News

Home News

అనకాపల్లి జిల్లా

అనకాపల్లి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ డైరీ ఆవిష్�

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజెఎఫ్) డైరీ ని బుధవారం జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు బి. వెంకటేష్, అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు బి. ఈశ్వరరావు, బి. కొండలరావు, పి. నాగ శ్రీను, వై. నాగు, అమీద్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం జిల్లా

అసెంబ్లీ సమయంలో మరోసారి జర్నలిస్టుల సమస్యలపై వినతులు చిన్న మధ్యతరహా పత్రికలకు సంపూర్ణ సహకార

అసెంబ్లీ సమయంలో మరోసారి జర్నలిస్టుల సమస్యలపై వినతులు

చిన్న మధ్యతరహా పత్రికలకు
సంపూర్ణ సహకారం

ఫెడరేషన్ సభ్యత్వానికి విశేష స్పందన

కలక్టర్...జేసీ దృష్టి కి సమస్యలు

(కలెక్టర్ కార్యాలయం.) విశాఖపట్నం.. ఫిబ్రవరి 11

రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ అసెంబ్లీ సమయాల్లో మరోసారి వినతి పత్రాలు అందజేయనున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి (ఎన్ఏజే) ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణ లు తెలిపారు.. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఏపీఎన్జీవో హోం లో సభ్యత్వ నమోదు. రెన్యువల్స్ తో పాటు
స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు.. సంఘము అధ్యక్షులు జగన్ మోహన్.. కార్యదర్శి
కే శ్రీనివాసరావు నేతృత్వంలో జరిగిన సమావేశంలో చిన్న మధ్యతరహా పత్రికలకు సంబంధించిన అనేక అంశాలపై వీరు చర్చించారు.. ఈ సమావేశంలో పాల్గొన్న గంట్ల శ్రీనుబాబు. నారాయణలు మాట్లాడుతూ 11 డిమాండ్లపై ఇప్పటికే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ లకు వినతి పత్రాలు సమర్పించామన్నారు.. అయితే అందులో ఇళ్ల స్థలాలు.. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రమాద బీమా వంటి.
సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరడం జరుగుతుంది అన్నారు.. చిన్న మధ్య తరహా పత్రికలకు ఫెడరేషన్ సంపూర్ణ సహకారం అందిస్తుంది అన్నారు.. అక్రిడేషన్ ల విషయంలో కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలని కోరుతున్నామన్నారు.. విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ళ విద్యాధరి దృష్టికి స్థానిక జర్నలిస్టుల సమస్యలను పలు సందర్భాల్లో ప్రస్తావించమన్నారు.
వారు సానుకూలంగా స్పందించి నేటి నుంచి జర్నలిస్టులకు ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహించేందుకు తగిన ఆదేశాలు జారీ చేశారన్నారు.. కావున జర్నలిస్టు మిత్రులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని వీరు పిలుపునిచ్చారు....

సభ్యత్వ నమోదుకు విశేష స్పందన

ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ నిర్వహిస్తున్న సభ్యత్వ నమోదు.. రెన్యువల్సుకు విశేష స్పందన లభించింది అన్నారు. చివర రోజు సోమవారం మరో వంద మంది జర్నలిస్టులు తమ సభ్యత్వాన్ని నమోదు చేయించుకున్నట్లు వీరు చెప్పారు.. విశాఖ జిల్లా నుంచి సుమారు 600 మంది జర్నలిస్టులు ఫెడరేషన్.. బ్రాడ్ కాస్ట్ ..స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ల లో సభ్యులుగా చేరినట్లు వీరు వివరించారు..ఈ సమావేశము లో ఫెడరేషన్ విశాఖ జిల్లా కార్యదర్శి జి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు శివప్రసాద్,జాయింట్ సెక్రెటరీ కోస్తా మిర్రర్ ప్రసాద్, బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ ఈరోతి ఈశ్వరరావు, కార్యదర్శి మదన్, జాయింట్ సెక్రెటరీ త్రినాథ్, స్మాల్ పేపర్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్, కార్యదర్శి కె ..శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీ బొబ్బర్ ప్రసాద్, రాజశేఖర్ జగన్,హరి,

విశాఖపట్నం జిల్లా

వర్కింగ్ జర్నలిస్టులకు వారం రోజుల్లో ఆరోగ్య పరీక్షలు ,,,,,,,
ఫెడరేషన్ నేతలతో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ....

