులను ఘనంగా సత్కరించారు. తొలుత సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి ఈశ్వరరావును అనకాపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు శాలువాను కప్పి మెమొంటోను అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు బి.వెంకటేష్, కార్యదర్శి ఖాదర్, ఏపీ బీజే జిల్లా అధ్యక్షుడు ఎస్ కే చాంద్ భాషా, అనకాపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సిహెచ్ శశికుమార్, కార్యదర్శి పొలిమేర నాగ శ్రీనివాసరావు, ఉప కార్యదర్శి పెంటకోట సురేష్, కోశాధికారి మొల్లేటి గంగాధర్, ఫెడరేషన్ జిల్లా నాయకులు బి కొండలరావు, అజయ్, శేఖర్, కోరుబిల్లి గణేష్, నాగు తదితరులు పాల్గొన్నారు.

అనంతపురం జిల్లా

జర్నలిస్టుల పిల్లలకు ఉచితంగా నోటు పుస్తకాలు....

ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ...

జర్నలిస్టుల పిల్లలకు ఉచితంగా నోటు పుస్తకాలు

ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం

ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

జర్నలిస్టుల కష్టాలు చూసే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం..రేపటి రామాంజనేయులు

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం.. కలెక్టర్ వినోద్ కుమార్

జర్నలిస్టులకు రావాల్సిన వాటి గురించి అసెంబ్లీలో ప్రస్తావిస్తా.. పల్లె సింధూర రెడ్డి

అనంతపురం జిల్లాలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక క్లబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, బాలాజీ సంస్థల చైర్మన్ పల్లె కిషోర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి రేపటి రామాంజనేయులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉరవకొండ హెచ్ఎంటీవీ రిపోర్టర్ కు కలెక్టర్, ఎమ్మెల్యే, జర్నలిస్టులు ఘనంగా నివాళులర్పించారు జిల్లాలో వివిధ ఛానళ్లలో పత్రికల్లో పని చేస్తున్న సుమారు 270 మంది జర్నలిస్టులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేశారు. ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే పిల్లలకు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, జిల్లా కలెక్టర్ ఈ పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి రేపటి రామాంజనేయులు మాట్లాడుతూ జిల్లాలో చాలామంది పేద జర్నలిస్టులు ఉన్నారని..ప్రతి సంవత్సరం వారి పిల్లల చదువులకు చాలా ఖర్చులు చేస్తుంటారన్నారు. ఇలాంటి జర్నలిస్టులకు ఎంతోకొంత సాయం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ పుస్తకాల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ దృష్టికి జర్నలిస్టుల సమస్యలు తీసుకెళ్లామని.. కచ్చితంగా వాటన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. జర్నలిస్టుల పిల్లలందరికీ ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఉచితంగా విద్య అందించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇప్పటికే కలెక్టర్ సానుకూలంగా స్పందించారని జర్నలిస్ట్ రేపటి రామాంజనేయులు చెప్పారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తన తండ్రి కూడా ఒకప్పుడు జర్నలిస్టుగా పని చేశారని గుర్తు చేసుకున్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఎంతో మంచి కార్యక్రమం చేశారని ఆయన అభినందించారు. జర్నలిస్టుల సమస్యలను కచ్చితంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు తమ కుటుంబ సభ్యుల లాంటి వారిని వారి పిల్లల కోసం పుస్తకాలు ఇవ్వడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని.. ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రస్తావిస్తానని ఆమె హామీ ఇచ్చారు. మరోవైపు బాలాజీ, పివికేకే విద్యా సంస్థల చైర్మన్ పల్లె కిషోర్ రెడ్డి మాట్లాడుతూ తాను తొలిసారి ప్రెస్ క్లబ్ కు రావడం చాలా సంతోషంగా ఉందని..ఇది తన సొంత ఇంటికి వచ్చినట్టు ఉందన్నారు. ఇక్కడ ఉన్న వారంతా తమ కుటుంబంలో భాగమేనని జర్నలిస్టుల పిల్లలకు పుస్తకాలు ఇవ్వడం.. తమకు దక్కిన అదృష్టమని అన్నారు. భవిష్యత్తులో కూడా ఎలాంటి సాయం కావాలన్నా చేస్తామన్నారు. ఉరవకొండలో రోడ్డు ప్రమాదంలో మరణించిన జర్నలిస్టు కుమారుడి చదువు బాధ్యతలు తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు....

కర్నూలు జిల్లా

కెడిసిసి బ్యాంక్ సీఈఓ కు ఏపీడబ్ల్యూజేఎఫ్ శుభాకాంక్షలు

కెడిసిసి బ్యాంక్ సీఈఓ కు ఏపీడబ్ల్యూజేఎఫ్ శుభాకాంక్షలు

కెడిసిసి బ్యాంక్ సీఈఓ పి.రామాంజనేయులు గారు నూతన సీఈఓ గా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గోరంట్లప్ప, జిల్లా కన్వీనర్ నాగేంద్ర, ఫోటో గ్రాఫర్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు డి హుస్సేన్,ఏపీడబ్ల్యూజేఎఫ్ నగర గౌరవాద్యక్షులు శివకుమార్, నగర అధ్యక్షుడు శివ శంకర్, నగర ప్రధాన కార్యదర్శి ఎర్రమల,ఫోటో గ్రాఫర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వడ్డే శ్రీనివాసులు,ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు నర్సిరెడ్డి, లు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించి శాలువా తో శుభాకాంక్షలు తెలిపారు. బ్యాంక్ అభివృద్ధికి మంచి తోడ్పాటు అందించి వరుసగా రాష్ట్ర అవార్డులు సొంతం చేసుకున్నారని అలాంటి అభివృద్ధి సాధించిన ఘనత సీఈఓ రామాంజనేయులు గారికి సాధించారని తెలిపారు. రైతులకు,విద్యార్థులకు, జర్నలిస్టుల కు లోన్ హౌసింగ్ లోన్ లు,విద్యార్థులకు లోన్ అందించాలని కోరారు.

కర్నూలు జిల్లా

వర్కింగ్ జర్నలిస్ట్ ల పిల్లలకు ఉచిత విద్యను అందించాలి. జిల్లా కలెక్టర్ కు ఏపీడబ్ల్యూజేఎఫ్ విన

కర్నూలు జిల్లాకార్పోరేట్, పాఠశాలలో ఉచిత విద్యను అందించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా గారికి ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కన్వీనర్ నాగేంద్ర,నగర గౌరవాద్యక్షులు శివ కుమార్,నగర అధ్యక్షులు శివ శంకర్ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వడ్డే శ్రీనివాసులు కలెక్టర్ కార్యాలయంలో వినతిని అందించారు.ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ నాగేంద్ర, మాట్లాడుతూ జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించాలని గతేడాది కలెక్టర్ గారి ఆదేశాలతో 50 శాతం ఉచితంగా అందించారని తెలిపారు. సమాజంలో జర్మలిస్టుల పాత్రను గుర్తించి ఈ ఏడాది ఉచితంగా అందించాలని కనీసం 50 శాతాన్ని కల్పించాలని కోరారు.రాష్టంలో కృష్ణ,ఏలూరు,విశాఖపట్నం జిల్లాలో 50 శాతం రాయితీ అందించాలని ఆయా జిల్లా కలెక్టర్లు ఆదేశాలు ఇచ్చారని కర్నూలు జిల్లాలో కూడా అదే తరహాలో ఇచ్చేలా అదేశించగలరని కలెక్టర్ గారిని కోరామన్నారు.ప్రస్తుతం విద్య సంవత్సరం ప్రారంభం అయిందని అందుకు తగిన చర్యలు త్వరగా తీసుకోగలరని విజ్ఞప్తి చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా గారు మాట్లాడుతూ గతేడాది ప్రవేట్ స్కూల్ వాళ్ళు కోర్టుకు వెళ్లారని కేవలం కర్నూలు జిల్లాలో మాత్రమే ఇలా జరిగిందన్నారు. అయితే సాధ్యమైనంతవరకు జర్నలిస్టుల పిల్లలకు రాయితీ అందించేలా డిఇఓ తో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పాల్గొన్నారు.

విశాఖపట్నం జిల్లా

ముఖ్యమంత్రి చంద్రబాబు కు జర్నలిస్టుల పెండింగ్ సమస్యలపై 11 అంశాలు తో వినతి పత్రం.

ముఖ్యమంత్రి చంద్రబాబు కు అప్పన్న చందనం ప్రసాదం.

జర్నలిస్టుల పెండింగ్ సమస్యలపై 11 అంశాలు తో వినతి పత్రం.

సానుకూలంగా స్పందించారన్న గంట్ల

ఎన్ ఎ డి కొత్త రోడ్... జూన్ 16


విశాఖ నగర పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు సింహాచలం అప్పన్న చందన ప్రసాదాన్ని సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి,నావెల్ డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగంట్ల శ్రీనుబాబు అందజేశారు. ఈ మేరకు సోమవారం విశాఖ విమానాశ్రయంలో చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలుసుకొని అత్యంత మహిమాన్వితమైన చందన ప్రసాదం శ్రీనుబాబు అందజేయగా ముఖ్యమంత్రి వెంటనే కళ్ళకు అద్దుకొని దానిని స్వీకరించారు. అలాగే జర్నలిస్టులుకు సంబందించిన 11 పెండింగ్ సమస్యలపై ముఖ్యమంత్రి కి శ్రీనుబాబు వినతిపత్రం అందజేశారు. ఇళ్ల స్థలాల సమస్యతోపాటు ప్రధానమైన 11 అంశాలు ఈ వినతిపత్రంలో పొందుపరిచినట్లు శ్రీను బాబు ముఖ్య మంత్రి కి విపులంగా వివరించారు..వీటిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నట్లు శ్రీను బాబు తెలిపారు..

ఏలూరు జిల్లా

జర్నలిస్ట్ ల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కల్పిస్తూ సర్కలర్ .....

