జర్నలిస్టుల సంక్షేమమే ఫెడరేషన్ లక్ష్యం
-ఏపీ డబ్ల్యూ జేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి ఈశ్వరరావు
అనకాపల్లి : జర్నలిస్టుల సంక్షేమమే ఫెడరేషన్ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు బి ఈశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం అనకాపల్లి రోటరీ క్లబ్ లో నిర్వహించిన అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలుస్తున్న జర్నలిస్టులకు ఫెడరేషన్ నిత్యం అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఫెడరేషన్ నిరంతర పోరాటాలు చేస్తుందన్నారు. ఇందులో భాగంగా అర్హులైన జర్నలిస్టులందరికీ సొంత ఇంటి కల నెరవేర్చేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. అలాగే అక్రిటేషన్ల విషయంలో చోటు చేసుకున్న పరిణామాలపై ప్రభుత్వానికి పలు సందర్భాలలో నివేదికలు అందజేసి అర్హులైన వారికి అక్రిడేషన్లు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన 44 చట్టాలలో రెండు చట్టాలు జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించినవి కాగా వీటి విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా ఈనెల 9న రాష్ట్రవ్యాప్తంగా ఫెడరేషన్ లో కొనసాగుతున్న జర్నలిస్టులంతా ఐక్యంగా పోరాటాలు చేయనున్నట్లు చెప్పారు. జర్నలిస్టులు ఈ నిరసన కార్యక్రమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం అనకాపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులకు ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ బాండ్లను పంపిణీ చేశారు. జర్నలిస్టుల చిరకాల వాంఛ అయినా ఇళ్ల స్థలాలను సాధించుకునేందుకు సీనియర్ జర్నలిస్ట్ బి కొండలరావు నేతృత్వంలో హౌసింగ్ కమిటీని ఏర్పాటు చేశారు .అలాగే ఇటీవల జిల్లా కార్యవర్గానికి ఎన్నికైన ఫెడరేషన్ సభ్యులను ఘనంగా సత్కరించారు. తొలుత సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి ఈశ్వరరావును అనకాపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు శాలువాను కప్పి మెమొంటోను అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు బి.వెంకటేష్, కార్యదర్శి ఖాదర్, ఏపీ బీజే జిల్లా అధ్యక్షుడు ఎస్ కే చాంద్ భాషా, అనకాపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సిహెచ్ శశికుమార్, కార్యదర్శి పొలిమేర నాగ శ్రీనివాసరావు, ఉప కార్యదర్శి పెంటకోట సురేష్, కోశాధికారి మొల్లేటి గంగాధర్, ఫెడరేషన్ జిల్లా నాయకులు బి కొండలరావు, అజయ్, శేఖర్, కోరుబిల్లి గణేష్, నాగు తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టుల పిల్లలకు ఉచితంగా నోటు పుస్తకాలు
ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం
ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి
జర్నలిస్టుల కష్టాలు చూసే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం..రేపటి రామాంజనేయులు
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం.. కలెక్టర్ వినోద్ కుమార్
జర్నలిస్టులకు రావాల్సిన వాటి గురించి అసెంబ్లీలో ప్రస్తావిస్తా.. పల్లె సింధూర రెడ్డి
అనంతపురం జిల్లాలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక క్లబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, బాలాజీ సంస్థల చైర్మన్ పల్లె కిషోర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి రేపటి రామాంజనేయులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉరవకొండ హెచ్ఎంటీవీ రిపోర్టర్ కు కలెక్టర్, ఎమ్మెల్యే, జర్నలిస్టులు ఘనంగా నివాళులర్పించారు జిల్లాలో వివిధ ఛానళ్లలో పత్రికల్లో పని చేస్తున్న సుమారు 270 మంది జర్నలిస్టులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేశారు. ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే పిల్లలకు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, జిల్లా కలెక్టర్ ఈ పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి రేపటి రామాంజనేయులు మాట్లాడుతూ జిల్లాలో చాలామంది పేద జర్నలిస్టులు ఉన్నారని..ప్రతి సంవత్సరం వారి పిల్లల చదువులకు చాలా ఖర్చులు చేస్తుంటారన్నారు. ఇలాంటి జర్నలిస్టులకు ఎంతోకొంత సాయం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ పుస్తకాల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ దృష్టికి జర్నలిస్టుల సమస్యలు తీసుకెళ్లామని.. కచ్చితంగా వాటన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. జర్నలిస్టుల పిల్లలందరికీ ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఉచితంగా విద్య అందించాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇప్పటికే కలెక్టర్ సానుకూలంగా స్పందించారని జర్నలిస్ట్ రేపటి రామాంజనేయులు చెప్పారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తన తండ్రి కూడా ఒకప్పుడు జర్నలిస్టుగా పని చేశారని గుర్తు చేసుకున్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఎంతో మంచి కార్యక్రమం చేశారని ఆయన అభినందించారు. జర్నలిస్టుల సమస్యలను కచ్చితంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు తమ కుటుంబ సభ్యుల లాంటి వారిని వారి పిల్లల కోసం పుస్తకాలు ఇవ్వడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని.. ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రస్తావిస్తానని ఆమె హామీ ఇచ్చారు. మరోవైపు బాలాజీ, పివికేకే విద్యా సంస్థల చైర్మన్ పల్లె కిషోర్ రెడ్డి మాట్లాడుతూ తాను తొలిసారి ప్రెస్ క్లబ్ కు రావడం చాలా సంతోషంగా ఉందని..ఇది తన సొంత ఇంటికి వచ్చినట్టు ఉందన్నారు. ఇక్కడ ఉన్న వారంతా తమ కుటుంబంలో భాగమేనని జర్నలిస్టుల పిల్లలకు పుస్తకాలు ఇవ్వడం.. తమకు దక్కిన అదృష్టమని అన్నారు. భవిష్యత్తులో కూడా ఎలాంటి సాయం కావాలన్నా చేస్తామన్నారు. ఉరవకొండలో రోడ్డు ప్రమాదంలో మరణించిన జర్నలిస్టు కుమారుడి చదువు బాధ్యతలు తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు....
