తెనాలిలో సమ్మె విజయవంతం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లును రద్దు చేయాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. కార్మిక, కర్షక, ఉద్యోగ సంఘాలు మద్దతుతో పాటు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫిడరేషన్ తెనాలి డివిజన్ కూడా
సిఐటియు కు మద్దతుగా నిలిచింది. స్థానిక మున్సిపల్ మార్కెట్ పురవేదిక నుంచి గాంధీ చౌక్, బోస్ రోడ్డు మీదుగా చినరావూరు పార్క్ వరకూ నిర్వహించిన ర్యాలీ ప్రదర్శనలో పాల్గునడం జరిగింది. గౌరవ ఫెడరేషన్ రాష్ట్ర కాయకత్వం ఇచ్చిన పిలుపుమేరకు సమ్మె విజయవంతంగా ముగిసింది. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కొల్లిపర బాబు ప్రసాద్ మాట్లాడారు. కార్మిక సంఘాలు ఎదుర్కొంటున్న సమస్యలు, బ్యాంకు ఉద్యోగులపై పనిభారం, అంగన్వాడీ, ఆశ, ముఠా, విద్యుత్ కార్మికుల సమస్యలను పరిష్కారించాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెనాలి ఫెడరేషన్ నాయకులు, సభ్యులు పాల్గున్నారు.
చలో విజయవాడ ను;జయప్రదం చేయండి
ప్రభుత్వం దృష్టికి జర్నలిస్టుల సమస్యలు
ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు
(శ్రీకాకుళం సిటీ)
రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు త్వరలో ఛలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు పేర్కొన్నారు. ఛలో విజయవాడ కార్యక్రమం విజయవంతం చేసేందుకు సన్నాహక సమావేశాలు మాట్లాడుతూ దేశంలో పలు రాష్ట్రాల్లో జర్నలిస్టులకు పింఛనుశ్రీకాకుళం నుంచే శ్రీకారం చుట్టామని ఆయన తెలిపారు. నగరంలో స్థానిక ఎన్జీవో హÃంలో బుధవారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆంజనేయులు సౌకర్యం ఉందని, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆ అవకాశం కల్పించాలన్నారు. జర్నలిస్టులకు రక్షణకు మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. జర్నలిస్టులకు, వారి కుటుంబసభ్యులకు ఉచిత వైద్య పరీక్షలు సదుపాయం కల్పించాలన్నారు. జర్నలిస్టుల పిల్లలకు అన్ని పాఠశాలల్లో, కళాశాలల్లో ఉచిత విద్య కల్పించాలని కోరారు. వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమానికి 50 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు కమిటీల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జర్నలిస్టులకు అవార్డులు అందించడంతోపాటు వారికి బీమా సౌకర్యం కల్పించాలన్నారు. జర్నలిస్టులకు వద్ధాశ్రమం ఏర్పాటు చేయాలని కోరారు. జాతీయ జర్నలిస్టుల సంఘం ( ఎన్ ఎ జె)కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలపై సుదీర్ఘకాలంగా తమ సంఘం పోరాడుతుందని జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సంఘం పనిచేస్తుందన్నారు. అన్ని జిల్లాల్లో జర్నలిస్టులు సమష్టిగా పనిచేస్తూ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొంక్యాన వేణుగోపాల్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఛలో విజయవాడ కార్యక్రమాన్ని తలపెట్టడం శ్రీకాకుళం నుంచే శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. రెండు దశాబ్దాలుగా జర్నలిస్టుల హక్కుల సాధన కోసం సంఘం పనిచేస్తుందని గతంలో కూడా ఛలో విజయవాడ, సమావేశాలకు శ్రీకాకుళం జిల్లా నుండి పెద్దఎత్తున జర్నలిస్టుల హాజరైన సందర్భాలున్నాయని గుర్తుచేశారు. రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా పత్రికల్లో, లోకల్ టీవీ ఛానెళ్లల్లో పనిచేసే జర్నలిస్టులకు నియోజకవర్గానికి ఒకటి, జిల్లా కేంద్రంలో డెస్క్ జర్నలిస్టులకు గతంలో అక్రిడిటేషన్లు ఇచ్చేవారని, అదే పద్ధతిని అవలంభించాలని కోరారు. మీడియా అకాడమి గవర్నింగ్ బాడీలో అన్ని జర్నలిస్టుల సంఘాలకు ప్రాతినిధ్యం ఉండాలని, జర్నలిస్టులందరికీ రైల్వే పాసులు మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వాలు మారిన ప్రతి సందర్భంలోను జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇస్తామని చెబుతూ ఆ తర్వాత వాటిని విస్మరిస్తున్నారన్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు సదాశివుని కష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విశాఖ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.