జర్నలిస్ట్ ల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కల్పిస్తూ సర్కలర్ జారీ

ఏలూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి కె. వెట్రిసెల్వి గారికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీడబ్ల్యుజేఎఫ్ నాయకులు

ఏలూరు,
ఏపీడబ్ల్యుజేఎఫ్ నాయకులు అడిగిన వెంటనే
జర్నలిస్ట్ ల సమస్య పై స్పందించి... ఏలూరు జిల్లా వ్యాప్తంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్ట్ ల పిల్లలకు.... ప్రయివేటు, కార్పొరేట్ స్కూల్స్ లో విద్యనభ్యసిస్తోన్న వారికి స్కూల్ ఫీజులో 50 శాతం రాయితీ కల్పిస్తూ
సర్కలర్ జారీ చేసిన ఏలూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి కె. వెట్రిసెల్వి గారికి అలాగే జిల్లా విద్యాశాఖా అధికారి యం. వెంకట లక్ష్మమ్మ గారికి ఏపీడబ్ల్యుజేఎఫ్ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు... గత ఏడాది అలాగే
ప్రస్తుత ఏడాది కూడా ఫీజు రాయితీ కల్పించాలని అడిగిన వెంటనే జర్నలిస్టుల సమస్య పై స్పందించిన తీరుపై ఏపీడబ్ల్యుజేఎఫ్ జిల్లా అధ్యక్షులు సయ్యద్ జబీవుల్లా (జబీర్ ) ధన్యవాదాలు తెలిపారు.

శ్రీ సత్య సాయి జిల్లా

శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం లో సభ్యత కార్యక్రమo.....

శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం లో సభ్యత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న APWJF నాయకులు.

విశాఖపట్నం జిల్లా

జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పించండి

-- ఉచితంగా వైద్య పరీక్షలు చేయించండి

జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పించండి
-- ఉచితంగా వైద్య పరీక్షలు చేయించండి
-- డీఆర్‌వో భవానీ శంకర్‌కు జర్నలిస్టుల వినతి

విశాఖపట్నం, జూన్‌23: విశాఖ జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా ఫీజు రాయితీ కల్పించాలని కోరుతూ ఏపీ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌, ఏపీ బ్రాడ్‌కాస్ట్, స్మాల్‌ అండ్‌ మీడియం న్యూస్‌ పేపర్స్‌ అసోసియేషన్ల అధ్వర్యంలో డీఆర్‌వో భవానీ శంకర్‌కు వినతిపత్రం సమర్పించారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డీఆర్‌వోను జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, విశాఖ జిల్లా అధ్యక్షుడు పి.నారాయణ్‌లు కలుసుకొని ఇప్పటికే ఎన్టీఆర్‌, ఏలూరు జిల్లాలు అక్కడ జర్నలిస్టుల పిల్లలకు స్కూల్‌లో ఫీజు రాయితీపై ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని వివరించారు. అలాగే వినతిపత్రంతో పాటు ఆయా జిల్లాలు జారీ చేసిన ఉత్తర్వుల ప్రతులను డీఆర్‌వోకి అందజేశారు. అక్కడి మాదిరిగానే విశాఖ జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు వంద శాతం రాయితీ కల్పించాలని కోరారు. అలాగే జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కొన్ని స్కూల్స్‌ ఫీజు రాయితీ నిరాకరిస్తున్నాయని వీరు తెలియజేశారు. జర్నలిస్టుల వినతిపై డీఆర్‌వో సానుకూలంగా స్పందించారు. అక్కడే ఉన్న డీఈవో ప్రేమ కుమార్‌ను పిలిచి ఆయా ఉత్తర్వులు పరిశీలించి తక్షణమే జిల్లా కలెక్టర్‌కు ఫైల్‌ పంపాలని ఆదేశించారు. వీలైనంత త్వరలో ఇందుకు అవసరమైన ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే జర్నలిస్టులకు గతేడాది మాదిరిగానే ఉచితంగా వైద్య పరీక్షలు చేయించాలని కోరగా, ఈ విషయం కలెక్టర్‌ దృష్టిలో ఉందని, తదుపరి చర్యలు తీసుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్‌ విశాఖ జిల్లా కార్యదర్శి జీ. శ్రీనివాసరావు,డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ ఎ.సాంబశివరావు, బ్రాడ్‌ కాస్ట్ విశాఖ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి ఇరోతి ఈశ్వరరావు, కింతాడ మదన్‌,ఫెడరేషన్‌ ఉపాధ్యక్షుడు బండారు శివప్రసాద్‌,త్రినాధరావు, రాజశేఖర్‌,పిల్లా నగేష్‌ బాబు, పి.కామన్న తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం జిల్లా

మాజీ శాసనసభ్యుడు స్వర్గీయ పల్లా సింహాచలం మృతి విచారకరం.

:- జాతీయ సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు,ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ విశాఖ జిల్లా అధ్యక్షుడు,కార్యదర్శిలు నారాయణ, శ్రీనివాసరావు..

ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు,గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారి తండ్రి విశాఖ
మాజీ శాసనసభ్యుడు స్వర్గీయ పల్లా సింహాచలం మృతి విచారకరం.
:- జాతీయ సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు,ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు,కార్యదర్శిలు నారాయణ, శ్రీనివాసరావు..
        **"""**
ఉత్తరాంధ్ర జిల్లా నాయకుడు, కార్మికుల పక్షపాతి, మాజీ శాసనసభ్యులు శ్రీ పల్లా సింహాచలం మృతి ఉత్తరాంధ్ర జిల్లా కు తీరని లోటని
       స్వర్గీయ పల్లా సింహాచలం కుమారులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,స్వర్గీయ పల్లా సింహాచలం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించిన జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ విశాఖ జిల్లా అధ్యక్షులు పోతు మహంతి నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షులు, ఈరోతి ఈశ్వరరావు,కార్యదర్శి మదన్. ఈ సందర్భంగా జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ విశాఖ జిల్లా కార్మిక లోకం ఒక గొప్ప కార్మిక నాయకున్ని కోల్పోయిందని పేర్కొంటూ,ఒకవైపు కార్మికులకు న్యాయం కోసం పోరాటాలు చేస్తూ, మరోవైపు శాసనసభ్యుగా నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేసిన స్వర్గీయ పల్లా సింహాచలం గారు ప్రస్తుత తరానికి మార్గదర్శకులని కొనియాడారు.   ఏపీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ స్థానిక నాయకత్వం కోసం క్రియాశీలకంగా పోరాడిన స్వర్గీయ పల్లా సింహచలం గారిని ఉత్తరాంధ ప్రజలు మదిలో దాచుకుంటారని పేర్కొంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ విశాఖ జిల్లా,ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ తరఫున తరఫున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు...

విశాఖపట్నం జిల్లా

విశాఖ జిల్లా సాక్షి రిపోర్టర్ రామకృష్ణకు వాళ్ళు నడిపించిన ఎపిడబ్ల్యుఎఫ్ యూనిట్

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ సభ్యుడు గాజువాక నియోజకవర్గం,అక్కిరెడ్దిపాలెం సాక్షి రామకృష్ణ మృతి పట్ల ఘనంగా నివాళులు అర్పించిన జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీను బాబు, జిల్లా జనరల్ సెక్రెటరీ జి.శ్రీనివాసరావు, ఏపీ బీజేఏ జిల్లా సెక్రెటరీ కె.మదన్, స్మాల్ అండ్ మీడియం అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ రాజశేఖర్
వారి కుటుంబ సభ్యులు కు ప్రగాఢ సానుభూతి తెలిపి గంట్ల శ్రీను బాబు, వారి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందచేశారు..

ఎన్టీఆర్ జిల్లా

జర్నలిస్టుల న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ ముందంజలో ఉంటుందని జర్నలిస్టుల ఇంటి స్థలాల కేటాయింపు సమస్యతో పాటు ఇతర సమస్యలన్నింటినీ వీలైనంత త్వరగా పరిష్కారం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఫెడరేషన్ ప్రతినిధి వర్గానికి హామీ ఇచ్చారు. జర్నలిస్టుల పెన్షన్ కేటాయింపుకు సంబంధించిన అవకాశాలను పరిశీలించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని ఆయన స్పష్టం చేశారు.
అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ జూన్ 11వ తేదీ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్స్ డే పాటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజధాని నుంచి మారుమూల మండల కేంద్రం వరకు జర్నలిస్టుల సమస్యలపై వినతి పత్రాలను ప్రభుత్వానికి అందజేశారు.
రాష్ట్ర రాజధానిలో సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధిని కలిసిన ఫెడరేషన్ ప్రతినిధి వర్గం సమస్యల గురించి వివరించి వినతి పత్రం అందజేశారు. ఒంగోలు, ధర్మవరంలలో మంత్రులు రవికుమార్ డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి, సత్య కుమార్ తో పాటు వివిధ కేంద్రాల్లో ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, డిఆర్ఓలు, మండల రెవెన్యూ అధికారులకు ఫెడరేషన్ ప్రతినిధులు వినతి పత్రాలను అందజేశారు.
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు, మీడియా కమిషన్ ఏర్పాటు, జర్నలిస్టులకు పెన్షన్, అక్రిడిటేషన్ కమిటీ లో ఫెడరేషన్, ఏపీ బీజేఏలకు ప్రాతినిధ్యం, జర్నలిస్టుల వివిధ కమిటీల ఏర్పాటు, మీడియా అకాడమీ బలోపేతం చేయటం, జర్నలిస్టుల అవార్డులు, ఉద్యోగ భద్రత, కార్మిక భీమా సదుపాయం, జర్నలిస్టులకు వృద్ధాశ్రమం ఏర్పాటు తదితర అంశాలపై వినతి పత్రం అందజేశారు. వీటితోపాటు స్థానికంగా జర్నలిస్టుల సమస్యల గురించి ఆ వినతి పత్రంలో ప్రస్తావించారు.
ఎస్ వెంకట్రావు అధ్యక్షులు
జి ఆంజనేయులు
ప్రధాన కార్యదర్శి

తిరుపతి

జర్నలిస్టుల సమస్యలపై ఆర్డీవో ఏవో కు వినతి ....

