డిడి సదాశివరావు సేవలు ప్రశంసనీయం
ఘనంగా సత్కరించిన వర్కింగ్ జర్నలిస్టులో ఫెడరేషన్
ప్రభుత్వ నిబంధనల మేరకు సంపూర్ణ సహకారం,*డిడి
కలెక్టరేట్ విశాఖపట్నం ఫిబ్రవరి 14
విశాఖ జిల్లా సమాచార..
పౌర సంబంధాలశాఖ డిప్యూటీ డైరెక్టర్ గా సేవలందిస్తున్న సదాశివరావు సేవలు ప్రశంసనీయమని
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు.. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు ( ఎన్ఏజే) లు
కొనియాడారు.. శనివారం డిపిఆర్ఓ కార్యాలయంలో సదాశివరావును పలువురు వర్కింగ్ జర్నలిస్టులతో కలిసి ఫెడరేషన్ నేతలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లాలో ఇప్పటికే జారీ చేసిన అక్రిడేషన్లు.. అలాగే ప్రస్తుతం జిల్లా అధికార యంత్రాంగం ద్వారా నిర్వహిస్తున్న వైద్య పరీక్షలు వంటి వివరాలను వీరు అడిగి తెలుసుకున్నారు.. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి పూర్తిస్థాయిలో సహకరించాలని డిడిని ఫెడరేషన్ నేతలు కోరారు.. ఈ సందర్భంగా డిడి సదాశివరావు మాట్లాడుతూ
తాను ఇప్పటికే ఎన్నో జిల్లాల్లో పనిచేయడం జరిగిందని అయితే ప్రభుత్వ నిబంధనల మేరకు తమ వంతు అన్ని విషయాల్లో సహకారం ఉంటుందన్నారు..
జిల్లాలో జర్నలిస్టులు సహకారం కూడా బాగుందని డిడి సదాశివరావు ఆకాంక్షించారు. ఈ ఈ సందర్భంగా డిడి సదాశివరావును ఘనంగా సత్కరించారు.. కార్యక్రమంలో
ఏపీఆర్ఓ కిషోర్..
ఫెడరేషన్ విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణ .. ప్రధానకార్యదర్శి జి. శ్రీనివాస రావు.., డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఏ. సాంబశివరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ డి. రవికుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.ఈశ్వరరావు, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు వెంకటేష్,కార్యదర్శి ఖాదర్, ఏపీబీజేఏ అధ్యక్షులు భాషా, విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు ఇ. ఈశ్వరరావు, కార్యదర్శి కె. మదన్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్, కార్యదర్శి శ్రీనివాస్
జర్నలిస్టుల అపరిస్కృత సమస్యల పరిష్కారానికే చలో విజయవాడ
ఉచిత విద్య.. వైద్యం . పెన్షన్
సదుపాయాలు కల్పించాల్సిందే
అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించండి
డాబా గార్డెన్స్ విశాఖపట్నం ఫిబ్రవరి 14
రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు సంబంధించిన అపరిస్కృత సమస్యలు పరిష్కారం కోసమే
చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
జి ఆంజనేయులు తెలిపారు.. శనివారం డాబాగార్డెన్స్ వైజాగ్ జర్నలిస్ట్ ఫోరమ్ ప్రెస్ క్లబ్ లో
ఏర్పాటుచేసిన పాత్రికేయులు సమావేశంలో ఆంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్న జర్నలిస్టుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదన్నారు.. గత రెండు ప్రభుత్వాల హయాంలో కూడా ఇళ్ల స్థలాలు.. ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు.. అలాగే జర్నలిస్టులు పిల్లలకు ఉచిత విద్యను అందించాలని జర్నలిస్టులకు ఉచిత వైద్యము అందించాలని కోరుతున్నామన్నారు.. ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు పెద్ద ఎత్తున భూములు.. రాయితీలు ఇస్తున్నందున తద్వారా జర్నలిస్టులకు వారి నుంచి విద్య వైద్యం విషయాల్లో సహాయం చేయాలి అన్నారు.. ఇతర రాష్ట్రాల్లో పెన్షన్ పథకం అమలవుతున్న ఆంధ్రప్రదేశ్లో అమలకు నోచుకోలేదన్నారు.. ఇప్పటికే కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి తదితర మంత్రులకు జర్నలిస్టుల సమస్యలపై వినతిపత్రాలు అందజేశామన్నారు.. చాలావరకు సుదీర్ఘకాలం నుంచి పరిష్కారం కావాల్సి ఉందన్నారు.. అందువల్ల మార్చి తొలి వారంలో చలో విజయవాడ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించి అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సభ నిర్వహిస్తామన్నారు . ఈ సభకు సమాచార పౌర సంబంధాల.. కార్మిక శాఖ మంత్రులను ఆహ్వానించడం జరుగుతుంది అన్నారు.. చలో విజయవాడ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభిస్తుందని అందులో భాగంగా ఉత్తరాంధ్రలో సన్నాహక సమావేశాలు నిర్వహించడం
పూర్తి చేసామన్నారు.. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి (ఎన్ఏజే) ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు.. విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణ లు మాట్లాడుతూ
శ్రీకాకుళం.. విజయనగరం పార్వతీపురం.. అల్లూరి. అనకాపల్లి . విశాఖ జిల్లాల్లో
నిర్వహించిన సమావేశాలు పూర్తిగా విజయవంతమైనట్లు చెప్పారు.. జర్నలిస్టుల సమస్యలు పరిష్కారమే తమ యూనియన్ ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు.. ఇటీవల విశాఖ జిల్లాలో నిర్వహించిన ఫెడరేషన్ సభ్యత్వ నమోదుకు విశేష స్పందన లభించింది అన్నారు.. అనంతరం ఆంజనేయులు.. గంట్ల శ్రీనుబాబు లను ఘనంగా సత్కరించారు