నారాయణ, జి .శ్రీనివాస్ రావు ఏపీబీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు ఇ.ఈశ్వరరావు, ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి జి.లక్ష్మణరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, జిల్లా బాధ్యులు సువ్వారి మురళీధర్, డి.ఆనందరావు, తోట భీమారావు, బగాది వాసుదేవరావు, జి.నర్సింగరావు, బేరి చిన్నారావు, బహదూర్‌భాషా, ఎస్.విజయ్‌కుమార్, వివిధ జర్నలిస్టు సంఘాల నేతలు ఎస్.జోగినాయుడు, జి.షణ్ముఖరావు, ఒంపూరు రమేష్, రాధాకుమారి, రౌతు సూర్యనారాయణ, గంజి ఆర్.ఎజ్రా, కిల్లి శ్రీను, ఎం.సుదర్శన్, డి.హేమసుందర్, భాసూరు సాయి, సీపాన రమేష్, కె.కొండబాబు, ఎం.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తొలుత ఆంజనేయులును ఎన్జీజీవోస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హనుమంతుసాయిరాం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయి వేణుగోపాల్, చల్లా శ్రీనివాస్, శ్రావణి, వాకర్స్ ఇంటర్నేషనల్ పూర్వ గవర్నర్ కొంక్యాన మురళీధర్ శాలువా కప్పి సత్కరించారు.
జర్నలిస్ట్ లకు అన్ని
విధాలాఅండగా ఉంటాం
.........
పోలవరం ఎమ్మెల్యే
శిర్రి బాలరాజు ఉద్ఘాటన
................
మీడియా అక్రిడీటేషన్ కమిటీ సభ్యులు శంకరరావు,కళ్యాణ్ లకు సత్కారం
.......
జంగారెడ్డిగూడెం /జీలుగుమిల్లి
కూటమి ప్రభుత్వం మీడియాకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్న దని
పోలవరం నియోజకవర్గం లోను మీడియా కు తోడ్పాటు నివ్వాలని ఆదేశాలున్నాయని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్పష్టంచేశారు.తన నియోజకవర్గం లో ప్రతి జర్నలిస్ట్ కు భీమా సౌకర్యం కల్పిస్తామని అలాగే ఇంటి నిర్మాణం కోసం స్థలం కూడా మంజూరు చేయాలనే ఆలోచన తో వున్నామని పేర్కొన్నారు.
జీలుగుమిల్లి లో మంగళవారం ఏపి వర్కింగ్ జర్నలిస్ట్ లఫెడరేషన్ ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు. జర్నలిస్ట్ లు అంటే తనకు మొదటి నుంచీ ఎంతో అభిమానం అని గతం లో వారికీ రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా హెల్మెట్ లు కూడా ఇచ్చామని గుర్తు చేశారు. మీడియా లో కొందరు ఇబ్బంది కరమైన వారున్నారని సోషల్ మీడియా పేరుతో అసంబద్ద వార్తలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. అటువంటి వారిపై ఉక్కు పాదం మోపుతామని హెచ్చరిక చేశారు.అసెంబ్లీ సమావేశాలతరువాత నియోజకవర్గం లోని అన్ని మండలాల వారికీ స్థలం ఇస్తా మని పేర్కొన్నారు. విలేకరుల లో కూడా మధ్య తర్గతి వారు వున్నారని అటువంటి వారికీ న్యాయం చెయ్యాలని అన్నారు.
కార్యక్రమం లో రాష్ట్ర జనసేన కార్యదర్శి గడ్డ మణుగు రవి కుమార్, శాప్ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి పాల్గొన్నారు.
.............
జర్నలిస్ట్ ల సమస్యలు సానుభూతి తో పరిష్కారం చెయ్యాలి
..............
ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫేడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు ప్రసంగిస్తూ జర్నలిస్ట్ లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
జీలుగు మిల్లి పాత్రికేయులకు అన్ని విధాలా అండగా ఉంటామన్న ఎమ్మెల్యే కి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
శాసన సభ్యుడు బాలరాజు
ప్రభుత్వం దృష్టిలో వాటిని ఉంచాలని కోరారు. కార్యక్రమం లోభాగంగా నియోజకవర్గం నూతన కమిటీ ఎన్నికజరిగింది అధ్యక్షుడు గా కొప్పుల సాయి, కార్యదర్శి గా బుట్టాయి గూడెం కు చెందిన మధు, కోశాధికారిగాచిట్టీ బొమ్మ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా లక్షణ రావు
ఎన్నికయ్యారు.