వర్కింగ్ జర్నలిస్టులకు వారం రోజుల్లో ఆరోగ్య పరీక్షలు

బస్సు పాసులు రెన్యువల్ కు
ఆదేశాలు

అర్హులందరికీ అక్రిడేషన్లు

న్ ఫెడరేషన్ నేతలతో
జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్

విశాఖపట్నం..(కలెక్టర్ కార్యాలయం) ఫిబ్రవరి 2

విశాఖ జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులకు వారం రోజుల్లో ఆరోగ్య పరీక్షలు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు
సోమవారం జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి (ఎఏ జె )ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు ఆధ్వర్యంలో పలువురు జర్నలిస్టులు జిల్లా కలెక్టర్ ను ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో కలిసి పలు అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.. ఇటీవల కాలంలో పలువురు జర్నలిస్టులు ఖరీదైన వైద్య పరీక్షలు చేయించుకోలేకపోతున్నారని అలాగే మెరుగైన వైద్యం పొందలేకపోతున్నారని కలెక్టర్ కు వీరు వివరించారు ..దీంతో కలెక్టర్ సానుకూలంగా స్పందించి వారం రోజుల్లోనే జర్నలిస్టులకు ఆరోగ్య పరీక్షలు ప్రారంభించే విధంగా ఆదేశాలు జారీ చేశామన్నారు. అలాగే జర్నలిస్టుల బస్సు పాసుల గడువు ముగిసిన నేపథ్యంలో కొత్త అక్రిడేషన్లు జారీ అయ్యే వరకు మరో నెల రోజులు పాటు బస్సు పాసులు రెన్యువల్ కు ఆర్టీసీ అధికారులకు లేఖ రాయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. అలాగే అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రిడేషన్లు జారీ చేస్తామని కలెక్టర్ చెప్పారు.. కార్యక్రమంలో విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణ. ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాసరావు బ్రాడ్ కాస్ట్ కార్యదర్శి కింతాడ మదన్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ప్రతినిధులు చక్రి ..సంజీవ్.. రాజశేఖర్.
జి.. జగన్ తదితరులంతా పాల్గొన్నారు

కాకినాడ జిల్లా

ఏపీడబ్ల్యూజేఎఫ్ మీడియా డైరీని ఆవిష్కరించిన కాకినాడ జిల్లా ఎస్పీ

ఏపీడబ్ల్యూజేఎఫ్ మీడియా డైరీని ఆవిష్కరించిన కాకినాడ జిల్లా ఎస్పీ

కాకినాడ, ఫిబ్రవరి 7:

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) ప్రముఖంగా ముద్రించిన మీడియా డైరీని కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆవిష్కరించారు. ఫెడరేషన్ జిల్లా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఎస్పీ ఛాంబర్ లో శనివారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమాలను జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వాతాడ నవీన్ రాజ్, ముమ్మిడి లక్ష్మణ్ లు ఎస్పీకి వివరించారు.జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం కీలకంగా పోరాడుతున్న సంఘంగా రాష్ట్రవ్యాప్తంగా సంఘం గుర్తింపు పొందిందని తెలిపారు. జర్నలిస్టుల సమస్యలపైనే కాకుండా సంక్షేమానికి ఫెడరేషన్ విశేషంగా కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఆయనకు వివరించారు. ఆపదలో ఉన్న జర్నలిస్టులను ఆదుకోవడం కోసం నిరంతరం పనిచేస్తున్నామని చెప్పారు. ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫెడరేషన్ ఆధ్వర్యంలో విన్నవిస్తుండగా పోలీసు శాఖ తీసుకుంటున్న చొరవ అభినందనీయమని ఈ సందర్భంగా వారు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అందరికీ ఉపయోగపడే సమాచారంతో డైరీని తీసుకొచ్చి జర్నలిస్టులందరికి అందజేయడం శుభ పరిణామమని ఎస్పి ఫెడరేషన్ జిల్లా కమిటీ సభ్యులకు తెలిపారు. ఎస్ బి డిఎస్పి కేవివి సత్యనారాయణకు కూడా డైరీను అందజేశారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ నాయకులు ఎండి అధికార్, మీడియా సెక్రెటరీ పుర్రె శ్రీనాథ్, జిల్లా నాయకులు డి. శ్రీధర్, కే. సత్య, ప్రవీణ్, దొరబాబు తదితరులు పాల్గొన్నారు