సమావేశంలో విశాఖ జిల్లా కార్యదర్శి జి. శ్రీనివాస్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఏ. సాంబశివరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ డి. రవికుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.ఈశ్వరరావు, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు వెంకటేష్,కార్యదర్శి ఖాదర్, ఏపీబీజేఏ అధ్యక్షులు భాషా, విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు ఇ. ఈశ్వరరావు, కార్యదర్శి కె. మదన్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్, కార్యదర్శి శ్రీనివాస్
తో పాటు పెద్ద ఎత్తున కార్యవర్గ సభ్యులు జర్నలిస్టులు పాల్గొన్నారు
జర్నలిస్టుల సంక్షేమానికి కృషి
సమస్యల పరిష్కారానికి చొరవ
చలో విణుకువార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
ఎపిడబ్ల్యుజెఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజనేయులు, శ్రీనుబాబు పిలుపు
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
అన్నవిష్టుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ కృషిచేస్తోందని, సమస్యల పరిష్కారానికి కూడా చొరవ చూపుతోందని ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆనేయులు, రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు అన్నారు. త్వరలో నిర్వహించనున్న చక్ర వియవాడ కార్యక్రమంలో ఆధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. పెడరేషన్ జిల్లా అధ్యక్షులు కెరమేష్ నాయుడు అధ్యక్షతన స్థానిక మయూర హోటల్లో గురువారం ముఖ్యకార్యవర్తం. సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లాలోని అన్ని ముండకాల్లో వివిధ పత్రికలు, చానళ్లకు చెందిన జర్మస్థులు హాజరయ్యారు. సమావేశం అనంతరం పత్రికా న నూవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వాటిని పరిష్కరించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (ఎ.పి. డబ్ల్యుజెఎఫ్) కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగా ఈనెలాఖరు లేదా మార్చి మొదటి వారంలో చలో విజయవాడ కార్యక్రము తలపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని జర్మనిస్టులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ముఖ్యంగా జర్నలిస్టులకు. ఇక్షస్థలాల రేటాయింపు సమస్య చాలాయేళ్లుగా అపరిష్కృతంగా ఉంది. ఎన్నికల సమయంలోనే జర్నలిస్టులకు ఇంటి స్థలం కేటాయిస్తామని ప్రణాళికలో ప్రకటించడంతో అందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారన్నారు. జర్మనిజం రక్షణ లేని వృత్తిగా మారిపోయిందని ఈనేపథ్యంలో భద్రత, పనిపరిస్థితులు, ఇతర సదుపాయాలు తదితర అంశాలన్నింటి పై అధ్యయనం చేసేందుకు మెరుగైన చర్యలు చేపట్టేందుకు వీలుగా ప్రభుత్వం మీడియా కమిషను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలోని దాదాపు 18 రాష్ట్రాల్లో జర్నవిస్టులకు ప్రభుత్వాలు పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నాయి. మన రాష్ట్రంలో జర్నలిస్టులకు పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని కోరాడు మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు తాత్కాలిక భరోసా కింద మూడేళ్ల పాటు నెలకు రూ.1000 చొప్పున చెల్లిస్తున్న ఆర్థిక సాయాన్ని రూ.5వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. అద్నవిస్థులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించాలని, ఆరోగ్యబీమా ద్వారా ప్రతి ఆరునెలల కొకసారి జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య పరీక్షల సదుపాయం కల్పించాలని కోరుతున్నాం. పిల్లలకు ఉచితంగా అన్ని పాఠశాలల్లో, కళాశాలల్లో చదువుకునే సదుపాయం కన్పించాలని కోరుతున్నామన్నారు. జర్నలిస్టులపై జరిగే దాడులను అరికట్టేందుకు వీలుగా రాష్ట్రంలో హటరీంశాఖ మంత్రి నేతృత్వంలో హైపవర్ కమిటీ, జిల్లాలో ఉన్నత పోలీసు అధికారులతో కూడిన కమిటీలు చేసేందుకు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఏర్పాటు చేయలేదని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం వర్కింగ్ జర్నలిస్టు వెల్ఫేర్ ఫండ్ కమిటీ తక్షణమే పునరుద్ధరించాలని, ఈ కమిటీల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం వర్కింగ్ జర్నలిస్టు వెల్ఫేర్ ఫండ్ రూ. 50కోట్లను కేటాయిం చాలని కోరుతున్నామన్నారు. మీడియా అకాడె మీరీ గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టుల అవార్డులు ప్రదానం చేయాలని, కార్మిక బీమా సదుపాయం వర్తింపజేయాలని, ఆరోగ్యబీమా పథకం అమలు తీరు తెన్సులపై జర్మనిస్టుల్లో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి చాలాయేక్ళుగా ఈ పధకం అమలవుతున్నా ప్రతియేటా రెన్యువల్ చేయడంలో చాలా జాప్యం జరుగుతోందని తెలిపారు ఈ పథకం అమలుపై వెంటనే సమీక్ష చేపట్టి న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. మురళి శంకర్రావు, జిల్లా కార్యదర్శి ఆర్ వ్యాసంబాబు, నాయకులు బూరాడ శ్రీనివాసరావు, ఎన్. ముద్దుసూదనరావు, విశాఖపట్నం జిల్లాకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముందు దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక సమ్మెలో భాగంగా స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి లోయర్ ట్యాంక్ బండ్ రోడ్డు వరకు జర్నలిస్టులంతా ప్రదర్శన నిర్వహించారు. కార్మికుల హక్కుల పరిరక్షించాలని, మీడియాస్ వచ్చిన కాపాడాలని నినాదాలు చేశారు.