...........
జిల్లా అక్రిడిటేషన్ సభ్యులకు ఆత్మీయ సత్కారం
................
సమావేశం లో
జిల్లా అక్రిడిటేషన్కమిటీ సభ్యులు కె ఎస్ శంకరరావు, పి కళ్యాణ్ బాబు లను నియోజకవర్గం అధ్యక్షులు గా కొప్పుల సాయి, కార్యదర్శి మధు తదితర జీలుగుమిల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు సత్కరించారు.ఏపీ డబ్ల్యూ జె ఎఫ్ ఏలూరు జిల్లా కమిటీ అధ్యక్షులు ఎస్ డి జబీర్,
కార్యదర్శి హరీష్
బి సి ఎన్ ఛానల్ అధినేత షకిల్ బాబ్జి, మంజీర గళం అధినేత శేఖర్,సీనియర్ జర్నలిస్ట్లు ఎన్.వి. అప్పారావుతో పాటు పలువు రినిసన్మానించ్చారు.కార్యక్రమం లో
బొంతు రామకృష్ణ, కడిమి సాయి, కొల్లం రవికుమార్, కంచర్ల సుబ్రహ్మణ్యం, జాల వంశి, బట్టు సందీప్, మారుమూడి జయంత్, కూరాకుల రామాంజనేయులు, గాడిచర్ల శ్రీనివాస్, మరిదు మంగరాజు, మేకల మంగరాజు, జాన్ మోసెస్, ఒరిగేటి బెంజ్, ఒబిలి శెట్టి రవితేజ, చిత్తపుడి పవన్ కుమార్, కొప్పుల రాము తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.
489 మంది అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు
జర్నలిజం పేరిట అనైతిక, అవాంఛనీయ ధోరణలను ఉపేక్షించం
జిల్లా కలెక్టర్
కాకినాడ జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ రెండవ విడత సమావేశం మంగళవారం కలెక్టరేట్ కోర్టు హాలులో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో 2026-2027 ద్వైవార్షిక కాలానికి అక్రిడిటేషన్లు కోరుతూ, మీడియా సంస్థలు, వారి ప్రతినిధుల నుండి అందిన 311 ధరఖాస్తులను మీడియా అక్రిడిటేషన్ నిబంధనలు ప్రకారం కమిటీ పరిశీలన చేసి అర్హులైన 252 మందికి అక్రిడిటేషన్ల జారీకి ఆమోదించింది.అర్హతలు సమర్పించలేక పోయిన 59 ధరఖాస్తులను డిఫర్ చేసింది. గత నెల 29వ తేదీన జరిగిన కమిటీ తొలి సమావేశంలో 237 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు జారీ చేయగా, మంగళవారం జరిగిన రెండవ సమావేశంలో కమిటీ మరో 252 మందికి అక్రిడిటేషన్లు ఆమోదించిందని జిల్లా కలెక్టర్ సమావేశానంతరం వెల్లడించారు. అక్రిడిటేషన్లు ఆమోదించిన జర్నలిస్టులు అందరికీ త్వరలోనే అక్రిడిటేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
ఈ సందర్భంగా జర్నలిస్ట్ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను జిల్లాలో అర్హులైన వారందరికీ సమగ్రంగా అందేలా చర్యలు గైకొంటున్నామని, సమాజాభివృద్ది, జిల్లా ప్రగతి కొరకు జర్నలిస్టులు తమ వంతు భూమికను నిబద్దతో చైతన్యవంతంగా నిర్విహించాలని కోరారు. జిల్లాలో కొంత మంది జర్నలిస్టులు ప్రతికూల వార్తలు వ్రాస్తామని అన్నవరం దేవస్థానం, సంక్షేమ హాస్టళ్ల అధికారులను ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడిన సంఘటనలు తన దృష్టికి వచ్చాయని, ఒకవేళ అక్రమాలు, తప్పులు జరిగి ఉంటే వార్తలు ప్రచురించాలే తప్ప, బెదిరింపులకు పాల్పడకూడదన్నారు. అటువంటి బెదిరింపులకు పాల్పడుతున్న జర్నలిస్టులపై చట్టపరమైన చర్యలు చేపడతామని జిల్లా కలెక్టరు స్పష్టం చేసారు. జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీలో వివిధ జర్నలిస్ట్ సంఘాల నుండి ప్రాతినిద్యం వహిస్తున్న సభ్యులు తమ తమ సంఘాల ద్వారా జర్నలిజం పేరిట ఇటువంటి అవాంఛనీయ ధోరణులను అరికట్టేందుకు సహకరించాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో కమిటీ మెంబర్ కన్వీనర్, డిఐపిఆర్ఓ ఆర్.వి.ఎస్.రామచంద్రరావు, ఎక్స్ అఫిషియో సభ్యులు, డిఆర్ఓ టి. తిప్పే నాయక్ , కమిటీ సబ్యులు ఎస్.శివన్నారాయణ రెడ్డి, ఎంఎన్. లక్ష్మణ్, జి.శోభన్ నవీన్ రాజ్ భాబు, వి.సాయినాథ్, కె.శ్రీనివాసరావు, టి.పల్లవరాజు, ఎస్.త్రిమూర్తులు, యం.కామేశ్వరరావు, పి.రాంబాబు, ఎన్.కె.దుర్రానీ, సిహెచ్.రాజారమేష్, సమాచార శాఖ ఏఈఐఈ సి.బాబూరావు, వైద్యఆరోగ్య, హౌసింగ్, ఆర్టీసీ, రైల్వే, కార్మిక శాఖల అధికారులు పాల్గొన్నారు.
