News

Home News

చిత్తూరు జిల్లా

ముఖ్యమంత్రి చేతుల మీదగా ఫెడరేషన్ డైరీ ఆవిష్కరణ....

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ లిస్టు ఫెడరేషన్ 2026 డైరీ ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరణ... అలాగే త్వరలో జరగబోవు ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర మహాసభలకు గౌరవ అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తున్న
ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు రాష్ట్ర నాయకులు జయరాజ్ చంద్రమోహన్ రాజు, చిత్తూరు జిల్లా నేతలు బి ప్రకాష్ చల్లా జై చంద్ర మంజునాథ్ మహేష్ ఉదయ్ కుమార్ తదితరులు.

విశాఖపట్నం జిల్లా

అర్హులైన వారందరికీ అక్రిడేషన్లు మంజూరు చేయాల్సిందే
వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమమే ఫెడరేషన్ లక్ష్యం

అర్హులైన వారందరికీ అక్రిడేషన్లు మంజూరు చేయాల్సిందే

వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమమే ఫెడరేషన్ లక్ష్యం

నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా ప్రారంభం

వారం రోజులు పాటు ప్రత్యేకంగానిర్వహణ

విశాఖపట్నం . జనవరి 28

రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ నిరంతరం కృషి చేస్తుందని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి
(ఎన్ ఎ జె). గంట్ల శ్రీనుబాబు..విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణలు తెలిపారు.. బుధవారం విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఏపీ ఎన్జీవో హోం లో 2026 వార్షిక సంవత్సరానికి సంబంధించిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని
గంట్ల శ్రీనుబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ నూతన సభ్యత్వాలు.. రెన్యువల్సు ప్రక్రియను వారం రోజులు పాటు నిర్వహిస్తామన్నారు. గత ఏడాది 600 మంది జర్నలిస్టులు తమ యూనియన్ లో సభ్యులుగా చేరినట్లు వీరు చెప్పారు.. కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల నిబంధన ల మేరకు ఫెడరేషన్.. బ్రాడ్ కాస్ట్.. స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ల జర్నలిస్టులకు తమ యూనియన్ ద్వారా చేయూతను అందిస్తామన్నారు.. ఈ ఏడాది అర్హులైనవారందరికీ అక్రిడేషన్లు జారీ చేయాలని,, ఇళ్ల స్థలాలు
వెంటనే మంజూరు చేయాలని, ఇతర రాష్ట్రాలు మాదిరిగా సీనియర్ జర్నలిస్టులకు పింఛన్ పథకం అమలు చేయాలని,, ప్రమాద బీమా పునరుద్ధరణ.. హెల్త్ ఇన్సూరెన్స్ తో పాటు వాటి అమలకు వివిధ కమిటీలను కూడా తక్షణమే నియమించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు.
జర్నలిస్టుల సంక్షేమంతో పాటు అన్ని రకాల పండుగల నిర్వహణ..
అలాగే వన సమారాధన.. విద్యా వైద్యానికి కూడా తమ పరిధి మేరకు కృషి చేస్తున్నట్లు వీరు చెప్పారు. యూనియన్ ద్వారా వర్కింగ్ జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ చేయించే అవకాశాన్ని పరిశీలిస్తున్నామన్నారు... ప్రతి ఒక్క సభ్యుడు యూనియన్ నియమిబంధనలు పాటించాలని.. అలా కాకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకుంటే ఎనిమిది మందితో కూడిన క్రమశిక్షణ సంఘం కు సిఫార్సు చేయడం జరుగుతుంది అన్నారు..
అనంతరం నూతన.. రెన్యువల్స్ కార్డులను సభ్యులకు వీరి చేతుల మీదుగా అందజేశారు..

ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ విశాఖ జిల్లాకార్యదర్శి జి. శ్రీనివాస రావు ..ఏపీబీజేఏ అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు, కార్యదర్శి కింతాడ మదన్, ఫెడరేషన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎ. సాంబశివరావు, ఉపాధ్యక్షులు బి. శివప్రసాద్, జాయింట్ సెక్రటరీ లు నగేష్, శ్రీనివాసనాయుడు, కిషోర్, మధురవాడ ఆనంద్,స్మాల్ పేపర్స్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు బొబ్బర ప్రసాద్, కె. వి. శర్మ,చక్రి తదితరులు పాల్గొన్నారు..