భీమిలి/ ఆనందపురం [విశాఖ ]

వర్కింగ్ జర్నలిస్టుల సభ్యత్వ నమోదుకు విశేష స్పందన ........
గ్రామీణ ప్రాంతాల్లో పాత్రికేయులకు అండగా ఉంటాం .....

గ్రామీణ ప్రాంతాల్లో పాత్రికేయులకు అండగా ఉంటాం

వర్కింగ్ జర్నలిస్టుల సభ్యత్వ నమోదుకు విశేష స్పందన

500 మందికి పైగా రిజిస్ట్రేషన్

నేటితో గడువు ముగింపు

భీమిలి/ ఆనందపురం

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్.. బ్రాడ్ కాస్ట్.. స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ల విశాఖ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సభ్యత్వ నమోదుకు విశేష స్పందన లభించినట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి (ఎన్ఏజే) ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు.. విశాఖ జిల్లా అధ్యక్ష.. కార్యదర్శులు పి నారాయణ
జి శ్రీనివాసరావులు తెలిపారు.. ఆదివారం భీమిలి.. ఆనందపురం ప్రాంతాల్లో ఫెడరేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా సాగింది. ఈ సందర్భంగా పాత్రికేయులను ఉద్దేశించి వీరు మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులు తప్పనిసరిగా సభ్యత్వ నమోదు కలిగి ఉండాలన్నారు.. దీనివల్ల కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులకు అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరాలు తెలియజేయడంతో పాటు పరిధి మేరకు వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది అన్నారు.
నగరంతో పాటు గ్రామీణ ప్రాంత జర్నలిస్టులు కూడా ఎన్నో వ్యయ.. ప్రయాసలు కోర్చి నిరంతరం సమాజం కోసం పాటుపడుతున్నారని వారికి తమ యూనియన్లు అండగా ఉంటాయన్నారు.. విద్యా.. వైద్యం తో పాటు జర్నలిస్టుల అక్రిడేషన్లు.. ఇళ్ల స్థలాలు. హెల్త్ ఇన్సూరెన్స్.. ప్రమాద బీమా.. పెన్షన్ పథకం వంటి సదుపాయాలు కల్పించేందుకు ఆయా యూనియన్ లు దోహదం చేస్తాయన్నారు..ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాస రావు,బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్ విశాఖ అధ్యక్షులు
ఈరోతి ఈశ్వరరావు, కార్యదర్శి కింతాడ మదన్ మధురవాడ ఆనంద్, భీమిలి నాయకులు కే.మోహన్ రావు, సుత్తి శ్రీనివాసరావు గణపతి రావు, శివాజీ, రోజా, లక్ష్మి.. ఆనందపురం ప్రాంత జర్నలిస్టులు యూనియన్ అధ్యక్షులు డబ్బీర్ విజయ్ కుమార్,దొంతలా శ్రీను తదితరులంతా పాల్గొన్నారు

Andhra Pradesh Working Journalists Federation (APWJF)

1980 దశకం వరకు బ్రాడ్‌కాస్ట్‌ మీడియాలో ప్రభుత్వ మీడియా మాత్రమే కొనసాగింది...

జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఏర్పడిన: ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు గౌరవాధ్యక్షులుగా, వి యశోనాథ్‌, పి. శ్రీధర్‌ ఈశ్వర్‌, ఎస్‌ సౌజన్య, బివిఎల్ కె మనోహర్‌, వై. జోగిరెడ్డిలతో ఏర్పడిన సంఘం.

Get In Touch

H. No. 40-15/1-30, SVBS Kamala,
B-1, First floor, Brundavan
colony, Labbipet,
Vijayawada - 10

generalsecretaryapwjf@gmail.com

+91 9866399883

© APWJF All Rights Reserved.Design & Developed By Gateway webs