ఆర్డీవో కార్యాలయం వద్ద జర్నలిస్టుల
సమస్యలపై ఆర్డీవో ఏవో కు వినతి
తిరుపతి టౌన్
జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం తిరుపతి ఆర్ డి ఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు శ్రీధర్, తిరుపతి అధ్యక్షులు వాణి మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న మూడు సెంట్ల భూమి అర్హులైన పేద జర్నలిస్టులకు ఇవ్వాలని కోరారు. జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత కల్పించి వారిపై దాడులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జర్నలిస్టులకు వేజ్ బోర్డు ప్రకారం వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామీణ అర్బన్ ప్రాంతాల్లో ఉండే జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారందరికీ ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా చిన్న పత్రికలకు అక్రిడేషన్ల కార్డుల సంఖ్య పెంచాలని కోరారు. రిటైర్డ్ అయిన జర్నలిస్టులకు తమిళనాడు తరహాలో పెన్షన్ ఇవ్వాలని కోరారు. తర్వాత ఆర్డీవో కార్యాలయం పరిపాలన అధికారి ఝాన్సీ కి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు ఎస్ గౌస్, తులసి కుమార్, వెంకటేష్, శేఖర్, సుబ్బరాయుడు, జయపాల్, నరసింహులు, హనుమంత్ రెడ్డి, వరదరాజులు పాల్గొన్నారు

విజయనగరం జిల్లా

విజయనగరం జిల్లా డిఆర్ఓకు వినతి పత్రం

ఎన్టీఆర్ జిల్లా

రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ అడిషనల్ డైరెక్టర్ స్వర్ణలత గారికి వినతిపత్రం అందీస్తున్న ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె. కలిమిశ్రీ, ఎం. బి.నాథన్ తదితరులు

ఎన్టీఆర్ జిల్లా[ జగ్గయ్యపేట]

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డ్స్ ఇవ్వాలి

జగ్గయ్యపేట: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డ్స్ ఇవ్వాలి.
__ఏపిడబ్లూజెఎఫ్ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట తహసీల్దార్ కార్యాలయపు సిబ్బందికి వినతి పత్రం.
జగ్గయ్యపేట: అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, నూతన అక్రిడేషన్ కార్డ్స్ వెంటనే మంజూరు చేయాలనీ కోరుతూ ఏపిడబ్లూజెఎఫ్ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట తహసీల్దార్ కార్యాలయపు సీనియర్ అసిస్టెంట్ కె శ్రీదేవి కి వినతి పత్రం అందజేశారు. విలేకరుల సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికీ తీసుకువెళ్లి పరిస్కారం చేయాలనీ కోరారు. ఈ సందర్బంగా ఏపిడబ్లూజెఎఫ్ నాయకులు జె వెంకటరావు మాట్లాడుతూ ఏంతో కాలం నుంచి జర్నలిస్టులుగా పని చేస్తున్న ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలు మంజూరు కాలేదని, అద్దె ఇళ్లలో ఉండలేక ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులకు మంజూరు చేయాలనీ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో మంజూరు చేసిన అక్రిడేషన్ కార్డ్స్ పొడగింపు చేయడం వల్ల నూతనంగా చాలా మంది అర్హత ఉన్న కార్డ్స్ పొందలేని పరిస్థితి ఉందని, ప్రభుత్వం వెంటనే అక్రిడేషన్ కమిటీనీ ఏర్పాటు చేసి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి నూతనంగా మంజూరు చేయాలనీ కోరారు. ప్రజా సమస్యలపై వార్తలు రాస్తున్న జర్నలిస్టులపై దాడులు జరుగుతున్న

ఎన్టీఆర్ జిల్లా[ జి కొండూరు మండలం]

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ....

ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు మండలం:

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిమాండ్స్ డే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (APWJF) పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నాయకుల ఆదేశాల మేరకు డిమాండ్స్ పత్రాన్ని డిప్యూటీ తహసిల్దార్ పి విజయ్ కుమార్ కు డిమాండ్ పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీసం సురేష్ బాబు ( ప్రజాశక్తి) చింతకాయల రాంబాబు( సన్ ఫ్లవర్ న్యూస్ ) మంతెన శ్రీనివాస్ ( ప్రభా న్యూస్ ) కూరపాటి ప్రకాష్ ( మంజీరా గళం ) ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

ఎన్టీఆర్ జిల్లా[ఇబ్రహీంపట్నం]

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డ్స్ ఇవ్వాలి

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డ్స్ ఇవ్వాలి

ఏపిడబ్లూజెఎఫ్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంతహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా


అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, నూతన అక్రిడేషన్ కార్డ్స్ వెంటనే మంజూరు చేయాలనీ కోరుతూ ఏపిడబ్లూజెఎఫ్ మైలవరం నియోజకవర్గం కమిటీ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా జరిగింది. ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అక్రిడేషన్ కార్డ్స్ మంజూరు చేయాలనీ జర్నలిస్టులు నినాదాలు చేశారు. అనంతరం డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తాహసిల్దార్ సాయి మహేష్ కు అందజేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ దృష్టికీ తీసుకువెళ్లి సమస్యను పరిస్కారం చేయాలనీ ఆయనను కోరారు. ఈ సందర్బంగా ఏపిడబ్లూజెఎఫ్ నాయకులు మాట్లాడుతూ ఏంతో కాలం నుంచి జర్నలిస్టులుగా పని చేస్తున్న ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలు మంజూరు కాలేదని, అద్దె ఇళ్లలో ఉండలేక ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులకు మంజూరు చేయాలనీ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో మంజూరు చేసిన అక్రిడేషన్ కార్డ్స్ పొడగింపు చేయడం వల్ల నూతనంగా చాలా మంది అర్హత ఉన్న కార్డ్స్ పొందలేని పరిస్థితి ఉందని

ఎన్టీఆర్ జిల్లా[ గంపలగూడెం]

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికై వినతి

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికై వినతి
ప్రజాశక్తి-గంపలగూడెం: దీర్ఘకాలికంగా పడకేసిన జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ, బుధవారం ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండల తహసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించినట్లు ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధి జి అంజయ్య తెలిపారు. ఈ మేరకు రెవెన్యూ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించినట్లు చెప్పారు. జర్నలిస్టుల డిమాండ్స్ డే ని పురస్కరించుకొని ఈ వెన్నతిని సమర్పించినట్లు తెలిపారు.గత ప్రభుత్వం జర్నలిస్టులకు మూడు సెంట్లు ఇళ్ల స్థలాలతోపాటు పలు సమస్యలను ఆ వినతిలో పేర్కొన్నట్లు వివరించారు. కార్యక్రమంలో రాయల ఆంజనేయ మూర్తి తదితరులు పాల్గొన్నారు

ఎన్టీఆర్ జిల్లా[నందిగామ ]

జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి

జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి..ఏపీడబ్ల్యూజేఎఫ్
ప్రజాశక్తి -నందిగామ నందిగామ రెవిన్యూ డివిజన్ పరిధిలో కొంతమంది జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు తక్షణమే తొలగించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఎన్టీఆర్ జిల్లా నాయకులు ఆకుల వెంకటనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఎపీ డబ్ల్యూ జే ఎఫ్ ఫెడరేషన్) ఆధ్వర్యంలో జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో వచ్చి నందిగామ ఆర్డీవో కే బాలకృష్ణను కలిసి జర్నలిస్టు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా నాయకులు ఆకుల వెంకటనారాయణ మాట్లాడుతూ నందిగామలో కొంతమంది విలేకరులపై ప్రభుత్వం వదిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. నందిగామలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వంలో తక్షణమే ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. జర్నలిస్టు రక్షణ కొరకు మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులకు పెన్షన్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అక్రిడేషన్ కమిటీలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఏపీ .ీబీజేఏలకు ప్రాతినిధ్యం కల్పించిందని తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.

ఎన్టీఆర్ జిల్లా

ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియాకు వినతిపత్రం అందిస్తున్న ఫెడరేషన్ రా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్. వెంకటరావు, జి. ఆంజనేయులు, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె. కలిమిశ్రీ, ఎం. బి. నాథన్ తదితరులు

నెల్లూరు

జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు కేటాయింపు

) మీడియా కమిషన్ ఏర్పాటు

హక్కుల దినోత్సవం(డిమాండ్ల డే) సందర్భంగా నెల్లూరులో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (APWJF), ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌కాస్టింగ్ జర్నలిస్టులు అసోసియేషన్ (APBJA) ఆద్వర్యంలో జిల్లా రెవెన్యూ అధికారి జే. ఉదయ భాస్కర్ ను కలసిన జర్నలిస్టులు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని 1) జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు కేటాయింపు 2) మీడియా కమిషన్ ఏర్పాటు 3) జర్నలిస్టులకు పెన్షన్ 4) అక్రిడిటెషన్ కమిటీల్లో మీడియా కమిటీ ప్రతినిధులకు ప్రాతినిధ్యం 5) జర్నలిస్టు కమిటీలు ఏర్పాటు 6) మీడియా అకాడమీ బలోపేతం చేయడం 7) ప్రతి సంవత్సరం జర్నలిస్టులకు అవార్డులు అందజేయడం 8) జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత 9) బీమా సదుపాయం ఏర్పాటు 10) జర్నలిస్టులకు ఆరోగ్య బీమా 11) జర్నలిస్టులకు వృద్ధాశ్రమం ఏర్పాటు తదితర అంశాలపై వినతి పత్రం అంద చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోలగట్ల సుధాకర్, నగర అధ్యక్షులు భువనేశ్వర్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌కాస్టింగ్ జర్నలిస్టులు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మేడా శ్రీదర రెడ్డి, కార్యదర్శులు ఎం. విజయ కుమార్ రెడ్డి, మల్లికార్జున రావు,అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.