26న జర్నలిస్టుల వినాయక చవితి వేడుకలు
600 మందికి మట్టి వినాయక విగ్రహం, వ్రతకల్పం, పూల, పండ్ల మొక్కలు పంపిణీ
అక్రిడేషన్ లపై వినతి పత్రాలు
జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి గంట్ల
అక్కయ్యపాలెం, ఆగస్టు 21
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపి బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ , ఏపి స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ల ఆధ్వర్యంలో ఈనెల 26న మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, ఫెడరేషన్ విశాఖ అధ్యక్షులు పి.నారాయణలు తెలిపారు. ఈ మేరకు గురువారం అక్కయ్యపాలెంలో ఒక ప్రయివేట్ హోటల్ లో ఆయా సంఘాల సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ప్రతీ ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా వినాయక చవితి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. నిరంతరం సమాజాభివృద్ధి కోసం పాటు పడుతున్న జర్నలిస్టుల సంక్షేమంతో పాటు ఆయా పండుగలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఇందులో భాగంగానే 26న ఆశీలమెట్ట వేమన మందిరంలో ఉదయం 10 గంటల నుంచి 600 మంది జర్నలిస్టులకు మట్టి వినాయక విగ్రహం, వినాయక వ్రతకల్పం, పూల, పండ్ల మొక్కలను అందజేయనున్నట్లు చెప్పారు. కావున జర్నలిస్టులు ఆయా కార్యక్రమంలో పాల్గొని మట్టి వినాయక విగ్రహాలను స్వీకరించాలని వీరు కోరారు. ఈ సమావేశంలో పలు అంశాలపై తాము చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. అలాగే అక్రిడేషన్లు కూడా అర్హులైన వారందరికి అందజేసే విధంగా మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు దశల వారీగా వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ కార్యదర్శి జి.శ్రీనివాసరావు, బ్రాడ్ కాస్ట్ అధ్యక్ష, కార్యదర్శులు ఇరోతి ఈశ్వరరావు, కె.మధన్, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్ మోహన్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు బి..శివ ప్రసాద్ నాయుడు, సత్య నారాయణ
ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ సభ్యులు మళ్ళ దేవ త్రినాధ్, డిపి నాయుడు, కె బాబురావు, అప్పలనాయుడు
స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు డీ చక్రపాణి, పీ వెంకట రెడ్డి,కోశాధికారి కే వీ శర్మ,సంయుక్త కార్యదర్శులు బీ ప్రసాద్, రాజశేఖర్,కార్యవర్గసభ్యుడు అరుణ్ భాస్కర్, రెడ్డి సాయి తో
పాటు పలువురు జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.
1980 దశకం వరకు బ్రాడ్‌కాస్ట్ మీడియాలో ప్రభుత్వ మీడియా మాత్రమే కొనసాగింది...
జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఏర్పడిన: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు గౌరవాధ్యక్షులుగా, వి యశోనాథ్, పి. శ్రీధర్ ఈశ్వర్, ఎస్ సౌజన్య, బివిఎల్ కె మనోహర్, వై. జోగిరెడ్డిలతో ఏర్పడిన సంఘం.
© APWJF All Rights Reserved.Design & Developed By