జర్నలిస్టులు అన్ని సమస్యలు పరిష్కరిస్తాం...వైద్య పరీక్షలు కు ఆదేశాలు జారీ చేశాం
స్కూల్ ఫీజు రాయితీ ఉత్తర్వులు
వెంటనే ఇవ్వాలని డి ఆర్ ఒ కు ఆదేశాలు
విశాఖపట్నం, జూలై 7
విశాఖ జిల్లాలో ఉన్న జర్నలిస్టులకు సంబంధించిన అన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అన్నారు. సోమవారం జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు ఆధ్వర్యంలో ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, బ్రాడ్ కాస్ట్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ లు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ను కలిసి పెండింగ్ సమస్యలను ప్రస్తావించారు. అలాగే ఇతర జిల్లాల్లో జర్నలిస్ట్ ల కోసం అమలు చేస్తున్న ఉత్తర్వులు కలెక్టర్ కు వీరు అందజేయడం జరిగింది. జర్నలిస్టులకు వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే స్కూల్ ఫీజు రాయితీ ఉత్తర్వులు కూడా తక్షణమే అందజేయాలని డిఆర్ఓ. భవాని శంకర్ ను ఆదేశించారు. ఇంకా జర్నలిస్ట్ లు పెండింగ్ సమస్యలు ఉంటే వాటిని కూడా వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని కలెక్టర్ చెప్పారు.ఫెడరేషన్ విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణ్, కార్యదర్శి జి శ్రీనివాసరావు.ఆర్గనైజింగ్ సెక్రటరీ పి. ఎస్. ప్రసాద్, బ్రాడ్ కాస్ట్ అధ్యక్ష కార్యదర్శులు ఇరోతి ఈశ్వరరావు కే మదన్ చిన్న పత్రికల సంఘం అధ్యక్షులు జగన్మోహన్, ఫెడరేషన్ ఉపాధ్యక్షులు బి శివప్రసాద్, ఎన్ రామకృష్ణ. రాజశేఖర్. పిల్ల నగేష్ బాబు, చక్రి తదితరులు పాల్గొన్నారు.
కాకినాడలో ఏపీడబ్ల్యుజేఎఫ్ జిల్లా కమిటీ సమావేశం
-జర్నలిస్టుల సమస్యలపై చర్చ
-ప్రమాదాలపాలైన జర్నలిస్టులకు ఆర్థిక సాయం అందజేత
-జర్నలిస్టుల సమస్యలపై నిరంతర పోరాటం చేస్తాం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు
కాకినాడ, జూలై 4,
కాకినాడలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కాకినాడ జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు అయింది. కాకినాడ జిల్లా అధ్యక్ష వాతాడ నవీన్ రాజ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి జర్నలిస్టులకు సంబంధించి వివిధ సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు మాట్లాడుతూ జూన్ 9, 11 తేదీలలో జర్నలిస్టుల సమస్యల సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాలుగా నిరసనలను నిర్వహించామన్నారు. జర్నలిస్టులకు సంబంధించిన రెండు చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందని, దానికి సంబంధించి 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేశామన్నారు. 