చిత్తూరు జిల్లా

దీర్ఘకాలికంగా అపరిస్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీడబ�

దీర్ఘకాలికంగా అపరిస్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
జర్నలిస్టుల డిమాండ్ డే సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల నియోజకవర్గ జిల్లా కేంద్రాలలో స్థానిక తహసీల్దారులు ఆర్డీవోలకు ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు వినతి పత్రాలు అందజేశారు. జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరంలో ఆర్డీవో శ్రీనివాసులు గారికి ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు కవరకుంట్ల జయరాజ్, చిత్తూరు జిల్లా అధ్యక్షులు బి ప్రకాష్, ఏపీ బీజేఏ జిల్లా అధ్యక్షులు చల్లా జయ చంద్ర, చిత్తూరు నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు కేశవులు, బాలసుబ్రమణ్యం కోశాధికారి కృపానందరెడ్డి సంఘం సభ్యులు యాదవేందర్ రెడ్డి ఉమాశంకర్, మురళీకృష్ణ నాగరాజు, కుబేన్ద్రన్, మంజునాథ్, సత్యం ప్రసాద్, సురేందర్ రెడ్డి, విజయ్, ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

వర్కింగ్ జర్నలిస్టులకు త్వరలో వైద్య పరీక్షలు సమస్యలపై కూటమి ప్రభుత్వంకు నివేదన సానుకూలంగా �

వర్కింగ్ జర్నలిస్టులకు త్వరలో వైద్య పరీక్షలు
సమస్యలపై కూటమి ప్రభుత్వంకు నివేదన
సానుకూలంగా స్పందించిన కలెక్టర్
విశాఖపట్నం, జూన్ 11.
విశాఖపట్నం జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు త్వరలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ హామీ ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఎపిడబ్ల్యూజెఎఫ్) ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా బుధవారం విశాఖపట్నం జిల్లా ఫెడరేషన్ యూనిట్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ను కలిసి దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలను ప్రభుత్వం కు తెలియ చేయాలి అని కోరుతూ 12 అంశాలు పై వినతి పత్రం సమర్పించారు. ఇందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా వర్కింగ్ జర్నలిస్టులకు వైద్య పరీక్షలు చేయించాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన కలెక్టర్ ఈ నెల 21వ తేదీన జరగనున్న యోగాంధ్ర కార్యక్రమం పూర్తయిన వెంటనే దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటామన్నారు. చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల ఇంటి స్థలాల సమస్యను పరిష్కరించాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పించాలని, త్వరలో ఏర్పాటు చేయనున్న అక్రెడిటేషన్ కమిటీలో ఎపిడబ్ల్యూజేఎఫ్, ఎపిబిజెఎ లకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పోతుమహంతి నారాయణ్ మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు వీలుగా రాష్ట్రంలో హోం మంత్రి ఆధ్వర్యంలో హై పవర్ కమిటీ, జిల్లాల్లో పోలీసు ఉన్నతాధి కారులతో కూడిన కమిటీలను తక్షణం ఏర్పాటు చేసి జర్నలిస్టులకు భద్రత కల్పించాలని కోరారు. మీడియా అకాడమీని బలోపేతం చేసి, ప్రతిభ కనబరిచిన జర్నలిస్టులకు అవార్డులు ఇవ్వాలన్నారు. జర్నలిస్టులకు కార్మిక భీమా, ఆరోగ్య బీమా సదుపాయం వర్తింపచేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. జర్నలిస్టులకు పింఛను సదుపాయం కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ విశాఖపట్నం జిల్లా కార్యదర్శి జి శ్రీనివాస్, ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఇరోతి ఈశ్వరరావు, కింతాడ మదన్,ఆంధ్రప్రదేశ్ స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు విఎస్ జగన్ మోహన్, ఇతర ప్రతినిధులు కెవి శర్మ,పి రవిశంకర్,అరుణ్ భాస్కర్, రఫీ,బి అప్పల నాయుడు, కే సత్యనారాయణ,కె తులసీదాస్, టి కృష్ణమూర్తి, నగేష్, పి శ్రీనివాసులు నాయుడు, డిపి నాయుడు,జిఆర్ఎస్ రమేష్,రమణమూర్తి, పి శ్రీలత, బి రేణుక, జి సత్యనారాయణ, బి తేజ,శివ, రమేష్,వెంకటరమణ, ఫణి తదితరులు పాల్గొన్నారు.

అనంతపురం జిల్లా

APWJF ఆధ్వర్యంలో జర్నలిస్టుల డిమాండ్స్ డే కార్యక్రమం

అనంతపురంలో జర్నలిస్టులు ఆందోళన

APWJF ఆధ్వర్యంలో జర్నలిస్టుల డిమాండ్స్ డే కార్యక్రమం

ఆక్రిడిటేషన్లు ,ఆరోగ్య భీమా, ఉచిత విద్య, పెన్షన్ వంటి డిమాండ్లు పరిష్కరించాలి


జిల్లాలో పని చేస్తున్న ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు 3సెంట్ల ఇంటి స్థలంతో పాటు ఇళ్ల నిర్మాణం, ఉద్యోగ భద్రత కల్పించాలని APWJF జిల్లా ప్రధాన కార్యదర్శి రేపటి రామాంజినేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యలపై ఇవాళ APWJF నాయకులతో కలిసి రెవెన్యూ అధికారులకు వినతి పత్రం అందజేశారు. అన్ని పత్రికలు, టీవీ ఛానల్స్‌కు చెందిన జర్నలిస్టులు "డిమాండ్స్ డే లో భాగంగా జర్నలిస్టులు DRO కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం రెవెన్యూ అధికారి ద్వారా ప్రభుత్వానికి తమ డిమాండ్లను వినిపించారు. ఈ సందజర్భంగా APWJF జిల్లా ప్రధాన కార్యదర్శి రేపటి రామాంజినేయులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లు జర్నలిస్టులు వివిధ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని.. ఎన్నికల ముందు ప్రతి పార్టీ జర్నలిస్టుల సమస్యలను పరిష్కారిస్తామని హామీలు ఇవ్వడం తప్ప.. ఎక్కడా నెరవేర్చింది లేదన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల ముందు కూడా కూటమి జర్నలిస్టులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. అందుకే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల డిమాండ్స్ డే ను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. జిల్లాలో పని చేసే ప్రతి వర్కింగ్ జర్నలిస్టుగా ముందుగా ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఏడాది కాలంగా అక్రిడిటేషన్ లు కూడా మంజూరు చేయలేదన్నారు. అక్రిడిటేషన్లతో పాటు సంస్థల నుంచి గుర్తింపు కార్డులు, ఇంటి స్థలాలు, ఇళ్ల నిర్మాణం, ఆరోగ్య బీమా వంటి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. లేని పక్షంలో APWJF దశల వారిగా ఉద్యమాలు చేస్తుందని రేపటి రామాంజినేయులు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు జయప్రకాష్, నాగభూషణ్ , వేణుగోపాల్ , నాయుడు, శ్రీరాములు, సూర్య, రామాంజనేయులు, శ్రీనివాసులు, జగదీశ్, కేశవ, రవీంద్ర, ఉపేంద్ర, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

చిత్తూరు

దీర్ఘకాలికంగా అపరిస్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాల......

చిత్తూరు

దీర్ఘకాలికంగా అపరిస్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. జర్నలిస్టుల డిమాండ్ డే సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల నియోజకవర్గ జిల్లా కేంద్రాలలో స్థానిక తహసీల్దారులు ఆర్డీవోలకు ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు వినతి పత్రాలు అందజేశారు జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరంలో ఆర్డీవో శ్రీనివాసులు గారికి ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు కవరకుంట్ల జయరాజ్, చిత్తూరు జిల్లా అధ్యక్షులు బి ప్రకాష్, ఏపీ బీజేఏ జిల్లా అధ్యక్షులు చల్లా జయ చంద్ర, చిత్తూరు నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు కేశవులు, బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు

కర్నూలు జిల్లా

జర్నలిస్టుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలి.

ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇవ్వాలి.

జర్నలిస్టుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలి.
ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇవ్వాలి.
అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ ఇవ్వాలి.
వివిధ డిమాండ్లతో ఇంచార్జ్ డిఆర్వో వెంకటేశ్వర్లు కు వినతి.


జర్నలిస్టుల సమస్యలు వారి న్యాయమైన డిమాండ్లు పరిస్కారం చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బుధవారం డిమాండ్ల డే పురస్కరించుకుని ఇంచార్జ్ డిఆర్వో వెంకటేశ్వర్లు కు ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కన్వీనర్ నాగేంద్ర,జిల్లా నాయకులు సునీల్ కుమార్,నగర అధ్యక్షులు శివ శంకర్, నగర ప్రధాన కార్యదర్శి ఎర్రమల,ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు జమ్మన్న,భీమేష్ లు జర్నలిస్టుల డిమాండ్ల వినతిని అందించారు.ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ నాగేంద్ర మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యల పరిస్కారం కొరకు డిమాండ్ల డే నిర్వహించామని జిల్లా వ్యాప్తంగా అన్నీ మండల ,నియోజకవర్గ కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. జర్నలిస్టులకు ఎన్నో ఏళ్లుగా సొంత ఇల్లు కల నెరవేరలేదని నేటికి అద్దె ఇళ్లల్లో ఉండే జర్నలిస్టులు జీవనం కొనసాగిస్తున్నారన్నారు.కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే జర్నలిస్టులకు ఇంటి స్థలం తో పాటు ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే అక్రిడేషన్ కాలపరిమితి ముగిసిన రెన్యూవల్ పేరుతో కొనసాగిస్తున్నారని ఇప్పటికైనా పూర్తి స్థాయిలో అందరికి అక్రిడేషన్ కార్డులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలకు అక్రిడేషన్ కమిటీలో ప్రతినిత్యం కల్పించాలని కోరారు.జర్నలిస్టుల పై రోజు రోజుకు పెరుగుతున్న దాడులను నియంత్రించేలా జర్నలిస్టుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లు తక్షణమే పరిస్కారం చేయాలని కోరారు. ఇంచార్జ్ డిఆర్వో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉన్నతాధికారులకు నివేదించి తగిన చర్యలు తీసుకునేలా చూస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పాల్గొన్నారు.

ఏలూరు జిల్లా[చింతలపూడి]

APWJF చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం చింతలపూడి లో చింతలపూడి ఎం. ఎల్. ఎ. సొంగా రోషన్ కుమార్ గారిని వారి కార్యాలయంలో కలిసి తమ సమస్యల పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 1) జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు కేటాయింపు 2) మీడియా కమిషన్ ఏర్పాటు 3) జర్నలిస్టులకు పెన్షన్ 4) అక్రిడిటెషన్ కమిటీల్లో మీడియా కమిటీ ప్రతినిధులకు ప్రాతినిధ్యం 5) జర్నలిస్టు కమిటీలు ఏర్పాటు 6) మీడియా అకాడమీ బలోపేతం చేయడం 7) ప్రతి సంవత్సరం జర్నలిస్టులకు అవార్డులు అందజేయడం 8) జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత 9) భీమా సదుపాయం ఏర్పాటు 10) జర్నలిస్టులకు ఆరోగ్య భీమా 11) జర్నలిస్టులకు వృద్ధాశ్రమం ఏర్పాటు తదితర అంశాలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో APWJF ఏలూరు జిల్లా కోశాధికారి కె. నాగ చిన్నారావు, సంయుక్త కార్యదర్శి ఎం. రవి, కె. రజనీకాంత్, టి. సంజయ్, టి. బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.

గుంటూరు

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం శ్రద్ధ చూపాలి.....

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం శ్రద్ధ చూపాలి. గుంటూరులో ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (APWJF) – ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌ కాస్టింగ్ జర్నలిస్టు అసోసియేషన్ (APBJA) గుంటూరు జిల్లా డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ కు వినతి.