విశాఖపట్నం జిల్లా

ఫెడరేషన్ రాష్ట్ర డైరీ ఆవిష్కరణ
11 నుంచి జర్నలిస్టులకు ఆరోగ్య పరీక్షలు

వర్కింగ్ జర్నలిస్టుల సేవలు ప్రశంసనీయం

ఫెడరేషన్ రాష్ట్ర డైరీ ఆవిష్కరణ

11 నుంచి జర్నలిస్టులకు ఆరోగ్య పరీక్షలు

జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్


కలెక్టర్ కార్యాలయం... విశాఖపట్నం ఫిబ్రవరి 6

జిల్లా అభివృద్ధిలో వర్కింగ్ జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని వారి సేవలు అభినందనీయమని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కొనియాడారు.. శుక్రవారం ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ 2026 వార్షిక డైరీని కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.... ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జర్నలిస్టులతోనే సమాజ ప్రగతి సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరు కూడా సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.. అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రిడేషన్ లు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే 11 నుంచి జర్నలిస్టులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.. డాల్ఫిన్ డయాగ్నసిస్ ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించి కేజీహెచ్ లో అత్యుత్తమ వైద్యులు జర్నలిస్టులకు తమ సేవలు అందించడం జరుగుతుంది అన్నారు.. కావున జిల్లాలో జర్నలిస్టులు అందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు..
జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి( ఎన్ఏజే) ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు.. విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణ లు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తున్నామన్నారు.. కేంద్ర . రాష్ట్ర ప్రభుత్వాలకు ఎప్పటికప్పుడు జర్నలిస్టులు సమస్యలను తెలియజేసి పరిష్కారానికి తమ యూనియన్ల ద్వారా కృషి చేయడం జరుగుతుంది అన్నారు .. గత నెల 28 నుంచి యూనియన్ ద్వారా నిర్వహిస్తున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం సోమవారంతో ముగు స్తుంది అన్నారు.m
ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాసరావు.. ఆర్గనైజింగ్ సెక్రటరీలు డి రవికుమార్.. పిఎస్ ప్రసాద్. ఉపాధ్యక్షులు బండారు శివప్రసాద్ పి నగేష్ బాబు.. టి .కృష్ణమూర్తి నాయుడు.. భాగ్యరాజు..
, బ్రాడ్ కాస్ట్ జిల్లా అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు, కార్యదర్శి కింతాడ మదన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మళ్ళదేవ త్రినాధ్
స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీ ఎస్ జగన్మోహన్ , ఉపాధ్యక్షులు డి చక్రపాణి, కొణతాల శ్రీనివాస్, కోశాధికారి కేవి శర్మ, జాయింట్ సెక్రటరీ రాజశేఖర్, కార్యవర్గ సభ్యుడు అరుణ్ భాస్కర్ (హరి), సభ్యుడు ఎం హరనాథ్. పెద్ద ఎత్తున జర్నలిస్టులు పాల్గొన్నారు.
తొలుత గంట్ల శ్రీనుబాబు జిల్లా కలెక్టర్ ను ఘనంగా సత్కరించారు..

అల్లూరి సీతారామరాజు జిల్లా

జర్నలిస్టుల సమస్యల పరిస్కారానికి.......

జర్నలిస్టుల సమస్యల పరిస్కారానికి, రాష్ట్ర ప్రభుత్వంపై ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సేస్సన్స్ లో వత్తిడి తీసుకొని రావడానికి ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు స్పష్టం చేశారు. శుక్రవారం పాడేరులో అల్లూరి సీతారామరాజు జిల్లా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్ష కార్యదర్శులు పీ.డీ.చక్రవర్తి, షేక్ రహీమ్ తుల్లా ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల సాధన కోసం విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని, ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లి సమాచార శాఖ, కార్మిక శాఖా మంత్రికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. దీర్ఘకాలంగా ఆచరణకు నోచుకోని ఇళ్ల స్థలాలు, అర్హులైన వారికి అక్రిడేషన్లు, జర్నలిస్టులకు ఆరోగ్య బీమా, మీడియా కమిషన్ ఏర్పాటు, జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం తదితర డిమాండ్స్ తో కార్యక్రమం ఉంటుందని జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.ఈశ్వరరావు, విశాఖ సిటీ ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ విశాఖ సిటీ అధ్యక్షులు ఈరోతి ఈశ్వరరావు, కార్యదర్శి కె.మదన్, పాడేరు, అరకు నియోజకవర్గాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి జిల్లా

జర్నలిస్టుల ఛలో విజయవాడ జయప్రధం చేయండి
ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు ....