11వ తేదీన జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి, అక్రిడిటేషన్ సమస్యల కొరకు, దేశంలో 14 రాష్ట్రాలలో జర్నలిస్టులకు పెన్షన్ అమలవుతూ ఉంటే మన తెలుగు రాష్ట్రాలలో పెన్షన్ అనేది పెన్షన్ అమలుకు కార్యరూపం దాల్చలేదని, పెరిగిన మీడియాకు అనుగుణంగా మీడియా కమిషన్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. దీనిపై సమాచార శాఖ మంత్రిని కలిసి సుదీర్ఘంగా చర్చించామని, దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. సచివాలయంలో జర్నలిస్టు సంఘాల అన్నింటితో ఒక సమావేశం ఏర్పాటు చేసి విధివిధానాలు రూపొందిస్తామని తెలియజేశారన్నారు. గత ప్రభుత్వంలో జర్నలిస్టుల ఇళ్లకు సంబంధించి జీవో విడుదల అయిందని ఆ జీవో కు సంబంధించి జర్నలిస్టుల ఇళ్ళ కోసం అప్లికేషన్లు కూడా తీసుకోవడం జరిగిందని, ప్రస్తుత ప్రభుత్వం దానిపై ఇంటి స్థలంతో పాటు ఇల్లును కట్టించే ప్రయత్నం పై కసరత్తు చేస్తుందని మంత్రి తెలియజేశారన్నారు. ప్రస్తుతం జర్నలిస్టులకు రాజకీయరంగులు అంటిస్తున్నారని అటువంటి ప్రయత్నాలు ప్రజాప్రతినిధులు మానుకోవాలని, అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నామని, జర్నలిస్టులు కూడా జర్నలిస్టులానే పని చేయాలన్నారు. జర్నలిస్టుల పెన్షన్ కొరకు పటిష్టంగా పోరాడుతున్నామని, వృద్ధాప్య పెన్షన్లు తీసుకుంటున్నారని మంత్రి సెలవిచ్చారని అదే కాకుండా ముందుగానే జర్నలిస్టులకు పెన్షన్ విధానం కొనసాగింపు చేయాలని కోరామన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టుల ఇల్లు కోసం రాష్ట్రవ్యాప్తంగా 600 నుండి 650 ఎకరాల స్థలం సరిపోతుందని, అలా చూసుకున్న మండలానికి అరెకరం నుండి ఎకరం వరకు సరిపోతుందన్నారు. ఒక నియోజకవర్గానికి లక్షలలో ప్రజలకు న్యాయం చేసే ప్రజాప్రతినిధులు జిల్లాలో మొత్తంగా 500 నుండి 600 మంది జర్నలిస్టులు ఉన్న ఏమి చేయలేకపోతున్నారన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ఏపీడబ్ల్యూజేఎఫ్ తో పాటు మిగతా యూనియన్లు కూడా పనిచేయాలని తెలియజేస్తున్నామన్నారు. కాకినాడ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వాతాడ నవీన్ రాజ్, ముమ్మిడి లక్ష్మణు లు మాట్లాడుతూ సభ్యత్వ నమోదు, జర్నలిస్టుల సమస్యలపై చర్చించి జిల్లాలో ప్రధానంగా ఉన్న సమస్యలపై వివరణలు ఇచ్చారు. ఇటీవల కాలంలో వివిధ ప్రమాదాలకు గురైన ఏపీడబ్ల్యూజేఎఫ్ సభ్యత్వం కలిగిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయ చెక్కులను ముఖ్యఅతిథి చేతుల మీదుగా అందజేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షులు అల్లుమల్లు ఏలియా మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై ఎప్పుడు చిత్తశుద్ధితో పోరాటం చేసే ఏపీడబ్ల్యూజేఎఫ్ మునుముందు కూడా మరిన్ని పోరాటాలు చేసి జర్నలిస్టులకు న్యాయం చేయాలన్నారు. జర్నలిస్టుల పిల్లలకు తన శక్తి మేరకు ఎంతవరకు ఫీజు విషయంలో తగ్గించగలిగితే అంతవరకు మాట్లాడి చేపిస్తానని ఆగస్త్య స్కూల్ కి సంబంధించి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రెజరర్ రామకృష్ణ, రాష్ట్ర సభ్యులు ఎండి అధికార్, ఎస్.కె మున్ని, శ్రీనివాస్, శ్రీహరి రాజు, జిల్లా కమిటీ సభ్యులు బాబి, సత్తిబాబు, జి శోభన్, డి శ్రీధర్, బాబురావు, మల్లేశ్వరరావు, రాజు, వల్లూరి నానాజీ, పుర్రె త్రినాథ్, సత్య, రెడ్డి, స్టాలిన్, లోవరాజు, ప్రవీణ్, రాము, రాంబాబు, కిరణ్ బాబు తదితరులు పాల్గొన్నారు.