రాష్ట్రంలోని జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే శ్రద్ధ చూపాలని, వారి సంక్షేమానికి గట్టి చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (APUWF), ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌కాస్టింగ్ జర్నలిస్టులు అసోసియేషన్ (APBJA) గుంటూరు జిల్లా శాఖలు కోరాయి. ఈ మేరకు 11-06-2025 తేదీన గుంటూరు జిల్లా రెవెన్యూ ఆఫీసర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు, నూతన అక్రిడిటేషన్ కార్డులు త్వరితగతిన జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత, కార్మిక బీమా వంటి మౌలిక హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. వినతిపత్రం అందజేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పట్నాల సాయికుమార్, మహేష్, శ్యామేల్, సుధాకర్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌ కాస్టింగ్ జర్నలిస్టు అసోసియేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు బోస్క సువర్ణ బాబు, ప్రధాన కార్యదర్శి కేసంశెట్టి శ్రీనివాసరావు, దుర్గారెడ్డి, శ్రీనివాస్,నవీన్, రవి, అయ్యప్ప,సాగర్, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెనాలి

జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలి

జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలి
తెనాలి:
రాష్ట్రం లో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కారం కోసం ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలని, జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలని ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్, ఆంధ్ర ప్రదేశ్ బ్రాడ్ కాస్టింగ్ అసోసియేషన్ తెనాలి శాఖలు ప్రభుత్వాన్ని కోరాయి. ఆయా జర్నలిస్ట్ సంఘాల రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో పరిపాలనా అధికారి శ్రీధర్ బాబు
సంఘ నేతలు, సభ్యులు బుధవారం వినతి పత్రం అందజేశారు.
తెనాలి ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. జహీర్, జిల్లా అధ్యక్షులు కనపర్తి రత్నాకర్ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, నూతన అక్రిడిటేషన్ కార్డులు అందజేయాలని, ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత, కార్మిక బీమా కల్పించాలన్నారు. నాయకులు అంబటి శ్యామ్ సాగర్, అచ్యుత సాంబశివరావు లు
మాట్లాడుతూ మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని,
మీడియా అకాడెమీ ను బలోపేతం చేయాలని,పెన్క్షన్ సౌకర్యాలను జర్నలిస్టులకు అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో ఉన్నం భూషణం, మేకల సుబ్బారావు, వి.వి. నాయుడు, సభ్యులు పాల్గొన్నారు.

హనుమంతునిపాడు మండల

రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హనుమంతునిపాడు మండల తాసిల్దార్ నాగుల్ మీరాకు వినతి పత్రం అందజేస్తున్న ఏపీడబ్ల్యూజేఎఫ్ కమిటీ నేతలు

శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ

జర్నలిస్టుల సమస్యలపై శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండలో రెవెన్యూ అధికారులు వినతిపత్రం సమర్పిస్తున్న APWJF నాయకులు.

ఏలూరు జిల్లా

ఏలూరు జిల్లాలో కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో డిఆర్ఓ గారికి వినతిపత్రం అందిస్తున్నా ఏలూరు జిల్లా ఏపీడబ్ల్యుఎఫ్ జిల్లా నాయకులు.

శ్రీ సత్య సాయి జిల్లా ,హిందూపురం

శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలో జర్నలిస్టుల సమస్యలపై తహశీల్దార్ కు వినతిపత్రం సమర్పిస్తున్న APWJF నాయకులు.

అనంతపురం జిల్లా

అనంతపురం జిల్లా రెవెన్యూ అధికారికి జర్నలిస్టుల సమస్యలను వివరిస్తూ వినతిపత్రం అందజేస్తున్న APWJF జిల్లా ప్రధాన కార్యదర్శి రేపటి రామాంజనేయులు.

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం,

రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ....

రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బుధవారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఆర్డిఓ కార్యాలయంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.ఈశ్వరరావు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేస్తున్న జర్నలిస్టులు

ప్రకాశం జిల్లా

రాష్ట్రంలోని జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికి వినతి పత్రాలు అందజేస్తున్న ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ నేతలు

చిత్తూరు జిల్లా[పుంగనూరు]

ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో డిమాండ్స్ డే సందర్భంగా వినతి పత్రం

చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో తహసీల్దార్ గారికి డిమాండ్స్ డే సందర్భంగా వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సలీం పుంగనూరు నియోజకవర్గ అధ్యక్షులు సతీష్, ప్రధాన కార్యదర్శి హిదాయతుల్లా కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.

శ్రీ సత్యసాయి జిల్లా[ ధర్మవరం]

శ్రీ సత సమస్యల పైన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ వినతిపత్రం సమర్పిస్తున్న APWJF నాయకులు

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో జర్నలిస్టుల సమస్యల పైన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ వినతిపత్రం సమర్పిస్తున్న APWJF నాయకులు

19వ తారీఖున జరిగే మంత్రివర్గ సమావేశంలో జర్నలిస్టుల సమస్యలపై కచ్చితంగా చర్చిస్తానని మంత్రి ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులకు హామీ ఇచ్చారు.

గుంటూరు

కార్మిక చట్టాలు పునరుద్ధరించాలి – కలెక్టరేట్ వద్ద APWJF–APBJA ఆధ్వర్యంలో జర్నలిస్టుల నిరసన.

కార్మిక చట్టాలు పునరుద్ధరించాలి – కలెక్టరేట్ వద్ద APWJF–APBJA ఆధ్వర్యంలో జర్నలిస్టుల నిరసన.

గుంటూరు:
కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన కార్మిక చట్టాలలో వర్కింగ్ జర్నలిస్టుల చట్టం–1955 మరియు వర్కింగ్ జర్నలిస్ట్ వేతనల చెల్లింపుల చట్టం–1958 ముఖ్యమైనవిగా జర్నలిస్టులకు సంబంధించి ఉన్నాయని,అవి యధాతథంగా కొనసాగించాలని ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (APWJF) మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌కాస్టింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ (APBJA) డిమాండ్ చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జూన్ 9వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు గుంటూరు కలెక్టరేట్ వద్ద జర్నలిస్టులు నిరసన తెలిపారు.కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు కనపర్తి రత్నాకర్ మాట్లాడుతూ,జర్నలిస్టులకు ఉన్న హక్కులను కేంద్రం పునరుద్ధరించాలి.రద్దు చేసిన చట్టాలను మళ్లీ అమలు చేయాలి,అని కోరారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ బ్రాడ్ కాస్టింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి,
భద్రతకు ఈ చట్టాలు కీలకం అని వాటిని అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పట్నాల సాయికుమార్,ఎన్.జె. శామ్యూల్,ఎస్‌.ఎస్.యస్. జహీర్,చి.మణికుమార్, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.ఇదే విధంగా APBJA గుంటూరు జిల్లా అధ్యక్షుడు బోస్క సువర్ణ బాబు, జనరల్ కార్యదర్శి కేసంశెట్టి శ్రీనివాసరావు, బ్రహ్మం,దుర్గారెడ్డి, అయ్యప్ప,శ్రీనివాస్,నవీన్,శశి, హోసన్న ఇతర నేతలు పాల్గొన్నారు.

అనకాపల్లి

రద్దు చేసిన జర్నలిస్టుల చట్టాలను పునరుద్దరించాలి

రద్దు చేసిన జర్నలిస్టుల చట్టాలను పునరుద్దరించాలి

ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు వెంకటేష్

అనకాపల్లి : కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన జర్నలిస్టుల చట్టాలను తిరిగి పునరుద్దరించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు బి. వెంకటేష్ డిమాండ్ చేశారు. సోమవారం అనకాపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రద్దు చేసిన చట్టాలను పునరుద్ధరించాలని, జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, జర్నలిస్టులకు వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వెంకటేష్ మాట్లాడుతూ జర్నలిస్టులకు వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఒక పక్క పోరాటం చేస్తుంటే మరోపక్క కేంద్ర ప్రభుత్వం ఏకంగా ఈ చట్టాలను రద్దు చేయడం దారుణమని అన్నారు. ఈ చట్టాలను పునరుద్దరించాలంటూ దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తాయని, ఈ భారీ ఆందోళన కార్యక్రమం లో జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గోవాలని కోరారు. అలాగే ఈనెల 11 న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం అయినప్పటికీ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఎటువంటి కృషి చేయలేదని, అక్రిడేషన్లు విషయంలో తీవ్ర జాప్యం, ఇళ్ల స్ధలాల విషయం లో నాన్చుడు ధోరణి తదితర అంశాలపై నల్లబ్యాడ్జీలు ధరించి అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు వినతిపత్రం అందచేసి నిరశన తెలుపుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు శశి, నాగ, యూనియన్ నాయకులు అజయ్, శేఖర్ , గణేష్, గంటా శీను, సురేష్, రామకృష్ణ, నాగు, కోన లక్ష్మణ, నాయుడు, షణ్ముఖ, నానాజీ, హరికృష్ణ, శ్రీను, అప్పారావు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు

కేంద్రం రద్దు చేసిన కార్మిక చట్టాలు పునరుద్దరించాలి

ఎపి డబ్ల్యూ జె ఎఫ్ ఆధ్వర్యంలో కలక్టరేట్ వద్ద నిరసన.