కెడిసిసి బ్యాంక్ సీఈఓ కు ఏపీడబ్ల్యూజేఎఫ్ శుభాకాంక్షలు
కెడిసిసి బ్యాంక్ సీఈఓ పి.రామాంజనేయులు గారు నూతన సీఈఓ గా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గోరంట్లప్ప, జిల్లా కన్వీనర్ నాగేంద్ర, ఫోటో గ్రాఫర్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు డి హుస్సేన్,ఏపీడబ్ల్యూజేఎఫ్ నగర గౌరవాద్యక్షులు శివకుమార్, నగర అధ్యక్షుడు శివ శంకర్, నగర ప్రధాన కార్యదర్శి ఎర్రమల,ఫోటో గ్రాఫర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వడ్డే శ్రీనివాసులు,ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు నర్సిరెడ్డి, లు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించి శాలువా తో శుభాకాంక్షలు తెలిపారు. బ్యాంక్ అభివృద్ధికి మంచి తోడ్పాటు అందించి వరుసగా రాష్ట్ర అవార్డులు సొంతం చేసుకున్నారని అలాంటి అభివృద్ధి సాధించిన ఘనత సీఈఓ రామాంజనేయులు గారికి సాధించారని తెలిపారు. రైతులకు,విద్యార్థులకు, జర్నలిస్టుల కు లోన్ హౌసింగ్ లోన్ లు,విద్యార్థులకు లోన్ అందించాలని కోరారు.
కర్నూలు జిల్లాకార్పోరేట్, పాఠశాలలో ఉచిత విద్యను అందించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా గారికి ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కన్వీనర్ నాగేంద్ర,నగర గౌరవాద్యక్షులు శివ కుమార్,నగర అధ్యక్షులు శివ శంకర్ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వడ్డే శ్రీనివాసులు కలెక్టర్ కార్యాలయంలో వినతిని అందించారు.ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ నాగేంద్ర, మాట్లాడుతూ జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించాలని గతేడాది కలెక్టర్ గారి ఆదేశాలతో 50 శాతం ఉచితంగా అందించారని తెలిపారు. సమాజంలో జర్మలిస్టుల పాత్రను గుర్తించి ఈ ఏడాది ఉచితంగా అందించాలని కనీసం 50 శాతాన్ని కల్పించాలని కోరారు.రాష్టంలో కృష్ణ,ఏలూరు,విశాఖపట్నం జిల్లాలో 50 శాతం రాయితీ అందించాలని ఆయా జిల్లా కలెక్టర్లు ఆదేశాలు ఇచ్చారని కర్నూలు జిల్లాలో కూడా అదే తరహాలో ఇచ్చేలా అదేశించగలరని కలెక్టర్ గారిని కోరామన్నారు.ప్రస్తుతం విద్య సంవత్సరం ప్రారంభం అయిందని అందుకు తగిన చర్యలు త్వరగా తీసుకోగలరని విజ్ఞప్తి చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా గారు మాట్లాడుతూ గతేడాది ప్రవేట్ స్కూల్ వాళ్ళు కోర్టుకు వెళ్లారని కేవలం కర్నూలు జిల్లాలో మాత్రమే ఇలా జరిగిందన్నారు. అయితే సాధ్యమైనంతవరకు జర్నలిస్టుల పిల్లలకు రాయితీ అందించేలా డిఇఓ తో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు కు అప్పన్న చందనం ప్రసాదం.
జర్నలిస్టుల పెండింగ్ సమస్యలపై 11 అంశాలు తో వినతి పత్రం.
సానుకూలంగా స్పందించారన్న గంట్ల
ఎన్ ఎ డి కొత్త రోడ్... జూన్ 16
విశాఖ నగర పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు సింహాచలం అప్పన్న చందన ప్రసాదాన్ని సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి,నావెల్ డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగంట్ల శ్రీనుబాబు అందజేశారు. ఈ మేరకు సోమవారం విశాఖ విమానాశ్రయంలో చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలుసుకొని అత్యంత మహిమాన్వితమైన చందన ప్రసాదం శ్రీనుబాబు అందజేయగా ముఖ్యమంత్రి వెంటనే కళ్ళకు అద్దుకొని దానిని స్వీకరించారు. అలాగే జర్నలిస్టులుకు సంబందించిన 11 పెండింగ్ సమస్యలపై ముఖ్యమంత్రి కి శ్రీనుబాబు వినతిపత్రం అందజేశారు. ఇళ్ల స్థలాల సమస్యతోపాటు ప్రధానమైన 11 అంశాలు ఈ వినతిపత్రంలో పొందుపరిచినట్లు శ్రీను బాబు ముఖ్య మంత్రి కి విపులంగా వివరించారు..వీటిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నట్లు శ్రీను బాబు తెలిపారు..
1980 దశకం వరకు బ్రాడ్‌కాస్ట్ మీడియాలో ప్రభుత్వ మీడియా మాత్రమే కొనసాగింది...
జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఏర్పడిన: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు గౌరవాధ్యక్షులుగా, వి యశోనాథ్, పి. శ్రీధర్ ఈశ్వర్, ఎస్ సౌజన్య, బివిఎల్ కె మనోహర్, వై. జోగిరెడ్డిలతో ఏర్పడిన సంఘం.
© APWJF All Rights Reserved.Design & Developed By