సమాచార శాఖ మంత్రి దృష్టికి జర్నలిస్టుల సమస్యలు*
*సానుకూలంగా స్పందించిన మంత్రి
పార్ధ సారధి*
త్వరలో ప్రమాద భీమా పునరుద్దరణ
*ఇళ్ల కేటాయింపుల పై ముఖ్య మంత్రి
సానుకూలత*
.... విశాఖపట్నం జూన్ 28.
రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ శనివారం రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ కొలుసు పార్థసారధి దృష్టికి తీసుకువెళ్లింది
జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు నాయకత్వంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ విశాఖపట్నం జిల్లా అధ్యక్ష, కార్య దర్శులు పి.నారాయణ్, జి.శ్రీనివాస్, ఏపీబ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఇరోతి ఈశ్వరరావు, మదన్ లు మంత్రి శ్రీ పార్థసారథి కలిసి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు ముఖ్యంగా జర్నలిస్టులకు హెల్త్ కార్డులు త్వరలో మంజూరు చేస్తామని ఇందుకు సంబంధించి 50శాతం ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.జర్నలిస్టులకు పింఛన్లు విషయమై ముఖ్యమంత్రిశ్రీ చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి తగు నిర్ణయం తీసుకొంటామని పేర్కొన్నారు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు లేదా ఇల్లు కేటాయించే విషయమై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని త్వరలో ఇందుకు సంభందించి కార్యాచరణ రూపొందిస్తామని హామీ ఇచ్చారు.ప్రమాద భీమా త్వరలో పునరుద్దరణ చేస్తామని మంత్రి చెప్పారు జర్నలిస్టులకు త్వరలో అక్రిడేషన్లు మంజూరు చేస్తామని డిజిటల్ మీడియాకు అక్క్రిడేషన్లుఇచ్చే విషయమై ప్రభుత్వం నియమ నిబంధనలు పాటించక తప్పదన్నారు అయితే అందరికీ న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నగేష్ బాబు, టి. పి. నాయుడు తదితరులు పాల్గొన్నారు
జర్నలిస్టులకు వైద్య పరీక్షలకు ఏర్పాట్లు
నేడో రేపో 50% స్కూల్ ఫీజు రాయతీ
*యోగాంద్ర విజయవంతం సందర్బంగా
కలెక్టర్ కు ఫెడరేషన్ ఘనంగా సత్కారం*
సింహాద్రి నాధుడు జ్ఞాపిక అందించిన గంట్ల
విశాఖపట్నం, జూలై 1.
విశాఖపట్నం జిల్లా జర్నలిస్టులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటుగా వారి పిల్లలకు స్కూల్ ఫీజుల్లో 50%రాయితీ కూడా ఇవ్వడం జరుగుతుంది అని జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ తెలిపారు. ఇటీవల జరిగిన యోగాంధ్ర కార్యక్రమం దిగ్విజయం అయిన సందర్భంగా జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీను బాబు ఆధ్వర్యంలో పలువురు జర్నలిస్టు నాయకులు, జర్నలిస్టులు మంగళవారం కలెక్టర్ కలెక్టరు హరేంద్ర ప్రసాద్ ను శాలువ, పుష్పగుచ్చంతో ఘనంగా సత్కరించి సింహాద్రి అప్పన్న చిత్ర పటాన్ని బహుకరించారు. ఈ సందర్బంగా జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, విశాఖ జిల్లా ప్రెసిడెంట్ పోతుమహంతి నారాయణ లు కలెక్టర్ తో మాట్లాడుతూ జర్నలిస్టులకు ఉచితముగా వైద్య పరీక్షలు నిర్వహించాలని, గత ఏడాది అపోలో కార్పొరేట్ ఆసుపత్రి లో నిర్వహించడం జరిగింది అని ఈ ఏడాది కూడా మంచి కార్పొరేట్ ఆసుపత్రి లో నిర్వహించాలని కలెక్టర్ ను కోరారు..ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టామని ఇప్పటికే సంబంధిత విభాగం అధికారులు కు ఆ బాధ్యత అప్పగిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు.