కేంద్రం రద్దు చేసిన కార్మిక చట్టాలు పునరుద్దరించాలి
...............
ఎపి డబ్ల్యూ జె ఎఫ్ ఆధ్వర్యంలో కలక్టరేట్
వద్ద నిరసన.
.............
ఏలూరు :
కేంద్రం రద్దు చేసిన రెండు కార్మిక చట్టాలు పునరుద్ద రించి కలం కార్మికులైన జర్నలిస్ట్ లకు న్యాయం చెయ్యాలని ఏపిడబ్ల్యూజె ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె ఎస్ శంకర రావు డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం ఇక్కడ కలెక్టరేట్ ధర్నాచౌక్ వద్ద
ఎపి డబ్ల్యూజెఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జ్ లతో జర్నలిస్ట్ లు
నిరసన కార్యక్రమం చేపట్టారు.జిల్లా అధ్యక్షులు
ఎస్ డి జబీర్ ఆధ్వర్యంలో
జరిగిన నిరసన ప్రదర్శన లో సంఘాలకు అతీతంగా పాత్రికేయులు, రైతు సంఘ ప్రతినిధులు పాల్గొని సంఘీభావం తెలిపారు.
ఈ సందర్బంగా
రద్దు చేసిన రెండు కార్మిక చట్టాలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పై వత్తిడి తెచ్చి పునరుద్దరణ అయ్యే టట్టు
చూడాలని నినాదాలు చేశారు. అలాగే కూటమి ప్రభుత్వం ఎన్నికలు సమయం లో ఇచ్చిన హమీ లు అమలు చెయ్యాలని కోరారు.
పని చేసే జర్నలిస్ట్ లు అందరికీ ప్రభుత్వ గుర్తింపు కార్డు అక్రిటిడేషన్ ఇవ్వాలని,
ప్రతి వారికి మూడు సెంట్లు ఇంటి స్థలం మంజూరు చెయ్యాలని డిమాండ్ చేశారు.సీనియర్ పాత్రికే యులకు తమిళ నాడు, కేరళ పంజాబ్ రాష్టాల్లో మాదిరి గా యాభై ఏళ్ళు దాటిన వారికి ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాలని కోరారు.
ఈ నెల 11వ తేదీన మండల కేంద్రాల్లో ఎపి డబ్ల్యూ జెఎఫ్ తలపెట్టిన
ధర్నా లో పాత్రికేయ సోదరులు అందరూ పాల్గొని అక్కడతహసీల్దార్
లకు డిమాండ్ లతో కూడిన వినతి పత్రం ఇవ్వాలని పేర్కొన్నారు.
ఏలూరు జిల్లా ఫెడరేషన్ కార్యదర్శి హరీష్ జర్నలిస్ట్ ల ఐక్యత గురించి మాట్లాడారు. సీనియర్ జర్నలిస్ట్లు కె బాలశౌరి,
ఎం. గంగ రాజు,
జయరాం, హరీష్, దాసు, మిల్టన్, దొరబాబు,
సన్నీ, బాబ్జి, అర్జున్, నవీన్, ప్రతాప్, సత్యనారాయణ, శ్రీనివాస్, సజ్జి, రమేష్, షాజహాన్, శరత్ తదితరులు పాల్గొన్నారు.

కర్నూలు

జర్నలిస్టుల చట్టాలను పునరుద్ధరించాలి.

ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీల తో ధర్నా.

జర్నలిస్టుల చట్టాలను పునరుద్ధరించాలి.
ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీల తో ధర్నా.
జర్నలిస్టులకు రక్షణ చట్టాన్ని అమలు చేయాలి.
స్పెషల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు కు వినతి.


కేంద్రప్రభుత్వం 44 కార్మిక చట్టాల రద్దు చేసిన చట్టాల్లో జర్నలిస్టులకు సంబంధించిన రెండు చట్టాలు వర్కింగ్ జర్నలిస్టుల చట్టం 1955, వేతనాల చెల్లింపు చట్టం 1958 రద్దు మానుకోవాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మద్దిలేటి, రాష్ట్ర నాయకులు గోరంట్లప్ప, కేబి శ్రీనివాసులు,జిల్లా కన్వీనర్ నాగేంద్ర, ఫోటో గ్రాఫర్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు హుస్సేన్, సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ గుప్తా,వీడియో జర్నలిస్ట్ రాష్ట్ర నాయకులు హుస్సేన్ డిమాండ్ చేశారు.సోమవారం ఏపీడబ్ల్యూజేఎఫ్ నగర అధ్యక్షుడు శివ శంకర్ అధ్యక్షత న సోమవారం నల్లబ్యాడ్జీలతో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ జర్నలిస్ట్ చట్టాలు రద్దు చేయడం మనుకోవాలని రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు ధర్నాలకు పిలుపునిచ్చారన్నారు. జర్నలిస్ట్ లకు జరుగుతున్న దాడులకు రక్షణ చట్టాన్ని అమలు చేయాలని పలుమార్లు కోరుతున్నా నేటికి వాటి ఊసు లేదు. కానీ ఉన్నటువంటి చట్టాలను రద్దు పరచడం కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి సరైంది కాదన్నారు.సమాజంలో జర్నలిస్టుల పాత్ర గుర్తించి రద్దు చేసిన రెండు చట్టాలను పునరుద్ధరించాలని కోరుతున్నామన్నారు.కార్పొరేట్లకు అనుకూలమైన చట్టాలు చేస్తున్న కేంద్రం కార్మికుల గొంతును నొక్కుతూ చట్టాలను రద్దు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.ఇప్పటికైనా కార్మికులను ఆదుకోవాలని ,జర్మలిస్టుల చట్టాలు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా జర్నలిస్టుల ఐక్యతతో మరింత తీవ్రతరంచేస్తామన్నారు.అనంతరం స్పెషల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు కు వినతిని అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాయకులు సునీల్ కుమార్, నగర ప్రధాన కార్యదర్శి ఎర్రమల, ఫోటో గ్రాఫర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వడ్డే శ్రీనివాసులు, సీనియర్ నాయకులు రాజశేఖర్ నాయుడు,నగర ఉపాధ్యక్షుడు బాబు,నాయకులు చెన్నయ్య,అనిల్,మురళి,చంద్రశేఖర్, లక్ష్మయ్య,జర్మలిస్టులు పాల్గొన్నారు.

విజయనగరం

వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాలను పునరుద్ధరించాలి

కలెక్టరేట్ వద్ద ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన

వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాలను పునరుద్ధరించాలి

కలెక్టరేట్ వద్ద ఏపీడబ్ల్యూజేఎఫ్ నిరసన

విజయనగరం జూన్ 9:
కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన జర్నలిస్ట్ చట్టాలు 1995, 1998 చట్టాలను పునరుద్ధరించాలని, వృత్తి ప్రమాణాలను, వేజ్ బోర్డు చట్టాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలోన స్థానిక కలెక్టరేట్ వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. చట్టాల రద్దు పై కేంద్ర వైఖరిని నిరసిస్తూ పెద్దపెటున నినాదాలు చేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రమేష్ నాయుడు మాట్లాతూ వర్కింగ్ జర్నలిస్టుల వృత్తి ప్రమాణాలు కాపాడేందుకు, వేతనాల చెల్లింపుకు, ఇతర సదుపాయాలకు, వేతన బోర్డుల ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై ఈ చట్టాలు వర్కింగ్ జర్నలిస్టులకు ఏర్పాటును అందించే 1995, 1998 చట్టాలను రద్దు చేయడం దుర్మార్గం అని అన్నారు. ఈ చట్టాల రద్దు వల్ల జర్నలిస్టుల వృత్తి ప్రమాణాలకు విఘాతం కలగడంతో పాటు వేతన చెల్లింపులకు సంబంధించిన అంశాలు వస్తావనకు రాకుండా పోతాయన్నారు. ఇప్పటికే వర్కింగ్ జర్నలిస్టులు యాజమాన్యాల నుంచి చట్టబద్ధమైన రక్షణ లేకపోవడంతో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వర్కింగ్ జర్నలిస్టుల కోసం ఉన్న ఈ రెండు చట్టాలను తిరిగి పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ కోరుతోందన్నారు. మొత్తం మీడియాను ఒకే చట్ట పరిధిలోకి తెచ్చే విధంగా సరికొత్త చట్టాలు రూపొందించాల్సింది పోయి ఉన్న చట్టాలను రద్దు చేయడం ఎంత మాత్రం సరైన కాదని కాదన్నారు. రాష్ట్రవ్యాప్త ఎరుపులో భాగంగా ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించినట్టు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. మురళి శంకర్రావు పత్తివాడ అప్పారావు బి.ప్రసాదరావు, గొర్లె సూరిబాబు తదితరులు పాల్గొన్నారు

చిత్తూరు

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ పిలుపుమేరకు జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరంలోని మహ


ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ పిలుపుమేరకు జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు బెంగళూరు ప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాను ఉద్దేశించి ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు కవర కుంట్ల జయరాజ్ మాట్లాడుతూ
వర్కింగ్ జర్నలిస్టుల చట్టం 1955, వేతన చెల్లింపు చట్టం 1958.
వర్కింగ్ జర్నలిస్టుల వృత్తి ప్రమాణాలు కాపాడేందుకు జర్నలిస్ట్ లిస్టులు చేస్తున్న ఆందోళన కార్యక్రమానికి ప్రజా సం గాలు మద్దతు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏపీ బీజేఏ జిల్లా అధ్యక్షులు చల్లా జయచంద్ర, ప్రధాన కార్యదర్శి నీరజాక్షలు, ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు

వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాలను పునరుద్ధరించాలి

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపుమేరకు జూన్ 9వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా

కార్మిక చట్టాల రద్దులో భాగంగా వర్కింగ్ జర్నలిస్టుల చట్టం 1955, వేతనాలు చెల్లింపు చట్టం 1958 లను రద్దు చేయడానికి నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపుమేరకు జూన్ 9వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు జరిగాయి.
శ్రీకాకుళం జిల్లా మొదలు విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, గుంటూరు, ఒంగోలు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లా వరకు అన్నిచోట్ల వివిధ రూపాలలో ఈ ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. జిల్లా కేంద్రాలలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేయడం, ధర్నాలు, ప్రదర్శనలు చేపట్టి వర్కింగ్ జర్నలిస్టుల చట్టాల రద్దును నిరసిస్తూ ఆందోళన చేశారు. ఆ చట్టాలను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎస్ వెంకట్రావు అధ్యక్షులు
జి ఆంజనేయులు
ప్రధాన కార్యదర్శి

విశాఖ

70 ఏళ్ల తర్వాత రద్దు చేయడం దారుణం.

వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో నలబ్యాడ్జీలతో శాంతి యుత నిరసన.

వర్కింగ్ జర్నలిస్టుల చట్టాలను కేంద్రం పునరుద్ధరించాల్సిందే
.
70 ఏళ్ల తర్వాత రద్దు చేయడం దారుణం.

వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో నలబ్యాడ్జీలతో శాంతి యుత నిరసన.

