News

Home News

శ్రీకాకుళం జిల్లా

జర్నలిస్టుల సమస్యలన్నీ పరిష్కరించండి

జర్నలిస్టుల సమస్యలన్నీ పరిష్కరించండి
‘మీకోసం’లో జిల్లా కలెక్టర్‌కు ఏపీడబ్ల్యూజేఎఫ్‌ నేతల వినతి
శ్రీకాకుళం : రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు సదాశివుని కృష్ణ, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు టి.భీమారావు జిల్లా కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ను కోరారు. ఏపీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో వివిధ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని వారు సమర్పించారు. రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్‌ సౌకర్యం కల్పించాలని, నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే జర్నలిస్టు వృత్తిలో ఉన్నందున అందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలని, హెల్త్‌కార్డులు, ఆరోగ్య బీమా అందించాలని, మీడియ కమిషన్‌ ఏర్పాటు చేయాలని కోరారు. జర్నలిస్టులకు పెన్షన్‌ సౌకర్యం కల్పించాలని, జర్నలిస్టులకు సంబంధించిన అన్ని కమిటీలను పునరుద్ధరించాలని ఈ కమిటీలలో ఏపీడబ్ల్యూజేఎఫ్‌, ఏపీబీజేఏలకు స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మీడియా అకాడమీని, గవర్నింగ్‌ బాడీని ఏర్పాటు చేయాలన్నారు. జర్నలిస్టులకు ఉద్యోగభద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్మికబీమా జర్నలిస్టులకు వర్తింపజేయాలని కోరారు. రైళ్లలో రాయితీ కొనసాగించాలని, ఏసీ బస్సుల్లో రాయితీ కల్పించేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. సమాచారశాఖకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించి బలోపేతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి.నర్సింగరావు, ఉపాధ్యక్షుడు డి.నందికేశ్వరరావు, నరసన్నపేట నియోజకవర్గకమిటీ అధ్యక్షుడు కంగు మన్మథరావు, ఏపీబీజేఏ ఉపాధ్యక్షుడు ఎం.ప్రసాదరావు, జిల్లా ప్రతినిధులు శేఖర్‌, శివశంకర్‌, ఆర్‌.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

అనంతపురం జిల్లా

జర్నలిస్టులకు పెన్షన్, ఉద్యోగ భద్రత కల్పించండి.. APWJF డిమాండ్

అనంతపురం జిల్లా

జర్నలిస్టులకు పెన్షన్, ఉద్యోగ భద్రత కల్పించండి.. APWJF డిమాండ్

జర్నలిస్టుల డిమాండ్స్ డే సందర్భంగా APWJF కలెక్టర్ కు వినతి పత్రం

జర్నలిస్టుల సమస్యలను కలెక్టర్ కు వివరించిన APWJF నాయకులు

ఏపీలో వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కారించాలంటూ.. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేస్తోంది. జర్నలిస్టు డిమాండ్స్ డేను పురస్కరించుకుని.. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు రెండు జిల్లాల కలెక్టర్లను కలిసి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల్ని, వివరించారు.

అనంతపురంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు షఫీ, ప్రధాన కార్యదర్శి రేపటి రామాంజినేయులు ఆధ్వర్యంలో ఇన్ ఛార్జి కలెక్టర్ శివనారాయణ శర్మను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రేపటి రామాంజినేయులు మాట్లాడుతూ జర్నలిస్టుల ఆరోగ్యబీమా కొనసాగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై హర్షం వ్యక్తం చేశారు. అలాగే తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కారించాలన్నారు. జర్నలిస్టుల ఇంటిస్థలాల కేటాయింపుతో పాటు జర్నలిస్టుల ఉద్యోగ భద్రత,, ఇతర సదుపాయాలపై మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. బీహార్ తరహాలో మనరాష్ట్రంలోని జర్నలిస్టులకు 15వేల పెన్షన్ పథకాన్ని అమలు చేయడంతో పాటు సమాచార శాఖను బలోపేతం చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది పూర్తైనా ఇప్పటి వరకు అక్రిడిటేషన్లు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. 6వ తేదిన జరగబోయే క్యాబినెట్ సమావేశంలో ఈ అంశాలన్నింటినీ చర్చించి.. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు..

ఈ కార్యక్రమంలో APWJF నాయకులు జయప్రకాష్, డాక్టర్ సూర్య, వేణుగోపాల్, విజయ్ కుమార్, సుధాకర్, బన్సీలాల్, కేశవ, దాదాపీర్ , రాజారెడ్డి, పవన్, శింగనమల ప్రసాద్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

రాజమండ్రి

రాజమండ్రి APWJF టీమ్ కలెక్టర్ కార్యాలయం వద్ద...