జర్నలిస్ట్ ల పిల్లలకు స్కూల్ ఫీజు రాయితీ కల్పించాలని ఇప్పటికే వినతి పత్రము అందించామని కలెక్టర్ కు వివరించగా ఫీజు రాయితీ కల్పించడానికి తగిన ఆదేశాలు ఇచ్చామన్నారు,, నేడో రేపో జిల్లా విద్యా శాఖ ద్వారా ఉత్తర్వులు జారీ చేస్తామని కలెక్టర్ చెప్పారు ఈ కార్యక్రమం లో జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి,ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ విశాఖ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పీ నారాయణ్,జీ శ్రీనివాస రావు,బ్రాడ్ కాస్ట్ అసోసియేషన్ కార్యదర్శి కింతాడ మదన్,స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీఎస్ జగన్మోహన్,కార్యనిర్వాహక సభ్యుడు అరుణ్ కుమార్,సభ్యుడు రమణ మూర్తి,ఫెడరేషన్ నగేష్ బాబు పాల్గొన్నారు.
,
జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వానికి నివేదించాం
గ్రామీణ ప్రాంత జర్నలిస్టులకు అండగా ఉంటాం
మాడుగుల, సమావేశంలో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల
మాడుగుల.. జూన్ 24
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టులు సమస్యలను ఇప్పటికే కూటమీ ప్రభుత్వానికి నివేదించడం జరిగిందని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీను బాబు అన్నారు.. మంగళవారం మాడుగుల లో నిర్వహించిన ఏపీ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ మాడుగుల యూనిట్ సర్వ సభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.. జర్నలిస్టులకు వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అలాగే మరో పదకొండు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇటీవలే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందజేయడం జరిగింద న్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి లకు పెండింగ్ సమస్యలు నివేదించామన్నారు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించాలని వారిని కోరామన్నారు అలాగే గ్రామీణ ప్రాంత జర్నలిస్టులకు కూడా మెరుగైన సదుపాయాలు కల్పించాలని, అలాగే రైలు, బస్సు ప్రయాణాల్లో వారికి రాయితీ సదుపాయం కల్పించాలని కోరుతున్నామన్నారు. త్వరలోనే రాష్ట్ర మహాసభలు నిర్వహించి అందులో జర్నలిస్టులకు సంబంధించిన కీలక సమస్యలపై చర్చించి వాటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు.. జర్నలిస్టులంతా ఐక్యంగా సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాళ్లపరెడ్డి వెంకట రాజారాం, మాజీ ఎంపీపీ మోదకొండమ్మ ఆలయ కమిటీ చైర్మన్ పుప్పాల అప్పలరాజు, ఉప సర్పంచ్ శ్రీనాథ్ శ్రీనివాసరావు మాజీ సర్పంచ్ దంగేటి సూర్యారావు ... ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ఈశ్వరరావు, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బి వెంకటేష్, ప్రధాన కార్యదర్శి ఏ ఖాదర్, ఏపీ బీజేఏ అనకాపల్లి జిల్లా అధ్యక్షులుఎస్.కె భాష, విశాఖ సిటీ ఫెడరేషన్ కార్యదర్శి జి శ్రీనివాసరావు, ఏపీ బీజే విశాఖ సిటీ అధ్యక్షులు ఈరోతి ఈశ్వరరావు, కార్యదర్శి కే.మదన్ తదితరులు పాల్గొన్నారు.అనంతరం
మాడుగుల నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది.
1980 దశకం వరకు బ్రాడ్‌కాస్ట్ మీడియాలో ప్రభుత్వ మీడియా మాత్రమే కొనసాగింది...
జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఏర్పడిన: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు గౌరవాధ్యక్షులుగా, వి యశోనాథ్, పి. శ్రీధర్ ఈశ్వర్, ఎస్ సౌజన్య, బివిఎల్ కె మనోహర్, వై. జోగిరెడ్డిలతో ఏర్పడిన సంఘం.
© APWJF All Rights Reserved.Design & Developed By