కలెక్టరేట్... జూన్ 9

దేశవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించిన రెండు చట్టాలను కేంద్రం రద్దు చేయడం తగదని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, విశాఖ జిల్లా అధ్యక్షులు. పి నారాయణలు అన్నారు. ఆయా రెండు చట్టాలు రద్దును నిరసిస్తూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వర్కింగ్ జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలతో శాంతియుత నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా గంట్ల శ్రీను బాబు, పి..నారాయణలు మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించిన చట్టం 1955లో కేంద్రం అమల్లోకి తేవడం జరిగిందన్నారు. అలాగే వేతనాలు చెల్లింపునకు సంబంధించిన చట్టం 1958 నుంచి అమలు చేయడం జరిగిందన్నారు. మరి 70 ఏళ్ల తర్వాత ఈ రెండు చట్టాలు రద్దు చేయడం వల్ల జర్నలిస్టులకు తీవ్రంగా నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. కాబట్టి కేంద్రం రద్దు చేసిన ఈ రెండు చట్టాలను జర్నలిస్ట్ ల పరిస్థితులు దృష్టి లో ఉంచుకొని తక్షణమే పునరుద్ధరించాలని వీరు డిమాండ్ చేశారు. ఇప్పటికే వర్కింగ్ జర్నలిస్టుల పరిస్థితి దయనీయంగా మారిందని వీరు అభిప్రాయపడ్డారు. జర్నలిస్టులకు పూర్తిస్థాయిలో సంక్షేమం కొరవడిందని,అలాగే ఉద్యోగ భద్రతతో పాటు వేతనాలు చెల్లింపులు,దాడుల నియంత్రణకు సంబంధించి సరైన చట్టాలు లేవని అందువల్లే మీడియా కమిషన్ ఏర్పాటు ను తాము ఎప్పటినుంచో స్వాగతిస్తున్నామన్నారు. వీటితోపాటు అటాక్స్ కమిటీలు,ఇతర ప్రభుత్వ కమిటీల్లో కూడా జర్నలిస్టుల సంఘాలకు విధిగా ప్రాతినిధ్యం కల్పించాల్సిందేనన్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ కార్యదర్శి జి. శ్రీనివాస్ రావు,బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల జిల్లా అధ్యక్షులు ఇరోతి ఈశ్వర్ రావు కార్యదర్శి కె. మదన్. చిన్న మధ్య తరహో పత్రికల సంఘం అధ్యక్షుడు జగన్మోహన్, జర్నలిస్టు నేతలు వి. శ్రీనివాస్ రావు, కృష్ణ మూర్తి నాయుడు, శ్రీనివాస్ నాయుడు, కామన్న, కేవీ శర్మ, చక్రి,,.నాయుడు ,సత్య నారాయణ. నగేష్ బాబు.. శ్రీ లత, మాధవి గౌతమ్,వినయ్, శివ,పాల్గొన్నారు..

వ్యాక్సిన్ తోనే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నియంత్రణ విశాఖపట్నం జూన్ 9

విశాఖ జిల్లాలో జూన్ 9వ తేదీన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, చైతన్య స్రవంతి స్వచ్�

వ్యాక్సిన్ తోనే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నియంత్రణ విశాఖపట్నం జూన్ 9. తొమ్మిది నుండి 14ఏళ్ల వయస్సు గల ఆడపిల్లలకు సెర్వావాక్
వ్యాక్సిన్ వేయడం ద్వారానే గర్భాశయ ముఖ్య ద్వార క్యాన్సర్ ను నియంత్రించగలమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ రిటైర్డ్ అధికారి డాక్టర్ సరోజిని అన్నారు.చైతన్య స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ సంయుక్తంగా పాత పోస్టా ఫసు సమీపంలోని మత్స్యకార భవనంలో సోమవారం ఉదయం జర్నలిస్టుల ఆడపిల్లలకు నిర్వహించిన సెర్వావాక్ వ్యాక్సిన్ రెండో డోసు వేసే కార్యక్రమంను ఆమె ప్రారంభించారు. వ్యాక్సిన్ ద్వారానే ది హ్యూమన్ పాపిలోమా వైరస్ ను అరికట్టగలమని ఈ వ్యాక్సిన్ వేసుకునే ఆడపిల్లలకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని తల్లిదండ్రులు ఈ విషయంలో భయపడాల్సిన పనిలేదని చెప్పారు. 45 ఏళ్ల వయసు వరకు మహిళలు ఈ వ్యాక్సిన్ వేసుకోవచ్చని క్యాన్సర్ నియంత్రణకు ఇంతకన్నా మరో మార్గం లేదన్నారు. సభకు అధ్యక్షతన వహించిన చైతన్య స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ షిరీన్ రహమాన్ మాట్లాడుతూ జర్నలిస్టుల ఆడపిల్లల ఆరోగ్య పరిరక్షణకు ఈ వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని చేపట్టామని రెండు డోసులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. సామాజిక రుగ్మతలపై చైతన్య స్రవంతి ప్రజలను చైతన్య పరుస్తూనే ఉందన్నారు. ఇప్పటికే చైతన్య స్రవంతి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని మున్ముందు మరిన్ని సమాజ హిత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సీనియర్ జర్నలిస్ట్ జి. వల్లేశ్వర్ మాట్లాడుతూ చైతన్య స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ సామాజిక సేవే ధ్యేయంగా ఏర్పాటు అయిందని నాటి నుండి నేటి వరకు లక్ష్యాలను సాధించి అన్ని వర్గాలను ఆకట్టుకుందని అన్నారు.. సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ రహమాన్ ప్రస్తుత అధ్యక్షులు షిరిన్ రహమాన్ లు ప్రజారోగ్యంను దృష్టిలో పెట్టుకొని ఇటువంటి వ్యాక్సినేషన్ కార్యక్రమాలు నిర్వహించడం ముదావాహమన్నారు. మరో సీనియర్ జర్నలిస్టు బులుసు ప్రభాకరశర్మ మాట్లాడుతూ ప్రజల కోసం రెహమాన్,షిరీన్ రహమాన్ దంపతులు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయని కొనియాడారు.ఈ సందర్భంగా వల్లేశ్వర్, బులుసు ప్రభాకర్ శర్మ,సరోజినిలను వుడా మాజీ చైర్మన్ రహమాన్, షిరీన్ రహమాన్ దంపతులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు అత్తిలి శంకర్రావు ఏపీడబ్ల్యూజేఎఫ్ విశాఖపట్నం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి నారాయణ్, జి శ్రీనివాస్ మరియు చైతన్య స్రవంతి ప్రతినిధులు విజయ,రుకియా భాను,లక్ష్మీ శారద, ఉమ, దేవి గొలగాని రవీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

విశాఖలో రాష్ట్రకార్యవర్గం సమావేశం లో కీలక నిర్ణయాలు

జూన్ 9న రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టుల ఆందోళన

ఏపీలో జర్నలిస్టుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి

*జూన్ 9న రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టుల ఆందోళన*

*రెండు చట్టాలను కేంద్రం రద్దు చేయడంపై నిరసన*

*ఏపీలో జర్నలిస్టుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి*

*విశాఖలో రాష్ట్రకార్యవర్గం సమావేశం లో కీలక నిర్ణయాలు*

ఆంధ్ర యూనివర్సిటీ.. జులై 29

దేశ వ్యాప్తముగా జర్నలిస్టులకు సంబంధించిన రెండు కీలక చట్టాలను కేంద్రం రద్దు చేయడం పట్ల నిరసిస్తూ జూన్ 9న రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టుల ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్..వెంకటరావు ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు ప్రకటించారు..గురువారం ఇక్కడ ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్లాటినం జూబ్లీ హాల్ లో ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వీరు మాట్లాడుతూ కేంద్రం తాజాగా 44 కార్మిక చట్టాలను రద్దు చేసిందని అందులో రెండు జర్నలిస్టులకు సంబంధించినవి ఉన్నాయన్నారు.. వర్కింగ్ జర్నలిస్టుల చట్టం 1955,
.. వేతనాల చెల్లింపులు చట్టం 1958 రద్దు చేసిన వాటిలో ఉన్నాయన్నారు.. వీటిని తక్షణమే పునరుద్ధరించాలని జూన్ 9 న నిర్వహించే జాతీయ కార్మిక సంఘాలు ఆందోళనలో జర్నలిస్టులు కూడా పాల్గొనాలని వీరు పిలుపునిచ్చారు.
రాష్ట్రము లో.....

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేనిపక్షంలో దశలవారీగా ఆందోళన తప్పదని రాష్ట్ర అధ్యక్షులు ఎస్. వెంకటరావు, జి. ఆంజనేయులు పేర్కొన్నారు.. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న నేటికి అక్రిడేషన్ లు కొత్తవి మంజూరు చేయలేదన్నారు అలాగే ప్రభుత్వాలు మారినప్పటికీ జర్నలిస్టులు ఇళ్ల స్థలాలకు సైతం నోచుకోలేదన్నారు.. 11రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పెన్షన్ పథకం అమలు చేయాలని,
మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని,. ప్రమాద బీమా పునరుద్ధరించాలని ఇలా అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నట్లు వీరు చెప్పారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చేసిన తీర్మానాలను త్వరలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లకు నివేదిస్తామన్నారు. జర్నలిస్టులపై దాడులు నిరోధానికి ప్రత్యేక చట్టం చేయాలని అలాగే జర్నలిస్టులకు పత్రిక స్వేచ్ఛ కల్పించాలని తీర్మానములు చేసారు.. ఈ సమావేశంలో వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, బ్రాడ్ కాస్ట్ కు సంబందించిన నూతన వెబ్ సైట్ ను ఆవిష్కరించారు సమావేశం లో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ విశాఖ వేదికగా త్వరలో రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి తమ కార్యవర్గం తమ వంతు కృషి చేస్తుందన్నారు ఈ సమావేశంలో
ఎన్ ఎ జే సెక్రటరీ జనరల్ ఎం కొండయ్య..జెండర్ ఈక్విటీ కౌన్సిల్ చైర్మన్ కే మంజరి జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీను బాబు విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణ కార్యదర్శి జి శ్రీనివాసరావు బ్రాడ్ కాస్ట్ అధ్యక్షులు ఇరోతి ఈశ్వర్ రావు, కార్యదర్శి కె. మదన్, చిన్న మధ్య తరహో పత్రికల సంఘం అధ్యక్షులు జగన్ మోహన్, కె. శ్రీనివాస్ రావు,వివిధ జిల్లాలకు చెందిన ఫెడరేషన్ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు...