దేశవ్యాప్తి సమ్మెలో భాగంగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గుంటూరు విజ్ఞాన మందిరం నుండి జిన్నాటవర్ మీదుగా ర్యాలీగా వేలాది మందితో జరిగిన కార్మిక ప్రదర్శన జరిగింది.ఈ ప్రదర్శన లో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షలు సాయికుమార్, ప్రధాన కార్యదర్శి మహేష్ తాడికొండ ప్రెసిడెంట్ శ్యామ్యూల్ బాబు తదితరులు పాలుగున్నారు.
బలమైన ప్రజాస్వామ్య దేశంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు, కర్షకులు, ప్రజాస్వామ్యవాదులు, జర్నలిస్టులహక్కు లను కాలరాసే కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ భాగస్వామిగా మారింది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెకు మద్దతుగా కడప కోటిరెడ్డి సర్కిల్ నుంచి ఏడు రోడ్ల కూడలివరకు జరిగిన ర్యాలీలో సిఐటియు,ఏఐటీయూసీ లతోపాటు వివిధ కార్మిక సంఘాలు ప్రజా సంఘాలకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ప్రతినిధి చంద్రమోహన్ రాజు మాట్లాడుతూ ఎన్డీఏ ఆధ్వర్యంలో మోడీ ప్రభుత్వం దేశంలోని అన్ని వర్గాలను తమ చెప్పు చేతుల్లో ఉంచుకొని నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు. ఎన్నో పోరాటాలు ఆత్మబలిదానాలతో సాధించుకున్న ఎన్నో చట్టాలను రద్దుచేసి కార్మికుల హక్కులను కాలరాస్తుందని విమర్శించారు. నీలం కోసే విధానాలు నియంతృత్వ ధోరణలతో ప్రజలు కార్మికులు, జర్నలిస్టులు, వివిధ వర్గాల ప్రజల, ఉద్యమకారులను నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తోందని విమర్శించారు. కార్మికులను బానిసలుగా చేసి కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చే విధానాలను అమలు చేస్తున్నారని విమర్శించారు. దేశంలోని 40 కోట్ల మంది కార్మికుల కుటుంబాలు రోడ్లపాలయ్యేలా కేంద్రం కొత్త చట్టాలను తీసుకొస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగే వ్యవహరిస్తే బలమైన పోరాటం ద్వారా ప్రజా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్లను రద్దుచేసి ఎందరో త్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను తిరిగి పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన కోడ్ లు అమలులోకి వస్తే జర్నలిస్టులు, పత్రికా స్వేచ్ఛకు కూడా ప్రమాదంలో పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రతినిధులు నూర్ భాషా సిద్దయ్య రాజు, శ్రీనివాసులు రెడ్డి, సూరిబాబు, సతీష్ కుమార్, సత్యమయ్య , దుర్గాప్రసాద్, రవికుమార్, రాజేష్, తదితరులతో పాటు వివిధ సంఘాల నేతలు.... ప్రతినిధులు పాల్గొన్నారు.
1980 దశకం వరకు బ్రాడ్‌కాస్ట్ మీడియాలో ప్రభుత్వ మీడియా మాత్రమే కొనసాగింది...
జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఏర్పడిన: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు గౌరవాధ్యక్షులుగా, వి యశోనాథ్, పి. శ్రీధర్ ఈశ్వర్, ఎస్ సౌజన్య, బివిఎల్ కె మనోహర్, వై. జోగిరెడ్డిలతో ఏర్పడిన సంఘం.
© APWJF All Rights Reserved.Design & Developed By