పల్నాడు జిల్లా

కలెక్టర్ కు వినత పత్రం అందజేస్తున్న ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు

పల్నాడు జిల్లా కలెక్టర్ కు వినత పత్రం అందజేస్తున్న ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు

విశాఖపట్నం జిల్లా

కలెక్టరేట్ ఎదుట కదంతొక్కిన జర్నలిస్టులు
*ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ల ఫెడరేషన్ డిమాండ్స్ డేకు అనూహ్య స్పందన

కలెక్టరేట్ ఎదుట కదంతొక్కిన జర్నలిస్టులు

*ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ల ఫెడరేషన్ డిమాండ్స్ డేకు అనూహ్య స్పందన
*
14 డిమాండ్స్ తో కలెక్టర్ కు వినతిపత్రం సమర్పణ

..విశాఖపట్నం ఆగస్టు 4

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు విశాఖపట్నం జిల్లా ఫెడరేషన్ యూనిట్, ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్,ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్లు సోమవారం కలెక్టరేట్ ఎదుట డిమాండ్ల సాధనకై నినాదాలు చేస్తూ కదం తొక్కారు. 14 డిమాండ్లపై జర్నలిస్టులు నినాదాలు చేశారు,, శాంతి యుత నిరసన ప్రదర్శన అనంతరం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ఈనెల ఆరవ తేదీన జరుగనున్న మంత్రివర్గ సమావేశంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తీర్మానాలు చేసి ప్రభుత్వం ఆమోదించాలని కోరారు.ప్రధానంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు,అక్రిడేషన్లు,బీమా సదుపాయం,పింఛన్లు జారీ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ సమస్యలు గుర్తించి జర్నలిస్టు ల న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని అలా కాని పక్షంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని అన్నారు..ఇప్పటికే రాష్ట్ర మంత్రులకు జర్నలిస్టుల సమస్యలను విశాఖపట్నంలో వివరించామని శ్రీనుబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ విశాఖపట్నం జిల్లా యూనిట్ అధ్యక్షులు పోతుమహంతి నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఏసీ. బస్సుల్లో ప్రయాణించే సదుపాయం కల్పించాలని,ప్రమాద బీమా పథకం అమలు చేయాలని, సమాచార శాఖ అన్ని విధాలా జర్నలిస్టులకు సహకరించాలని కోరారు. జిల్లా కలెక్టర్ కు సమర్పించిన వినతి పత్రంలో ప్రధానంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, పింఛన్ సదుపాయం కల్పించాలని, రైల్వే పాసులు జారీ చేయాలని,జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని, అక్క్రిడేషన్ కమిటీల్లో జర్నలిస్టుల సంఘాలకు ప్రాతి నిధ్యం కల్పించాలని,జర్నలిస్టుల కోసం వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే ఎఫ్ జిల్లా కార్యదర్శి జి. శ్రీనివాస్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఏ. సాంబశివరావు,ఆర్గనైజింగ్
సెక్రెటరీ పిఎస్ ప్రసాద్, ఉపాధ్యక్షులు బండారు శివప్రసాద్ ఎన్ రామకృష్ణ వై.రామకృష్ణ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షులు ఈరోతి ఈశ్వరరావు, కార్యదర్శి మదన్, త్రినాథ్, నాయుడు, ఫెడరేషన్ సంయుక్త కార్యదర్శి నగేష్ బాబు,ఆనంద్,స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీ ఎస్ జగన్మోహన్,కోశాధికారి కేవీ శర్మ,సంయుక్త కార్యదర్శి బీ ప్రసాద్,కార్యనిర్వాహక సభ్యులు అరుణ్ భాస్కర్ (హరి),వీ గణేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Andhra Pradesh Working Journalists Federation (APWJF)

1980 దశకం వరకు బ్రాడ్‌కాస్ట్‌ మీడియాలో ప్రభుత్వ మీడియా మాత్రమే కొనసాగింది...

జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఏర్పడిన: ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు గౌరవాధ్యక్షులుగా, వి యశోనాథ్‌, పి. శ్రీధర్‌ ఈశ్వర్‌, ఎస్‌ సౌజన్య, బివిఎల్ కె మనోహర్‌, వై. జోగిరెడ్డిలతో ఏర్పడిన సంఘం.

Get In Touch

H. No. 40-15/1-30, SVBS Kamala,
B-1, First floor, Brundavan
colony, Labbipet,
Vijayawada - 10

generalsecretaryapwjf@gmail.com

+91 9866399883

© APWJF All Rights Reserved.Design & Developed By Gateway webs