*రేపు విశాఖలో ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

*రేపు విశాఖలో ఏపీ వర్కింగ్ *పలు తీర్మానాలతో కూటమి ప్రభుత్వానికి నివేదిక

*విశాఖ జిల్లా కార్యవర్గ సమావేశంలో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల*



అక్కయ్యపాలెం కూడలి... మే 27:

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో గురువారం ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం (ఎన్ఎజే) కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, విశాఖ జిల్లా అధ్యక్షుడు పి. నారాయణలు తెలిపారు. మంగళవారం అక్కయ్యపాలెం కూడలిలోని ఓ ప్రయివేటు హోటల్లో విశాఖ జిల్లా సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు, పి. నారాయణ్ లు మాట్లాడుతూ గురువారం ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్లాటినం జూబ్లీ హాల్ 2..లో ఉదయం 11 గంటలకు రాష్ట్ర కార్యవర్గం సమావేశం ప్రారంభం కానుందన్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు చెందిన 70 మంది ప్రతినిధులు హాజరుకానున్నట్లు చెప్పారు. సమావేశంలో తాము ఐదు తీర్మానాలను ప్రవేశ పెట్టి, వాటికి రాష్ట్ర కార్యవర్గం ఆమోదం తీసుకుంటామన్నారు. ఇందులో ప్రధానంగా వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు మంజూరు చేయడంతోపాటు జర్నలిస్టుల సంఘాలకు కమిటీల్లో ప్రాతినిధ్యం కల్పించాలని, ప్రమాద బీమా వెంటనే పునర్దురించాలని, 11 రాష్ట్రాల్లో విజయవంతంగా అమలు చేస్తున్న పెన్షన్ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ లో కూడా త్వరగా అమలు చేయాలని, పార్లమెంటులో చర్చించిన విధంగా ఏపీలో మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, చిన్న, మధ్య తరహా పత్రికలకు ఎంప్యానెల్ తో సంబంధం లేకుండా ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చి ప్రోత్సహించాలని తీర్మానాలు చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ కు నివేదిస్తామన్నారు. అంతేకాకుండా రాష్ట్ర మహాసభలకు ఆయా నేతలను ఆహ్వానించడం జరుగుతుందన్నారు. గురువారం నాటి సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులతోపాటు పలు జిల్లాలకు చెందిన ముఖ్య కార్యవర్గ సభ్యులు హాజరుకానున్నట్లు చెప్పారు.ఈ సమావేశంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ విశాఖపట్నం జిల్లా కార్యదర్శి జి. శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.ఎస్. ప్రసాద్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ రంగధామం ఉపాధ్యక్షులు ఆనంద్,ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్
విశాఖ జిల్లా అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కింతాడ మదన్, అసోసియేషన్ ప్రతినిధులు మళ్ల త్రినాధ్, డిపి నాయుడు, జి ఆర్ ఎస్ రమేష్, స్మాల్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ రావు, కార్యదర్శి శ్రీనివాసరావు, కె.వి శర్మ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

అనంతపురం జిల్లా

ETV రిపోర్టర్ లక్ష్మి ప్రసాద్ కు APWJF ఆధ్వర్యంలో జర్నలిస్టుల సన్మానం

వ్యవసాయం, జీవవైవిద్యం సంబంధించి లోతైన విశ్లేషణలతో ఈటీవీ లో కథనాలు ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న సందర్భంగా ఈటీవీ సీనియర్ చీఫ్ రిపోర్టర్ లక్ష్మీ ప్రసాద్ ను సన్మానిస్తున్న APWJF అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపటి రామాంజనేయులు , వివిధ పత్రికలు, టీవీ చానెల్స్ జర్నలిస్టులు .

దేశంలో మీడియా కమిషన్ ఏర్పాటుకు స్వాగతిస్తాం.

* భారతీయ జర్నలిస్టు ధ్రువతార మానికొండ చలపతిరావున్

* అంబరాన్ని తాకిన జర్నలిస్టుల ఉగాది సంబరాలు.

డాబాగా ర్డెన్స్.. మార్చి 28 : జర్నలిస్టుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం మీడియా కమిషన్ ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకరించడం పట్ల ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ఇక్కడ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఏపీ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్,ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్, ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో విశ్వావసు ఉగాది నామ సంవత్సర. వేడుకలు అందరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంజనేయులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయని,అలాగే అనేక ప్రాంతాల్లో హత్యలు జరుగుతున్నాయని ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు మీడియా కమిషన్ ఎంత గానో తోడ్పాటు అందిస్తుందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ద్వారా జర్నలిస్టులు సమస్యలు పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. గౌరవ అతిథులుగా హాజరైన ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ డీకే బారువ, ఎ సి ఎ మీడియా మేనేజర్ జై కిషన్, ప్రముఖ సంఘ సేవకులు మట్టపల్లి హనుమంతరావు,శంకర్ ఫౌండేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ బంగార్రాజు తదితరులు మాట్లాడుతూ. సమాజానికి జర్నలిస్టులు అందిస్తున్న సేవలు ఎంతో ప్రశంసనీయమన్నారు.

జర్నలిస్ట్ ధ్రువతార మానికొండ

భారతీయ జర్నలిజములో మానికొండ చలపతి రావు ధ్రువతారగా నిలిచారని ఆంధ్ర యూనివర్సిటీ ఆచార్యులు బాబీ వర్ధన్ కొనియాడారు.. సీనియర్ పాత్రికేయులు ఆకుల అమరయ్య రచించిన మాని కొండ చలపతి రావు పుస్తకం ను ఆచార్య బాబీ వర్ధన్, జర్నలిస్ట్ నాయకులు జి.ఆంజనేయులు, కొండ బాబు, రంగా రెడ్డి, గంట్ల శ్రీను బాబు, పి. నారాయణ తదితరులు చేతులు మీదుగా ఆవిష్కరించారు.. ఈ సందర్బంగా బాబీ వర్ధన్ మానికొండ గొప్ప తనము, జర్నలిస్ట్ గా ఆయన సాధించిన అద్భుతాలు, నిరాడంబర జీవితం, ఇతర విశేషాలు వివరించారు...ఈ పుస్తక రచన చేయడం తన అదృష్టం అని అమరయ్య పేర్కొన్నారు..ఉత్తరాంద్ర ప్రాంతం కు చెందిన మాని కొండ చలపతి రావు జీవితం భవిష్యత్ తరాలకు ఆదర్శం అన్నారు.. నాటి ప్రధాని నెహ్రు, ఇందిరా గాంధీ వంటి వారు సైతం మాని కొండ వార్తలు, రచనలుతో పాటు జర్నలిజము ను నిటారుగా నిలబెట్ వ్యక్తి గా అభివర్ణించారని అమరయ్య తన ప్రసంగం లో పేర్కొన్నారు.

దేశంలో మీడియా కమిషన్ ఏర్పాటుకు స్వాగతిస్తాం.

* భారతీయ జర్నలిస్టు ధ్రువతార మానికొండ చలపతిరావున్

* అంబరాన్ని తాకిన జర్నలిస్టుల ఉగాది సంబరాలు.

డాబాగా ర్డెన్స్.. మార్చి 28 : జర్నలిస్టుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం మీడియా కమిషన్ ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకరించడం పట్ల ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ఇక్కడ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఏపీ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్,ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్, ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో విశ్వావసు ఉగాది నామ సంవత్సర. వేడుకలు అందరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంజనేయులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయని,అలాగే అనేక ప్రాంతాల్లో హత్యలు జరుగుతున్నాయని ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు మీడియా కమిషన్ ఎంత గానో తోడ్పాటు అందిస్తుందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ద్వారా జర్నలిస్టులు సమస్యలు పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. గౌరవ అతిథులుగా హాజరైన ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ డీకే బారువ, ఎ సి ఎ మీడియా మేనేజర్ జై కిషన్, ప్రముఖ సంఘ సేవకులు మట్టపల్లి హనుమంతరావు,శంకర్ ఫౌండేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ బంగార్రాజు తదితరులు మాట్లాడుతూ. సమాజానికి జర్నలిస్టులు అందిస్తున్న సేవలు ఎంతో ప్రశంసనీయమన్నారు. అలాగే క్రమం తప్పకుండా జర్నలిస్ట్ లు ఉగాదితో పాటు అనేక పండుగలు కూడా నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా తమ యూనియన్లు సేవలు అందిస్తున్నాయ న్నారు. తమ పరిధి మేరకు. జర్నలిస్టులకు సహాయం అందిస్తున్నామని, అందరు బాగుండాలి అన్నదే తమ లక్ష్యం అన్నారు... ఈ సందర్బంగా ప్రముఖ పండితులు బ్రహ్మశ్రీ బులుసు సాయి కృష్ణ శర్మ నిర్వహించిన పంచాంగ శ్రవణములో ఆదాయం, వ్యయాలు ఆరోగ్యం, పంటలు వంటి అంశాలు విపులంగా వివరించారు... పలువురు జర్నలిస్ట్ ల పిల్లలు ప్రదర్శించిన సాంసృతిక కార్యక్రమాలు విశేషం గా అలరించాయి.మహిళలు కు చీరలు, పిల్లలు కు బహోమతులు, పంచాంగం పుస్తకాలు పంపిణీ చేసారు.. ఈ ఉగాది సంబరాలు లో విశాఖ జిల్లా కార్యదర్శి పి.. నారాయణ, కార్యదర్శి జి. శ్రీనివాస్ రావు, బ్రాడ్ కాస్ట్ కార్యదర్శి కె. మదన్, చిన్న, మధ్య తరహో పత్రికల సంఘం అధ్యక్షులు జగన్ మోహన్, కె. శ్రీనివాస్, ఫెడరేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ లు డి. రవి కుమార్, ఎ. సాంబ శివరావు, గొడబ రాంబాబు, బండారు శివ ప్రసాద్,ఎంవీ రాజశేఖర్ తో పాటు వందలాది మంది జర్నలిస్ట్ లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image

Magazines - 2025

View All Magazines
January
January Magazine
February
February Magazine
March
March Magazine
April
April Magazine
MAY
MAY Magazine
June
June Magazine
july
july Magazine
AUGUST
AUGUST Magazine

Gallery

Andhra Pradesh Working Journalists Federation (APWJF)

1980 దశకం వరకు బ్రాడ్‌కాస్ట్‌ మీడియాలో ప్రభుత్వ మీడియా మాత్రమే కొనసాగింది...

జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఏర్పడిన: ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు గౌరవాధ్యక్షులుగా, వి యశోనాథ్‌, పి. శ్రీధర్‌ ఈశ్వర్‌, ఎస్‌ సౌజన్య, బివిఎల్ కె మనోహర్‌, వై. జోగిరెడ్డిలతో ఏర్పడిన సంఘం.

Get In Touch

H. No. 40-15/1-30, SVBS Kamala,
B-1, First floor, Brundavan
colony, Labbipet,
Vijayawada - 10

generalsecretaryapwjf@gmail.com

+91 9866399883

© APWJF All Rights Reserved.Design & Developed By Gateway webs