జర్నలిస్టుల ఛలో విజయవాడ జయప్రధం చేయండి

ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు

అనకాపల్లి : అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వాటిని పరిష్కరించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (ఎ.పి.డబ్ల్యు.జె.ఎఫ్) చలో విజయవాడ కార్యక్రమం తలపెట్టిందని,  రాష్ట్రంలోని జర్నలిస్టులందరూ పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు కోరారు. శుక్రవారం అనకాపల్లి సీపీఎం కార్యాలయం సమావేశ మందిరంలో జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. జిల్లాలోని జర్నలిస్టులను సంఘటితం చేసి చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం చేసేందుకు అన్ని జిల్లాల్లో ఫెడరేషన్ నాయకులు పర్యటిస్తున్నారని,  అందులో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లాల్లో  పర్యటించడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలోని జర్నలిస్టులకు  మూడు సెంట్లు చొప్పున కేటాయిస్తామని గత ప్రభుత్వం జీవో జారీ చేసి దరఖాస్తులను స్వీకరించిందని, వారికి స్థలాల కేటాయింపు చేయడంతో పాటు అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్లస్థలాలు కేటాయించేందుకు వీలుగా ప్రభుత్వం తగిన ఉత్తర్వులు జారీ చేయాలని, ఇళ్లు కట్టుకునేందుకు తగిన ఆర్థిక సహాయం అందించాలని అన్నారు.రాష్ట్రంలోని జర్నలిస్టుల ఇళ్లస్థలాల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తక్షణం తగిన చర్యలు తీసుకోవాలని  ఫెడరేషన్ డిమాండ్ చేస్తుందని అన్నారు.‌ అలాగే మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, మారిన పరిస్థితుల్లో జర్నలిజం వృత్తి ప్రమాదంలో పడిందని,  జర్నలిస్టుకు రక్షణ కొరవడిందని,  రక్షణ లేని వృత్తిగా జర్నలిజం ప్రపంచదేశాల్లో 149వ స్థానంలో ఉందని అన్నారు. భద్రత, పని పరిస్థితులు, ఇతర సదుపాయాలు తదితర అంశాలన్నింటిపై అధ్యయనం చేసేందుకు మెరుగైన చర్యలు చేపట్టేందుకు వీలుగా ప్రభుత్వం మీడియా కమిషన్ను ఏర్పాటు చేయాలని అన్నారు.  అలాగే దేశంలోని దాదాపు 18 రాష్ట్రాల్లో జర్నలిస్టులకు ప్రభుత్వాలు పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నాయని,  మనరాష్ట్రంలో జర్నలిస్టులకు వాటన్నిటి కన్నా మెరుగైన పెన్షన్ పథకాన్ని అమలు చేసేందుకు గల అవకాశాలను పరిశీలించేందుకు వీలుగా ఒక కమిటీని నియమించాలని కోరారు.ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ ఆధ్వర్యంలో వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమ నిధి ఉందని, మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు తాత్కాలిక భరోసా కల్పించేందుకు మూడేళ్ల పాటు నెలకు వెయ్యి రూపాయలు పెన్షన్ గా ఇచ్చే ఏర్పాటు ఉందని, ఆ మొత్తాన్ని ఐదువేల రూపాయలకు పెంచే ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయని అన్నారు.‌ జర్నలిస్టులపై జరిగే దాడులను అరికట్టేందుకు వీలుగా రాష్ట్రంలో హెూంశాఖ మంత్రి నేతృత్వంలో హైపవర్ కమిటీ, జిల్లాలో ఉన్నత పోలీసు అధికారులతో కూడిన కమిటీలు వేసేందుకు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కమిటీలు లేవని అన్నారు. కార్మిక శాఖ పరిధిలో అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు కల్పిస్తున్న బీమా పథకం జర్నలిస్టులకు వర్తింపజేసేందుకు వీలుగా కార్మిక శాఖ కమిషనర్ ప్రతిపాదనలు పంపారని,  చాలాకాలంగా పెండింగ్లో ఉన్న ఈ అంశంపై ప్రభుత్వం సానుకూలమైన నిర్ణయం తీసుకుని జర్నలిస్టులకు బీమా సదుపాయం కల్పించాలని కోరారు. ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు బి. వెంకటేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. ఈశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఖాదర్, విశాఖ సిటీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఏపీబీజేఏ విశాఖ సిటీ అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు, కార్యదర్శి మదన్, అనకాపల్లి పాత్రికేయులు పాల్గొన్నారు.

Andhra Pradesh Working Journalists Federation (APWJF)

1980 దశకం వరకు బ్రాడ్‌కాస్ట్‌ మీడియాలో ప్రభుత్వ మీడియా మాత్రమే కొనసాగింది...

జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఏర్పడిన: ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు గౌరవాధ్యక్షులుగా, వి యశోనాథ్‌, పి. శ్రీధర్‌ ఈశ్వర్‌, ఎస్‌ సౌజన్య, బివిఎల్ కె మనోహర్‌, వై. జోగిరెడ్డిలతో ఏర్పడిన సంఘం.

Get In Touch

H. No. 40-15/1-30, SVBS Kamala,
B-1, First floor, Brundavan
colony, Labbipet,
Vijayawada - 10

generalsecretaryapwjf@gmail.com

+91 9866399883

© APWJF All Rights Reserved.Design & Developed By Gateway webs